స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లగ్జరీ వాచ్ కలెక్షన్లో మరొకటి
కొత్త లుక్, అదరిపోయే టీ-షర్ట్,
ప్రతిష్టాత్మక ఐపీఎల్ 2024 సమరం శుక్రవారం షురూ అయింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, విరాట్ కోహ్లీ ఓ సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు. టీ20 క్రికెట్లో 12 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనతను అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈసందర్బంగా కోహ్లీ కొత్త లుక్, కొత్త టీషర్ట్, లగ్జరీ వాచ్ ఇవన్నీ క్రికెట్ ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి.
ఐపీఎల్ 2024 సిరీస్కోసం సిద్దమైన కోహ్లీ కొత్త హెయిర్ కట్, గడ్డంతో ముంబై విమానాశ్రయంలో చమక్‌మని మెరిసాడు. కోహ్లీ కొత్త లుక్ చూసిన ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించి ఫోటోలు ఇప్పటికీ నెట్టింట్ చక్కర్లు అవుతున్నాయి.
అంతేకాదు ఇటీవల రెండో బిడ్డకు తండ్రి అయిన కోహ్లి తెల్లటి టీ-షర్టులో మరింత అందంగా కనిపించాడు. దీనిపై యానిమేషన్ క్యారెక్టర్ బొమ్మతోపాటు, డాడ్(DAD) 'డక్ డక్ గూస్' అని రాసి ఉండటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది తన పిల్లలపై ఉన్న ప్రేమను నిదర్శనమంటూ కమెంట్స్ వినిపించాయి. ఈ టీ-షర్టు ధర రూ.2,076(24.95 డాలర్స్) అని సమాచారం.
అంతేనా లగ్జరీ వాచ్ కలెక్షన్‌ను సొంతం చేసుకున్న కోహ్లీ మరో లగ్జరీ వాచ్ కూడా హాట్ టాపిక్‌గా నిలిచింది. దీని ధర 38.77 లక్షల అని అంచనా. కుడి చేతికి ధరించి ఈ సొగసైన వాచ్ లగ్జరీ రోలెక్స్ బ్రాండ్‌ది. బ్లాక్ డయల్, మరో మూడు సిల్వర్ కలర్ డయల్స్, బ్లాక్ బెల్ట్‌తో రోలెక్స్ డేటోనా బేబీ లే మాన్స్ ఓస్టెర్ఫ్లెక్స్ సూపర్ లావిష్ వాచ్ ఇది. కోహ్లి భయ్యా..సూపర్ కూల్ అవుట్‌ఫిట్ అంటూ క్రికెట్ అభిమానులు మురిసి పోయారు.
కాగా కోహ్లీ, భార్య బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ దంపతులకు ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్‌లో కుమారుడు అకాయ్ జన్మించాడు. వీరికి ఇప్పటికే వామిక అనే పాపకూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment