
ఫింగర్ మిల్లెట్ కేక్ తయారీకి కావల్సినవి:
ఫింగర్ మిల్లెట్ (రాగి) పౌడర్ – 80 గ్రాములు, గుడ్లు – 8
గడ్డపెరుగు – 800 గ్రాములు (నీళ్లు పోయకుండానే.. ఒక బాటిల్‌లో వేసి.. 1 నిమిషం పాటు బాగా గిలకొట్టాలి)
పంచదార – అర కప్పు, నెయ్యి – కొద్దిగా
ఫింగర్ మిల్లెట్ కేక్ తయారీ విధానమిలా
ముందుగా ఒక బౌల్‌లో గిలకొట్టుకున్న పెరుగు, రాగి పౌడర్, పంచదార వేసుకుని హ్యాండ్ బ్లెండర్‌తో పంచదార కరిగే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో గుడ్లు కూడా వేసుకుని మరోసారి మొత్తం కలుపుకోవాలి. చివరిగా కేక్ బౌల్‌కి నెయ్యి పూసి.. అందులో ఈ మిశ్రమాన్ని వేసి.. ఓవెన్‌లో పెట్టుకుని బేక్ చేసుకోవాలి. అనంతరం నచ్చిన విధంగా కేక్‌ని గార్నిష్ చేసుకుని, ముక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment