ఆభరణాల కుట్టు!
న్యూలుక్
సంప్రదాయ సాదాసీదా జాకెట్టుకు అద్భుతమైన ‘కుట్టు’తో ఆకట్టుకోవడం మనకు తెలిసిందే! అలాగే పాశ్చాత్య ప్లెయిన్ టీ షర్ట్‌లు, ట్యూనిక్‌లు, క్రాప్ టాప్స్‌ను తీర్చిదిద్దితే... వాటికి ఆభరణాల సొగసు అద్దితే వచ్చే అందమే వేరు. ప్యాంట్, స్కర్ట్స్ మీదకు వీటిని ధరిస్తే... వచ్చే లుక్కే వేరు!
⇔ మెటల్ పూసలు, చమ్కీలు, స్టోన్స్ ఇందుకోసం ఎంపిక చేసుకోవాలి. వీటిని గుచ్చడానికి ప్లాస్టిక్ దారం, సూది, గమ్ అవసరం అవుతాయి.
⇔ డిజైన్ చేసుకున్న చోట ముఖ్యంగా నెక్, స్లీవ్స్‌కి ఎలాంటి డిజైన్ బాగుంటుందో ముందే మార్క్ చేసుకోవాలి.
⇔ షర్ట్, లేదా ట్యూనిక్ కలర్ దానికి పూర్తి కాంట్రాస్ట్ పూసలు లేదా స్టోన్స్ ఎంచుకోవాలి.
⇔ దారంతో పూసలను గుచ్చి, మార్క్ చేసుకున్న చోట పెట్టి కుట్టు వేయాలి. స్టోన్స్ అయితే గమ్ (మార్కెట్లో దుస్తులకు అతికించి ఫ్యాబ్రిక్ గ్లూ దొరుకుతుంది)తో అతికించాలి.
⇔ సృజనకు ఆకాశమే హద్దులా దుస్తులకు ఆభరణాల సొగసు తేవడంలో హద్దులే లేవు.