వారసత్వంగా పరిచయమై కొంతమంది పేరు తెచ్చుకుంటే.. మరి కొంతమంది తమ ప్రతిభతో కుటుంబానికి వన్నె తెస్తారు. అలాంటి వారిలో బాల నటి మనస్వి కొట్టాచ్చి ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంటరై, తండ్రికే పోటీ ఇచ్చి, వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ లిటిల్ స్టార్ గురించి∙ కొన్ని విషయాలు..
⇒ నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. రకరకాల నాన్‌వెజ్ ఐటమ్స్ తినొచ్చనే నాన్నతో కలిసి షూటింగ్స్‌కు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు నటనపై ఇష్టం, ప్రేమతో పాటు సీరియస్‌నెస్ కూడా పెరిగింది.
– మనస్వి కొట్టాచ్చి.
⇒∙చెన్నైలో పుట్టి, పెరిగిన మనస్వి తమిళ హాస్య నటుడు కొట్టాచ్చి కుమార్తె. కొట్టాచ్చి తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు పొందాడు.
⇒ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సినీ ప్రపంచంలోనే ఉంది మనస్వి. మూడేళ్ల వయసులో ‘సూపర్ డాడీ’ టీవీ షో ద్వారా తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
⇒ చెన్నైలో పుట్టి, పెరిగిన మనస్వి తమిళ హాస్య నటుడు కొట్టాచ్చి కుమార్తె. కొట్టాచ్చి తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు పొందాడు.
⇒ఈ చిన్నారి నటనకు ముచ్చటపడిన మలయాళ చిత్రపరిశ్రమా చక్కటి అవకాశాలను ఇచ్చింది. అందులో ఒకటే ‘మై శాంటా’ మూవీ. ఇందులో ఆమెది ప్రధాన పాత్ర. శ్రీమణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ చిత్రం ‘కన్మణి పాప’లోనూ ముఖ్య భూమికే!
⇒ తర్వాత ‘ఇమైక్క నొడిగళ్’ అనే చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఇందులో నయనతార కుమార్తెగా నటించింది. ఇది ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆపై ‘దర్బార్’, ‘మామణిదన్’, ‘చంద్రముఖి–2’ వంటి సినిమాల్లోనూ
నటించింది.
⇒మనస్వి నటించిన ‘మామణిదన్’ను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. దాని ఫలితంగా మనస్వికి బాలీవుడ్‌లోనూ చాన్స్ వచ్చింది. ఆమె నటించిన హిందీ సినిమా ‘బేబీ కాజల్’ విడుదలకు సిద్ధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment