మరో లగ్జరీ అపార్ట్‌మెంట్ కొన్న స్టార్ హీరో.. ఎన్ని కోట్ల ఖరీదంటే? | Aamir Khan Buys New Apartment; Cost Details Inside | Sakshi
Sakshi News home page

Aamir Khan: ఇప్పటికే అరడజనుకి పైగా ఇళ్లు.. ఇప్పుడు మరొకటి కొనుగోలు

Published Fri, Jun 28 2024 11:45 AM | Last Updated on Fri, Jun 28 2024 12:05 PM

Aamir Khan Buys New Apartment; Cost Details Inside

రీసెంట్‌ టైంలో స్టార్ హీరోహీరోయిన్లు చాలామంది కొత్త ఇల్లు కొనేసి, ఓ ఇంటి వాళ్లవుతున్నారు. ఇదివరకు బాలీవుడ్ బ్యూటీస్ ఎక్కువ మంది బంగ్లా లేదా ఫ్లాట్ కొనడంలో కాస్త ముందుండేవాళ్లు. ఇప్పుడు ఈ లిస్టులోకి హీరో ఆమిర్ ఖాన్ కూడా చేరిపోయాడు. ఇప్పటికే అరడజనుకి పైగా ఇళ్లని కొనుగోలు చేసిన ఇతడు.. తాజాగా మరో ఖరీదైన అపార్ట్‌మెంట్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ తెలుగు సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)

ముంబైలోని చాలా ఖరీదైన ప్రాంతంగా పేరున్న పలిహలి ఏరియాలో ఓ సూపర్ లగ్జరీ రెడీ టూ మూవ్ అపార్ట్‌మెంట్‌ని ఆమిర్ ఖాన్ ఇప్పుడు కొన్నట్లు సమాచారం. దీని విలువ దాదాపు రూ.9.75 కోట్లు అని, జూన్ 25నే దీని కొనుగోలు పూర్తయిందని తెలుస్తోంది. ఇందుకోసం రూ.58.5 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాడని జాతీయ న్యూస్ సైట్లు రాసుకొచ్చాయి.

ఇదిలా ఉండగా ఇప్పటికే ఆమిర్ ఖాన్‌కి ముంబైలోని మెరీనా, బాంద్రాలో సముద్రం ఒడ్డున, పంచగనిలో ఫామ్ హౌస్ ఉన్నాయి. అలానే ఉత్తరప్రదేశ్, ఢిల్లీలోనూ ఆస్తులు ఉన్నట్లు సమాచారం. 'లాల్ సింగ్ చడ్డా' తర్వాత యాక్టింగ్ పక్కనబెట్టేసిన ఆమిర్.. ప్రస్తుతం నిర్మాతగా మాత్రమే సినిమాలు చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం రెండో భార్య కిరణ్ రావ్‌కి విడాకులు ఇచ్చేసి ఒంటరిగా ఉంటున్నాడు.

(ఇదీ చదవండి: జైలులో హీరో దర్శన్.. ఇతడికి సపోర్ట్‌గా టాలీవుడ్ హీరో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement