అమ్మీకోసం ఓ ఇల్లు! | Aamir Khan wish on 51st birthday; to buy ancestral house for mother | Sakshi
Sakshi News home page

అమ్మీకోసం ఓ ఇల్లు!

Published Mon, Mar 14 2016 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

అమ్మీకోసం ఓ ఇల్లు!

అమ్మీకోసం ఓ ఇల్లు!

ఆమిర్ ఖాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. ఇది సినిమా లెక్క కాదు. ఈ మిస్టర్ పర్‌ఫెక్ట్ వయసు లెక్క. సోమవారం ఆయన 51లోకి అడుగుపెట్టారు. పుట్టినరోజునాడు మీడియాను కలవడం ఆమిర్‌కి ఇష్టం. విదేశాల్లో ఉంటేనో, వేరే ఏదైనా బలమైన కారణం ఉంటేనో మాత్రమే మీడియాని కలవరు. ఈసారి ఎప్పటిలానే ఉదయం తన స్వగృహంలో మీడియా సమక్షంలో బర్త్‌డే కేక్ కట్ చేసి, కొన్ని విశేషాలు పంచుకున్నారు. ‘‘మా అమ్మీ (అమ్మ) కోసం ఓ ఇల్లు కొనాలనుకుంటున్నా’’ అని ఆమిర్ చెప్పడం ముచ్చటగా అనిపించింది. ఆమిర్ మాట్లాడుతూ -‘‘మా అమ్మీ తన చిన్నతనాన్ని వారణాసిలోని మా పూర్వీకుల ఇంట్లో గడిపింది. ఆ ఇంటిని నేను కూడా చూశాను.

మా అమ్మీ పెరిగిన ఆ ఇంటిని కొనాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బర్త్‌డేకి నాకు ఉన్న అతి పెద్ద కోరిక ఏదంటే.. ఆ ఇల్లు కొనడమే. ప్రస్తుతం ఆ ఇంట్లో ఉంటున్నవాళ్లను రిక్వెస్ట్ చేశాను. వాళ్లు కనికరిస్తే, మళ్లీ మా పూర్వీకుల ఇంటిని సొంతం చేసుకుని, అమ్మీకి గిఫ్ట్‌గా ఇస్తా’’ అని చెప్పారు. ఇంకా తన భార్య కిరణ్ రావ్, కొడుకు అజాద్ గురించి ఆమిర్ చెబుతూ.. ‘‘ఈరోజు నాకు ముందుగా శుభాకాంక్షలు చెప్పింది మా అబ్బాయే. ఇదిగో ఇప్పుడు నేను వేసుకున్న టీ-షర్ట్ మా అబ్బాయి తయారు చేసినదే. కిరణే ఈ టీ-షర్ట్‌ని ప్రింట్ చేయించింది’’ అని ఆమిర్ మురిపెంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement