Little Stars
-
లిటిల్ స్టార్స్.. చిల్డ్రన్స్ డే స్పెషల్
-
Sakshi Little Stars: తారే జమీన్ పర్
‘మేం పాటలు పాడతాం. డైలాగ్స్ గుక్కతిప్పుకోకుండా చెప్పేస్తాం. పొడుపుకథలు వేస్తాం, ప్రశ్నలతో తికమక పెట్టేస్తాం. స్కూల్లో చదువుకుంటాం, సినిమాల్లో నటిస్తాం, డ్యాన్స్‌లే కాదు అల్లరి కూడా చేస్తాం ...’ అంటూ బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం ‘సాక్షి’ మీడియా హౌస్ హైదరాబాద్ ఆఫీసులో ఏర్పాటు చేసిన వేదిక ద్వారా పలువురు బాల తారలు తమ ఆనందాలను పంచుకున్నారు. స్కూల్ విద్యార్థులు అడిగిన పొడుపు కథలకు ఈ ‘లిటిల్ స్టార్స్’ ఆన్సర్ చేయడం, లిటిల్ స్టార్స్ కోరిన పాటలను స్కూల్ విద్యార్థులు పోటీ పడుతూ పాడటంతో కార్యక్రమం సందడిగా మారింది.స్కూల్లో రన్నింగ్, ఖోఖో, కబడ్డి, క్రికెట్, బాస్కెట్ బాల్... వంటి ఆటలన్నీ ఆడతాం అంటూ మొదలు పెట్టిన పిల్లలు కరెంట్ షాక్ ఎందుకు తగులుతుంది? బాల్ని కొడితే ముందుకు ఎలా వెళుతుంది? అంటూ సైన్స్ పాఠాలనూ వినిపించారు. లెక్కలు ఇష్టం అంటూనే డాక్టర్లం అవుతాం అనే భవిష్యత్తు ప్రణాళికలనూ చెప్పారు. సోషల్ మీడియాలో తమకున్న ఫాలోవర్స్ గురించి, చేస్తున్న రీల్స్ గురించి వివరించారు. ‘సాక్షి’ మీడియా హౌస్ వారం రోజుల పాటు జరిపిన ‘లిటిల్ స్టార్స్’ కార్యక్రమంలో భాగంగా కలిసిన చిన్నారులను గుర్తుకు తెచ్చుకొని, ‘మరో ప్రపంచం తెలుసుకున్నాం’ అంటూ తమ స్పందనను తెలియజేశారు బాల తారలు. టీవీ చానల్‌కి సంబంధించిన న్యూస్‌రూమ్, పీసీఆర్ వంటి వాటిని చూసి సంభ్రమాశ్చర్యాలను వెలిబుచ్చారు.మేమిద్దరం కవలలం. కలిసే చదువుకుంటాం. సినిమాల్లోనూ కలిసే వర్క్ చేస్తాం. మేం ఇద్దరం పెద్దయ్యాక సాఫ్ట్వేర్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం. ఈ ్రపోగ్రామ్ ద్వారా మా ఇద్దరి ఆలోచనలను, మా ప్రతిభను షేర్ చేసుకునే అవకాశం లభించింది. ఇక్కడ న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకొని ఆశ్చర్యపోయాం. ఈ చిల్డ్రన్స్ డే మాకు వెరీ వెరీ స్పెషల్. – అర్జున్, అర్విన్నాకు నటుడిగా గుర్తింపు వచ్చిందంటే మా అమ్మే కారణం. ఇప్పటి వరకు పది సినిమాల్లో బాల నటుడిగా నటించే అవకాశం వచ్చింది. సినిమా చూసిన తరువాత స్కూల్లో ఫ్రెండ్స్ నీ క్యారెక్టర్ సూపర్‌గా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు. రెండు మూడు పేజీల డైలాగ్‌లు కూడా ఒకేసారి చెప్పగలను. ఈ కార్యక్రమం ద్వారా నేను సినిమాల్లోని డైలాగ్స్ చెప్పే అవకాశం లభించింది. అలాగే, న్యూస్ ఎలా రెడీ అవుతుందో తెలుసుకున్నాను. ఈ పోగ్రామ్ మాకు పాఠంలా కొత్తదనాన్ని పరిచయం చేసింది. థాంక్యూ సాక్షి.– కె. హర్షచదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!ఏడేళ్ల వయసు నుంచి సినిమాలలో నటిస్తున్నాను. చదువు, సినిమాలతో పాటు బాస్కెట్ బాల్, క్రికెట్, డ్యాన్స్ కూడా చాలా ఇష్టం. స్కూల్, సినిమా షూటింగే కాదు ‘సాక్షి’ ఏర్పాటు చేసిన ‘లిటిల్‌స్టార్స్’లో భాగంగా నిస్సహాయ స్థితిలో ఉన్న పిల్లలను కలిసినప్పుడు చాలా బాధపడ్డాను. తలస్సేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలను చూసి, అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాను. అలాగే ఈ ఫైనల్ ఈవెంట్లో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలోని డైలాగ్ చెప్పినప్పుడు అందరూ గ్రేట్ అంటూ మెచ్చుకుంటే చాలా ఆనందంగా అనిపించింది. మమ్మల్ని ఎంకరేజ్ చేసే ఈ ్రపోగ్రామ్ చాలా బాగుంది. అందరికీ థ్యాంక్స్. – మోక్షజ్ఞతలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను కలవడానికి ‘సాక్షి’ మీడియా ద్వారా వెళ్లాను. చిన్న చిన్న పిల్లలు ఆ వ్యాధితో బాధపడుతుండటం చూసి, చాలా బాధగా ఫీలయ్యాను. కాసేపు వాళ్ల బాధని మరచిపోయేలా చేయాలని వాళ్లు అడిగిన డైలాగ్స్ చెప్పాను. వాళ్లను ఎంకరేజ్ చేసేలా మాట్లాడాను. మామూలుగా నేను చదువుకుంటాను, సినిమాలు చేస్తుంటాను. రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాను. అలాంటి నాకు ఇలాంటి పిల్లలతో కాసేపు టైమ్ స్పెండ్ చేయడం ఓ డిఫరెంట్ వరల్డ్‌లోకి వెళ్లినట్లు అనిపించింది. ఇక ‘సాక్షి మీడియా’ హౌస్‌లో ఏర్పాటు చేసిన ‘‘లిటిల్‌స్టార్స్’లో నాతోటి యాక్టర్స్‌తో కలిసి ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. – అనన్య ఈగ3చేసే పనిపై ఇష్టం ఉంటుంది కాబట్టి చదువు–సినిమా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటాను. ఈ ్రపోగ్రామ్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘స్పర్శ్’ హాస్పిస్ కేంద్రంలో సేవలు పొందుతున్న చిన్నారులను కలిశాం. వారి పరిస్థితి చూశాక చాలా బాధ అనిపించింది. వారి ముఖాల్లో నవ్వులు తెప్పించాలని డ్యాన్స్‌లు చేశాం, పాటలు పాడాం... ఈ ఎక్స్‌పీరియన్స్‌ను ఎప్పటికీ మరిచిపోలేను. ఈ చిల్డ్రన్స్ డే మాకు సాక్షి ఇచ్చిన ఓ పెద్ద గిఫ్ట్. – సయ్యద్ ఫర్జానారైతు స్వరాజ్య వేదిక ద్వారా అక్కడి పిల్లలను కలిసినప్పుడు వాళ్లు ఎంత కష్టపడుతున్నారో అనిపించింది. వాళ్ల నాన్న చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ బాగా చదువుకుని, అమ్మను బాగా చూసుకుంటాం అని వారు చెప్పినప్పుడు ‘గ్రేట్’ అనిపించింది. అలాగే కలెక్టర్ అవుతామని, డాక్టర్ అవుతామని వాళ్లు తమ భవిష్యత్తు గురించి, తమ ప్లాన్స్ గురించి చెప్పినప్పుడు వారి ధైర్యం చూసి భేష్ అనిపించింది. ఈ కార్యక్రమం ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని చూశాం. – హనీషఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న పిల్లలను చూసినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను. తర్వాత వాళ్లను హ్యాపీగా ఉంచాలనిపించింది. అందుకే మాటలు, పాటలతో వారితో కలిసిపోయాను. ఇంటికి వెళ్లాక మా నాన్నతో ఆ విషయాలన్నీ పంచుకున్నాను. ‘సాక్షి మీడియా’ వల్ల వాళ్లను కలిసి, నా వంతుగా కాసేపు వాళ్లని సంతోషపెట్టడానికి ట్రై చేశాను. ఈ చిల్డ్రన్స్ డే నాకెప్పటికీ గుర్తుండిపోతుంది. – సాన్వికమూడేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నాను. నేను కోపం, బాధ, హ్యాపీ సీన్లలో బాగా నటిస్తాను అని చెబుతారు. ఏడుపు సీన్లలో గ్లిజరిన్ లేకుండా నటించడం చూసి, అందరూ మెచ్చుకున్నారు. టీవీలో అందరి ముందు నా టాలెంట్‌ను ప్రదర్శించే అవకాశం లభించింది. ఇప్పుడు స్వయంగా టీవీ న్యూస్‌రూమ్, స్టూడియో... ఇవన్నీ చూడటం కొత్తగా అనిపించింది. – ఖుషీ రెడ్డిమూడేళ్ల నుంచి సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు 25 యాడ్స్, 30 సినిమాల్లో నటించాను. హిందీ మూవీలో కూడా నటించాను. డ్యాన్స్, సంగీతం నేర్చుకుంటున్నాను. బాలరత్న అవార్డు కూడా వచ్చింది. ‘సాక్షి’ మీడియాతో కలిసి రైతు స్వరాజ్య వేదికకి వెళ్లి అక్కడి పిల్లలతో మాట్లాడటం బాగా అనిపించింది. ‘మా నాన్న లేరు’ అని వాళ్లు చెప్పినప్పుడు ఏడుపొచ్చింది. ఇక ఫైనల్ ఈవెంట్లో గోగో (బొమ్మ)తో మాటలు బాగా నచ్చాయి. ఎంత టైమ్ స్పెండ్ చేశామో తెలియనే లేదు. – శ్రేష్ట కోటకేంద్రీయ విద్యాలయాలో చదువుకుంటున్నాను. సినిమాల్లో నటిస్తున్నాను. తబలా వాయిస్తాను. డ్యాన్స్, మ్యూజిక్ నేర్చుకుంటున్నాను. సీరియల్స్‌లో కూడా నటిస్తున్నాను. ‘బాలోత్సవం’లో నాకు వచ్చిన పాటలు పాడాను. అందరూ సూపర్ అని మెచ్చుకున్నారు. – శ్రేయాన్ కోటఈ కార్యక్రమం ద్వారా తలసేమియాతో బాధపడుతున్నవారిని కలిశాను. వారిని నవ్వించాను కూడా... పాటలు పాడాను, డ్యాన్సులు చేశాను. అలాగే బుధవారం జరిగిన వేడుకలో నాలా సినిమాల్లో నటిస్తున్న మిగతా అన్నయ్యలు, అక్కలను కలుసుకోవడం హ్యాపీగా అనిపించింది. మా ఇష్టాలు, చదువు, ఆటలు, పాటలు, డైలాగ్స్ మీ అందరికీ చెప్పడం.. అన్ని విషయాలను షేర్ చేసుకోవడం బాగుంది. గోగో (బొమ్మ)తో బాగా ఎంజాయ్ చేశాం. – తనస్విఎం.ఎన్.జె. క్యాన్సర్ హాస్పిటల్లో చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్లని చూడగానే ఫస్ట్ చాలా ఏడుపొచ్చింది. అయితే మేం వాళ్లని హ్యాపీ చేయడానికి వెళ్లాం కాబట్టి, వాళ్లతో జోక్‌గా మాట్లాడాను. వాళ్లు నవ్వడం హ్యాపీ అనిపించింది. అలాగే ‘సాక్షి’ టీవీకి వచ్చి, అందరితో మాకు క్లాసులు చెప్పినవి, మేం సినిమాల్లో చేసినవి షేర్ చేసుకోవడం హ్యాపీ. పెద్దయ్యాక మహేష్‌బాబులాగా పెద్ద హీరోని అవుతాను. ఇక్కడ గోగో (బొమ్మ)తో కలిసి చేసిన అల్లరి బాగుంది. అలాగే, మాకు అన్ని న్యూస్ రూమ్‌లు చూపించారు. చాలా కొత్తగా అనిపించింది. – స్నితిక్చిన్ని మనసులు కదిలిన వేళ...పసి హృదయాలు కదిలిపోయాయి. చిన్న మనసులే అయినప్పటికీ తోటి చిన్నారులు పడుతున్న బాధ చూసి, చలించిపోయాయి. బాలల దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు ‘సాక్షి’ మీడియా హౌస్ జరిపిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా కేన్సర్, తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను, మృత్యువుతో పోరాడుతున్న పసిబాలలకు, తండ్రిని కోల్పోయిన వారిని, అనాథ బాలలను కలిశారు పలువురు బాల తారలు. కాసేపు ఆ చిన్నారులు తమ కష్టాన్ని మరచిపోయేలా చేసి, వారితో ఆడి పాడారు... నవ్వించారు. చివరగా ‘సాక్షి’ మీడియా హౌస్‌లో జరిగిన వేడుకలో స్కూల్ విద్యార్థులతో కలిసి ఈ బాల తారలు సందడి చేశారు. ఈ ‘బాలల దినోత్సవం’ ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.టీవీలో న్యూస్ చదువుతారు కదా.... ఆ రూమ్ ఎలా ఉంటుందో చూస్తారా? ఎడిటింగ్ ఎలా జరుగుతుందో చూడాలని ఉందా? అసలు టీవీ స్టూడియో ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా? అనడమే ఆలస్యం ‘ఓ’ అంటూ ఆసక్తి కనబరిచారు లిటిల్ స్టార్స్. ‘సాక్షి టీవీ’ న్యూస్ రూమ్, పీసీఆర్ (ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్) వంటివి చూసి, ఆశ్చర్యపోయారు. టీవీ స్టూడియోలో జరుగుతున్న పనులను నిశితంగా గమనించారు.ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి ఈ QRకోడ్‌ను స్కాన్ చెయ్యండి -
అనాధ పిల్లలను కలిసిన సుకుమార్ కూతురు సుకృతి
-
హైదరాబాద్ MNJ క్యాన్సర్ హాస్పిటల్లో....
-
Sakshi Little Stars: ఆశీస్సులే ఆయువు
ఆశ తొణుకుతున్నప్పుడుఆశీస్సు దానిని నిలబెట్టవచ్చు. ఔషధం ఓడుతున్నప్పుడు ప్రార్థన దానిని గెలిపించవచ్చు. అశ్రువు ఉబుకు తున్నప్పుడు ఆర్ద్రత దానిని మందస్మితం చేయవచ్చు. డబ్బు ఖర్చు లేని అనంత దయ, సేవ, ఆర్ద్రత, సాంత్వన మన వద్ద ఉంటాయి. నిజ హృదయంతో వెచ్చిస్తే పని చేస్తాయి. ఈ పిల్లలకు అవన్నీ కావాలి. ఈ పిల్లలు చిరంజీవులై వెలగాలి. ‘సాక్షి’ మీడియా చైల్డ్ సెలబ్రిటీలతో తనదైన ప్రయత్నం చేసింది. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలలు ఒక పూట కువకువలాడారు. పకపక నవ్వారు.నవంబర్ 14 ‘బాలల దినోత్సవం’ నేపథ్యంలో ఎం.ఎన్.జె. కేన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుమారు 150 మంది చిన్నారులను పలకరించే ప్రయత్నం చేసింది సాక్షి మీడియా. ‘పొట్టేల్’. ‘సరిపోదా శనివారం’, ‘మన్మథుడు–2’ వంటి సినిమాల్లో నటించిన బాలతారలు ఖ్యాతి, సాన్విక, స్నితిక్, జాతీయ క్రీడాకారిణి కార్తీకలను తీసుకొచ్చి వారితో ముచ్చటించేలా చేసింది. చైల్డ్ సెలబ్రిటీలు వారి కోసం ఆటలు, పాటలు, డ్యాన్సులతో అలరించారు. అలాగే తమ ఆరోగ్యస్థితిని చైల్డ్ సెలబ్రిటీలతో పంచుకున్నారు.నాకు ప్రస్తుతం బాగానే ఉంది. డాక్టర్లు బాగా చూసుకుంటున్నారు. నాకు అల్లు అర్జున్ సినిమాలంటే ఇష్టం. నన్ను కలవడానికి వచ్చిన సెలబ్రిటీల కోసం పుష్ప సినిమా పాట పాడాను. నా కోసం సాన్విక కూడా పాట పాడింది. వారితో కలిసి మాట్లాడటం హ్యాపీగా ఉంది.– జశ్వంత్మేం సిద్దిపేట నుంచి వచ్చాం. హాస్పిటల్ అంటే నాకు భయం.. కానీ ఇక్కడ బాగానే ఉంది. సినిమాల్లో నటించే వారు మా కోసం రావడం సంతోషంగా ఉంది. నాకు కూడా సినిమాలంటే ఇష్టం. చివరగా శ్యాం సింగరాయ్ సినిమా చూశాను. త్వరగా నయమైతే స్కూల్‌కు వెళ్లాలనుంది. – రిషి ప్రియ, సిద్దిపేటచాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. నాకు చదువంటే చాలా ఇష్టం, ముఖ్యంగా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. స్పైడర్‌మ్యాన్ నా ఫేవరెట్. సాన్విక అక్కతో ఆడుకున్నాను, లెక్కలు చెప్పాను. – ఓ చిన్నారి, జహీరాబాద్ బద్దీపూర్నాకు ఫుట్‌బాల్, దాగుడుమూతలు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు అవన్నీ ఆడుకోలేకపోతున్నాను. ఇలా బాధ పడుతున్న సమయంలో వీరంతా వచ్చి నాతో ఆడుకున్నారు. చాలా ముచ్చట్లు చె΄్పారు. నన్ను షూటింగ్‌కు తీసుకెళతానని కూడా చె΄్పారు. – చేతన్విభిన్న పేర్లతో పలు రకాల కేన్సర్లు ఉన్నప్పటికీ అవన్నీ హిమటలాజికల్ మ్యాలిగ్నెన్సెస్, సాలిడ్ ట్యూమర్స్ అనే రెండు విభాగాల కిందకు వస్తాయి. చిన్నారుల్లో దీర్ఘకాలం పాటు హై ఫీవర్, చలి జ్వరం, బ్లీడింగ్, చిగుర్లలో రక్తస్రావం.. శరీరంలో, చాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వయసుకు తగ్గట్టు బరువు పెరగక పోవడం లేదా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. సాలిడ్ ట్యూమర్స్‌లో పిల్లలు అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, ఫిట్స్ రావడం జరుగుతుంది. చికిత్స పొందుతున్న చిన్నారులకు క్యాన్సర్‌కు సంబంధించిన అవగాహన అంతగా ఉండకపోవడం వల్ల ఎక్కువగా భయం ఉండదు. కానీ నిత్యం హాస్పిటల్స్ చుట్టూ తిరగడం వల్ల మానసిక ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో వారికోసం ప్రత్యేకంగా ప్లే స్టేషన్ ఏర్పాటు చేశాం. ఇలాంటి వ్యాధితోనే ఇబ్బంది పడుతున్న ఇతర చిన్నారులతో మమేకం చేస్తాం. – అనుదీప్, మెడికల్ ఆంకాలజిస్ట్అవగాహన వచ్చిందికేన్సర్ గురించి కొంచెం అవగాహన ఉంది. అందుకే గతంలోనే ఇలాంటి చిన్నారుల కోసం నేను రెండుసార్లు నా హెయిర్ డొనేషన్ చేశాను. కానీ ఇలాంటి ప్లేస్‌కు రావడం ఇదే మొదటి సారి. వీరి విల్ పవర్ చూశాక సమస్య ల నుంచి ఎలా రాణించాలో ఒక అవగాహన వచ్చింది. మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చి ఈ చిన్నారులతో ఆడుకోవాలనుంది.– కార్తీక, నేషనల్ ప్లేయర్హెయిర్ డొనేట్ చేస్తానుఈ హాస్పిటల్లో చిన్నారులను చూశాకే కేన్సర్ ఎంత ప్రమాదకరమైనదో తెలిసింది. వారిని చూస్తుంటే ఏడుపొచ్చేసింది. నేను కూడా గతంలో ఇలాంటి వారి కోసం హెయిర్ డొనేట్ చేశాను. మళ్లీ కూడా చేయాలని ఇప్పుడు నిర్ణయించుకున్నాను. –ఖ్యాతి, సరిపోదా శనివారం ఫేమ్వీరిని చూశాక లోపల ఎంతో బాధ కలిగినప్పటికీ దానిని దాచి వీరందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నం చేశాను. పాటలు పాడాను, నాటు నాటు డ్యాన్స్ చేశాను. – సాన్విక, సరిపోదా శనివారంవీరందరినీ ఇలా చూస్తుంటే భయమేసింది. అందరికీ నయం అయి త్వరగా ఇంటికి పోవాలని కోరుకుంటున్నాను. అందరితో ఆడుకున్నాను, డ్యాన్సులు చేశాను. – స్నితిక్, పొట్టేల్ ఫేమ్భయం లేదు చికిత్సలు ఉన్నాయిఅనారోగ్యం అని తెలిశాక పరీక్షల నిర్థారణతో పాటు చికిత్సలో భాగంగా అన్ని సేవలు ఎం.ఎన్.జె. కేన్సర్ హాస్పిటల్లో ఉచితంగానే అందుతాయి. వ్యాధి దశను బట్టి చికిత్స కొనసాగుతుంది. ఈ చిన్నారులకు న్యూట్రిషన్ చాలా అవసరం. దీనికోసం కడల్స్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో మంచి న్యూట్రిషన్ అందిస్తున్నారు. చిన్నారుల వయస్సు, బరువును బట్టి ్రపొటీన్ ΄్యాకెట్స్, డ్రై ఫూట్స్ తదితరాలను అందిస్తున్నారు. కీమో, రేడియేషన్ వంటి చికిత్సల కోసం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్న వారికి చుట్టుపక్కల విడిదికి కూడా సహాయం చేస్తున్నారు. కేన్సర్ వ్యాధి జన్యుపరంగా కూడా వస్తున్నప్పటికి అది 15 నుంచి 20 శాతం మాత్రమే. కేన్సర్లకు పలు రకాల కారణాలున్నాయి. కేన్సర్‌కు ఇతర దేశాల్లో అందిస్తున్న అధునాతన చికిత్సకు మనకు వ్యత్యాసం పెద్దగా ఏమీ లేదు. మన దగ్గర కూడా లేటెస్ట్ ట్రయల్స్ మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ వారమంతా లిటిల్ స్టార్స్ సందడిని సాక్షి యూట్యూబ్‌లో చూడటానికి QR కోడ్‌ను స్కాన్ చెయ్యండి – డి.జి. భవాని– హనుమాద్రి శ్రీకాంత్ఫొటోలు: అనిల్ కుమార్ మోర్ల -
Little Star: అందమైన బాల్యానికి మహమ్మారి బంధనాలు
-
సాక్షి లిటిల్ స్టార్స్.. మట్టిబిడ్డలు (ఫోటోలు)
-
Manasvi Kottachi: బేబీ మనస్వి
వారసత్వంగా పరిచయమై కొంతమంది పేరు తెచ్చుకుంటే.. మరి కొంతమంది తమ ప్రతిభతో కుటుంబానికి వన్నె తెస్తారు. అలాంటి వారిలో బాల నటి మనస్వి కొట్టాచ్చి ఒకరు. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంటరై, తండ్రికే పోటీ ఇచ్చి, వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ లిటిల్ స్టార్ గురించి∙ కొన్ని విషయాలు..⇒ నాన్‌వెజ్ అంటే చాలా ఇష్టం. రకరకాల నాన్‌వెజ్ ఐటమ్స్ తినొచ్చనే నాన్నతో కలిసి షూటింగ్స్‌కు వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు నటనపై ఇష్టం, ప్రేమతో పాటు సీరియస్‌నెస్ కూడా పెరిగింది.– మనస్వి కొట్టాచ్చి.⇒∙చెన్నైలో పుట్టి, పెరిగిన మనస్వి తమిళ హాస్య నటుడు కొట్టాచ్చి కుమార్తె. కొట్టాచ్చి తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు పొందాడు.⇒ తనకు ఊహ తెలిసినప్పటి నుంచి సినీ ప్రపంచంలోనే ఉంది మనస్వి. మూడేళ్ల వయసులో ‘సూపర్ డాడీ’ టీవీ షో ద్వారా తొలిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.⇒ చెన్నైలో పుట్టి, పెరిగిన మనస్వి తమిళ హాస్య నటుడు కొట్టాచ్చి కుమార్తె. కొట్టాచ్చి తమిళ సినీరంగంలో మంచి గుర్తింపు పొందాడు.⇒ఈ చిన్నారి నటనకు ముచ్చటపడిన మలయాళ చిత్రపరిశ్రమా చక్కటి అవకాశాలను ఇచ్చింది. అందులో ఒకటే ‘మై శాంటా’ మూవీ. ఇందులో ఆమెది ప్రధాన పాత్ర. శ్రీమణి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ చిత్రం ‘కన్మణి పాప’లోనూ ముఖ్య భూమికే! ⇒ తర్వాత ‘ఇమైక్క నొడిగళ్’ అనే చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసింది. ఇందులో నయనతార కుమార్తెగా నటించింది. ఇది ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆపై ‘దర్బార్’, ‘మామణిదన్’, ‘చంద్రముఖి–2’ వంటి సినిమాల్లోనూ నటించింది.⇒మనస్వి నటించిన ‘మామణిదన్’ను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. దాని ఫలితంగా మనస్వికి బాలీవుడ్‌లోనూ చాన్స్ వచ్చింది. ఆమె నటించిన హిందీ సినిమా ‘బేబీ కాజల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
ఈ ఫేమస్ యాడ్స్‌లో ఉన్నవారిని గుర్తుపట్టారా?
అట్టర్లీ బట్టర్లీ... కార్టూన్స్ అంటే కళ్లను టీవీకి కట్టేసే పిల్లలు కమర్షియల్స్నూ కన్నార్పకుండా చూస్తారు.. తెలియని బ్రాండ్ ఉండదు.. కంఠతా రాని డైలాగ్స్, జింగిల్స్ ఉండవు.. అందులో పిల్లలు కనిపించే ప్రకటనలైతే చెప్పక్కర్లేదు.. ఆ చైల్డ్ మోడల్స్‌ను చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్‌లాగే భావించిన తరమూ ఉంది! ఆ జ్ఞాపకాలు మెదడు పొరల్లోనే ఉండిపోకుండా మనసుకూ మారుతూ తాజా పరుస్తున్నాయి. నాటి లిటిల్ స్టార్స్ నేడు ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో అన్న కుతూహలాన్ని కలిగిస్తున్నాయి.. ఫేస్బుక్లో సెర్చ్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాలన్నా.. వాళ్ల అసలు పేర్లు తెలియాలి.. మొహాలను పోల్చుకోగలగాలి.. కదా.. అందుకే ఆ పాత రోజులను...వాళ్ల ప్రెజెంట్ స్టేటస్‌ను పట్టుకొని వచ్చిందే ఈ కథనం.. ఈ అక్షరాల వెంట బాల్యాన్ని చేరుకోండి.. వర్తమానాన్నీ అందుకోండి. దేశంలో శ్వేత విప్లవానికి ప్రతీక అమూల్ పాలు.. పాల ఉత్పత్తులు. ఆ రోజుల్లో బొద్దుగా, ఆరోగ్యంగా ఉన్న ఏ పాపాయి కనపడ్డా ‘వావ్.. అమూల్ బేబీ’ అనుకునేవాళ్లట అసంకల్పితంగా. తల్లి పాలకు సమానమైన పోషకాలతో అమూల్ పాలు అనే వ్యాఖ్యతో ఆ బ్రాండ్ పాపులర్ అయింది. స్ట్రాంగ్ ఇండియాకు గుర్తుగా మారుమోగింది. అలాంటి అమూల్‌కు తొలి బేబీ మోడల్ .. ఫస్ట్ అమూల్ బేబీ ఎవరో తెలుసా? ప్రముఖ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సోదరి. కలర్లో మొదలైన అమూల్ యాడ్ ఫస్ట్ అమూల్ బేబీ కూడా శశి థరూర్ మరో చెల్లెలు. అది 1961 నాటి సంగతి. పాల వెల్లువ (శ్వేత విప్లవం) మొదలైన తొలినాళ్లలో అమూల్ పాల పొడి ప్యాకెట్ మీద మోడల్ కోసం పండంటి పాపాయిని వెదికే పనిలో పడింది అమూల్ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ. ఏడువందల పన్నెండు మంది పిల్లల ఫొటోలను పరిశీలించింది. రాజీ పడలేదు. మరిన్ని ఫొటోలను పరిశీలించాలనే ఉద్దేశంతో అమూల్ అడ్వర్టయిజ్ అండ్ సేల్స్ ప్రమోషన్ డైరెక్టర్‌కు శశిథరూర్ తండ్రి తెలిసి ఉండడంతో అతణ్ణి కలిశాడు. తన ప్రయత్నం గురించి చెబుతూ ఎందుకైనా మంచిది మీ పిల్లల ఫొటోలు కూడా ఒకసారి చూపించమని కోరాడు. తన కూతురు ఫొటో చూపించాడు. చారెడేసి కళ్లతో.. బొద్దుగా.. ఆరోగ్యంగా ఉన్న ఆ నెలల పాపను చూడగానే ‘అమూల్ బేబీ ఫౌండ్’ అన్నాడట డైరెక్టర్. కట్ చేస్తే అమూల్స్ప్రేకి మోడల్ అయింది ఆ బేబీ. పేరు శోభ. అమూల్‌కి ఫస్ట్ బేబీ మోడల్‌గా.. అమూల్ అట్టర్లీ బట్టర్లీ డెలీషియస్ ప్రకటనల్లో అందరినీ అలరించిన బేబీగా గుర్తుండి పోయింది. థరూర్ కుటుంబంతో అమూల్ అనుబంధం అక్కడితోనే ఆగిపోలేదు. కలర్లో వచ్చిన ప్రకటనకూ మోడల్‌గా ఆ ఇంటి పాపాయినే ఎంచుకున్నారు. తొలి మోడల్ శశిథరూర్ అక్కయ్య శోభ అయితే కలర్లో తొలి మోడల్‌గా శశిథరూర్ చెల్లెలు స్మిత ఎంపికైంది. శశిథరూర్ కూడా ఆ కుటుంబపు అమూల్ బంధాన్ని కొనసాగించారు. ఆయన అమెరికా నుంచి వచ్చాక.. రాజకీయాల్లో చేరాక.. అమూల్ కార్టూన్స్ క్యాంపెయిన్‌కి మోడల్ అయ్యారు. ముంబై, మెరైన్ డ్రైవ్‌లోని ఆ హోర్డింగ్స్‌ను చూసి శశిథరూర్ ‘ఇప్పుడు మా నాన్నగారు ఉండుంటే తన కొడుక్కూడా అమూల్ మోడల్ అయ్యాడని ఆనందపడేవారు’ అని చమత్కరించాడు. ఫస్ట్ అమూల్ బేబీ శోభ 1977లో ‘మిస్ కోల్కత్తా’ క్రౌన్ గెలుచుకుంది. స్మిత కూడా అందాల పోటీల్లో పాల్గొన ‘మిస్ ఇండియా’ రన్నరప్‌గా నిలిచింది. సామాన్యుడి స్నాక్స్.. పార్లే జీ బిస్కట్స్ కవర్ మీదున్న పాపాయికి సంబంధించి చాలా వదంతులు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో ఒకటి.. ఆ పాప ఎవరో కాదు చిన్నప్పటి సుధా మూర్తే అని. సుధా మూర్తి ఎవరో తెలుసు కదా.. ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి భార్య . రెండో వదంతేమో ఆ అమ్మాయి పేరు నీరూ దేశ్‌పాండే అని, నాగ్‌పూర్ నివాసి అని, ఆమె మూడో ఏట వాళ్ల నాన్న ఆ ఫొటో తీసి పార్లే జీ వాళ్లకు పంపితే .. దాన్ని పార్లే జీ వాళ్లు తమ బ్రాండ్ మస్కట్‌గా ఉపయోగించుకున్నారని. అయితే నిజం ఏంటంటే.. అదొక కల్పిత చిత్రం. 1960లో ఎవరెస్ట్ క్రియేటివ్స్ అనే సంస్థ దాన్ని చిత్రించింది. ఐయామ్ ఎ కంప్లాన్ బాయ్.. హూ.. ఐయామ్ ఎ కంప్లాన్ గర్ల్.. కంప్లాన్ యాడ్ అని వేరే చెప్పక్కర్లేదు. కాని ఆ కంప్లాన్ బాయ్, కంప్లాన్ గర్ల్ గురించే చెప్పాలి. ఒక్కసారి ఆ పాత కమర్షియల్‌ను జ్ఞాపకం చేసుకోండి. అందులో అన్నాచెల్లెళ్లుగా నటించిన ఆ ఇద్దరినీ ఇప్పుడు ఈజీగా పోల్చుకోగలుగుతాం. అప్పటి ఆ ఇద్దరి నవ్వులు, ఎక్స్‌ప్రెషన్స్‌ను కాస్త మనసు పెట్టి పరిశీలిస్తే ఇప్పటి ఆ ఇద్దరెవరో ఇట్టే తెలిసిపోతారు. అవును... ఆ కంప్లాన్ బాయ్.. ‘కబీర్ సింగ్’ షాహీద్ కపూర్. మరి కంప్లాన్ గర్ల్? ఇంకెవర్ తెలుగు సినిమా ‘సూపర్’ హీరోయిన్ ఆయేషా టకియా. చైల్డ్ మోడల్ దశ దాటాక టీన్స్‌లో వీళ్లిద్దరూ కలసి వీడియో ఆల్బమ్‌లోనూ నటించారు. వీళ్ల సినిమా ప్రయాణాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరూ చూసిందే.. చేస్తున్నదే. ఘర్ ఘర్ కీ రోనక్.. ...అనగానే 1960, 70ల్లో పిల్లలుగా ఉన్న పెద్దవాళ్లందరికీ గుర్తొచ్చే పదం ‘మర్ఫీ’. ఎస్.. ‘మర్ఫీ .. ఘర్ ఘర్ కీ రోనక్.. మర్ఫీ ఘర్ ఘర్ కీ ఛానక్ .. తరహ్ తరహ్ కే మర్ఫీ రేడియో లా దేతే హై ఘర్ మే జాన్’ అంటూ మహ్మద్ రఫీ పాడిన ఆ వ్యాపార ప్రకటనా గీతం ప్రార్థనా గీతంలా పాపులర్ అయిన బాల్యం అది. రేడియోకు పర్యాయపదంగా మారిన మర్ఫీ సృష్టించిన నోస్టాల్జియా ఘనమైనదే. చెక్క ఫ్రేముతో పోర్టబుల్ టీవీ పరిమాణంలో ఉండే ఆ కాలపు మర్ఫీ రేడియో ఇంట్లో ఉందంటే ఆ ఇంటి హోదాయే వేరు. మ్యాటీ క్లాత్ పరిచిన టేబుల్ మీద రేడియో ఉంటుంది ఠీవీగా. ఆ క్లాత్ ఆ ఇంటి ఇల్లాలి ఎంబ్రాయిడరీ కళతో మెరిసిపోతూంటుంది. రేడియో మీద దుమ్ము పడకుండా కప్పిన ఊలు కవరూ ఆమె కళానైపుణ్యమే. ఇవన్నీ మర్ఫీ రేడియో మురిపాన్ని పెంచిన ఆసక్తులైతే.. గర్భిణిలకు కలల బిడ్డగా ముద్దొచ్చిన వాడు.. మర్ఫీ రేడియో మీది బుగ్గల బుజ్జాయి. ఈ పిల్ల మోడల్ ఎంత ఫేమస్ అంటే మెటర్నిటీ క్లినిక్స్, ఆసుపత్రులు, బెడ్రూమ్స్లోని గోడల మీద.. ఆఖరుకు సెలూన్స్‌లో కూడా ఆ బుజ్జోడి ఫొటో క్యాలెండర్లే వేలాడేంతగా. ‘మర్ఫీ మున్నా’గా ప్రసిద్ధుడైన ఈ మోడల్ పేరు కాగ్యూర్ తుల్కు రిన్పోచే. మర్ఫీ యాడ్ కోసం నటిస్తున్నప్పుడు రిన్పోచే వయసు మూడేళ్లు. స్వస్థలం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి. నిజానికి మర్ఫీ కోసం కూడా మొదట్లో ఆడపిల్లనే మోడల్‌గా తీసుకున్నారు. అయితే ఆ అమ్మాయి చనిపోవడంతో అలాంటి పోలికలే ఉన్న పిల్లల్ని వెదుకుతున్న క్రమంలో రిన్పోచే కనిపించాడు. అలా రిన్పోచే మర్ఫీ మున్నా అయ్యాడు. అదే అతని మొదటి, చివరి వ్యాపార ప్రకటన. ఊహ తెలిసే వయసులో బౌద్ధారామంలో చేరాడు. దాదాపు 20 ఏళ్లు బౌద్ధ భిక్షువుగా ఉన్నాడు. తర్వాత ఢిల్లీకి మకాం మార్చాడు. బాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ మందాకినిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్లకు ఒక పాప కూడా. రిన్పోచే ప్రస్తుతం కుటుంబంతో కలసి ముంబైలో ఉంటున్నాడు. స్కూల్ టైమ్...యాక్షన్ కా స్కూల్ టైమ్.. ఆ సబ్ హెడ్ చూసి అర్థమైపోయి ఉంటుంది.. ఇది యాక్షన్ షూ టీవీ కమర్షియల్‌ను గుర్తుకు తెచ్చే కథనం అని. స్కూల్ టైమ్.. యాక్షన్ కా స్కూల్ టైమ్ అంటూ సాగే పాటలో అల్లరి పిల్లాడుగా వాసికెక్కిన ఆ చైల్డ్ మోడల్ పేరు తేజన్ దివాన్జీ. యాక్షన్‌కే కాకుండా మ్యాగీ, బ్యాండ్ ఎయిడ్కూ మోడలింగ్ చేశాడు 90ల చివరిదాకా. యాక్షన్‌లోని ఆ నాటీ బాయ్ ఇప్పుడు బాధ్యతగల డాక్టర్. రేడియేషన్ ఆంకాలజీ నిపుణుడు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్లో వైద్యాన్ని చదివిన తేజన్ అక్కడే బాల్టిమోర్‌లోని అడల్ట్ మెడికల్ సెంటర్లో వైద్యసేవలందిస్తున్నాడు. కోల్గేట్.. 1980ల్లోని పిల్ల తరానికి ఈ కోల్గేట్ ప్రకటనలోని బేబీ గుడ్డు.. నచ్చిన మోడల్. ఎందుకంటే అందరి పిల్లల్లాగే ఆమే టూత్‌పేస్ట్‌ను టేస్ట్ చేస్తుంది. ఇలాంటి సహజమైన పిల్ల చేష్టలతో నాటి చాలా ప్రకటనల్లో కనిపించిన బేబీ గుడ్డు మూడవ యేట నుంచే మోడలింగ్ మొదలుపెట్టింది. అసలు పేరు షాహిందా బేగ్ అయినా బేబీ గుడ్డుగానే సుపరిచితం. వ్యాపార ప్రకటనల్లోనే కాదు రజని వంటి దూరదర్శన్ సీరియళ్లు, సముందర్, ఆఖిర్ క్యోం, ఘర్ పరివార్, ఇన్స్పెక్టర్ ధనుష్ మొదలైన సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటోంది. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తోంది. గొంతులో కిచ్‌కిచ్ ఏం చెయ్యను.. ....అనగానే విక్స్ బిళ్లలతో కిచ్‌కిచ్ పోయేను అంటూ పూర్తిచేస్తారు ఏ తరంలోని పిల్లలైనా. అంత ప్రాచుర్యం ఆ జింగిల్. ఆ లిరిక్స్, ట్యూన్ ఎంత క్యాచీయో.. విక్స్ బిళ్లలదీ అంతే మజా అయిన రుచి. గొంతులో కిచ్‌కిచ్ లేకపోయినా కిచ్‌కిచ్ ఉన్నట్టు నటించి పెద్దవాళ్ల దగ్గర్నుంచి ఆ బిళ్లలను చప్పరించాలనే బాల్య చాపల్యం అది. దాన్ని చక్కగా నటించిన బేబీ మోడల్ ఇషితా అరుణ్. మోడల్ జయంత్ కృపలానీకి కూతురుగా ఆ యాడ్‌లో మూడేళ్ల ఇషితా నాటి పిల్లలను, పెద్దలను అందరినీ ఆకట్టుకుంది. ఆ ఇషితా అరుణ్ ఎవరో కాదు ప్రముఖ నటి, గాయని ఇలా అరుణ్ కూతురే. పెద్దయ్యాక ఇషితా కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్‌తోపాటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. వైశాలీ సామంత్ పాడిన, ఇషితా అభినయించిన ‘ఐక దాజీబా’ అనే ఆల్బమ్ సూపర్ హిట్ అయింది. ఐ లవ్ యూ రస్నా.. ...అంటూ పెదవులకు అంటిన రస్నాను చప్పరిస్తూ ముద్దు ముద్దుగా పలికిన అమ్మాయిని ఎవరు మరచిపోతారు?! అప్పటి పిల్లలను అమితంగా ఆకట్టుకున్న యాడ్ రస్నా. ఒకరకంగా పిల్లలే ఈ డ్రింక్‌ను ప్రమోట్ చేశారనొచ్చు. రస్నా బేబీగా ఫేమ్ తెచ్చుకున్న ఆ అమ్మాయి పేరు అంకితా ఝవేరి. తర్వాత తెలుగు, తమిళ, కన్నడభాషల సినిమాల్లో హీరోయిన్‌గానూ కనిపించింది. ‘సింహాద్రి’లోని ఇద్దరు కథానాయికల్లో ఒకరు అంకిత ఝవేరీనే. ఇప్పుడు పెళ్లి చేసుకొని విదేశాల్లో స్థిరపడిందని సమాచారం. శుద్ధ్ ధారా.. అలిగి ఇంట్లోంచి రోడ్డు మీదకు వచ్చిన అయిదారేళ్ల పిల్లాడికి తమ ఇంటికి ఉత్తరాలు మోసుకొచ్చే పోస్ట్ మాస్టర్ తారసపడ్తాడు. ‘రామూ కాకా..’ అని పిలుస్తాడు. ‘అరే బబ్లూ ఒక్కడివే ఎక్కడికి వెళ్తున్నావ్?’ అని అడుగుతాడు పోస్ట్‌మాస్టర్. ‘నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నా’ అంటాడు బుంగమూతితో. ‘అయ్యో .. అవునా. మరి ఇంట్లో అమ్మ వేడివేడి జిలేబీలు చేస్తుందే.. నీకోసం కాదా?’ అంటాడు రాము కాకా ముసిముసిగా నవ్వుతూ. ఆ మాట వినగానే కళ్లింత చేసుకుంటూ ‘జిలేబీలా.. ’ అంటాడు బబ్లూ. ‘ఊ.. ’ అన్నట్టుగా తలూపుతాడు పోస్ట్ మాస్టర్ అదే నవ్వుతో. ‘అయితే జిలేబీలు తిని వెళ్లిపోతా’ అంటూ ఇంటిదారి పడ్తాడు బబ్లూ. ఇది ‘ధారా’ వంట నూనె వ్యాపార ప్రకటన. ఇందులోని బబ్లూలో తమ పిల్లలను ఊహించుకోని తల్లులు ఉండరు. అమాయకమైన మొహం.. స్వచ్ఛమైన, స్పష్టమైన వ్యక్తీకరణతో బబ్లూని పోలని పిల్లలు ఉండరు. అంతలా ఆకట్టుకున్న మోడల్ బబ్లూ అసలు పేరు పర్జాన్ దస్తూర్. ఈ అబ్బాయి అనుకోకుండా ‘ధారా’ మోడల్ అయ్యాడు. ఈ ‘ధారా’ జిలేబీ యాడ్‌కు పర్జాన్ కన్నా కాస్త పెద్దపిల్లాడిని తీసుకుని షూటింగ్ కూడా పూర్తి చేశారు. కాని దర్శకుడు ఆచార్యకు ఇంకొంచెం చిన్న పిల్లాడైతే బాగుంటుంది.. ఇంకా అమాయకమైన ఎక్స్ప్రెషన్స్ వస్తాయేమో అనుకున్నాడు. షూటింగ్ చేసిన ఆ పెద్దపిల్లాడికి వాయిస్ ఓవర్ ఇచ్చింది పర్జాన్. డైలాగులు రికార్డ్ చేస్తున్నప్పుడు ‘జిలేబీ’ అనగానే పర్జాన్ కళ్లల్లో మెరిసిన మెరుపు ఆచార్యకు గుర్తొచ్చింది. వెంటనే పర్జాన్తో చేయిస్తే ఎలా ఉంటుంది? అని అనుకోవడమే కాదు పర్జాన్తో షూటింగ్ మొదలుపెట్టేశాడట. ఆచార్య ఊహించినట్టుగానే ‘జిలేబీ’ అనగానే ఆ పిల్లాడి కళ్లల్లో జిలేబీ పట్ల చవులూరే భావం కనిపించింది. 38 టేకులు చేసినా పర్జాన్ కళ్లల్లో అదే మెరుపుట. అలా పర్జాన్ .. బబ్లూ అయిపోయి అందరి గారాబాలకు పాత్రుడయ్యాడు. వ్యాపార ప్రకటనలకే పరిమితం కాలేదు బాల పర్జాన్ ప్రతిభ. సినిమాల్లోనూ కనిపించింది. కుఛ్ కుఛ్ హోతాహైలో సర్దార్ కిడ్‌గా ‘తుస్సీ జా రహే హో.. తుస్సీ నా జావో’ అనే డైలాగ్‌తో వెండితెర ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. గుజరాత్ అల్లర్ల మీద వచ్చిన పర్జానియా, మొహబ్బతే, జుబేదా, సికందర్ మొదలైన చిత్రాల్లోనూ నటించి ఆ పబ్లిసిటీని కంటిన్యూ చేసుకున్నాడు. ఇది ఇరవై, ఇరవైరెండేళ్ల నాటి మాట. ఇప్పుడు పర్జాన్కు ఇరవై ఎనిమిదేళ్లు. నటుడిగానే కాదు గాయకుడిగా, రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా తనలోని బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటున్నాడు. ది హెల్దీ ఆయిల్ ఫర్ హెల్దీ పీపుల్ ...అని జింగిల్లోని చివరి పంక్తులను చెప్పినా ఠక్కులన ‘సన్‌డ్రాప్ సూపర్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఫర్ హెల్డీ పీపుల్ హెల్దీ ఆయిల్’ అంటూ పూర్తిచేస్తారు ఆ బాల్యపు యాదిని దాచిపెట్టుకున్న నేటి పెద్దలు. ఈ జింగిల్ పాడుకోగానే కొండలాగా ఉన్న పూరీల చుట్టూ అలవోకగా పల్టీలు కొడుతూ అదే పరిమాణంలోని గులాబ్ జామ్స్ పై నుంచి జంప్ చేస్తుండే పిల్లాడూ గుర్తొస్తాడు. చురుగ్గా.. మెరుపు వేగంతో స్టంట్స్ చేసే ఆ చైల్డ్ మోడల్ పేరు నిశాంత్ మెహ్రా. ఆ వయసులోనే అథ్లెట్‌గా రాణించిన మెహ్రా ఇప్పుడు ఫుట్‌బాల్ ఆటగాడు. ముంబై ఎఫ్సీకి కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. సర్ఫ్ ఆల్ట్రా.. దూరదర్శన్‌తో అనుబంధం ఉన్న తరానికి కునాల్ ఖేము సుపరిచితుడు.. సీరియళ్లు, టీవీ కమర్షియల్స్‌తో. సర్ఫ్ ఆల్ట్రా చైల్డ్ మోడల్, గుల్ గుల్షన్ గుల్ఫామ్ వంటి ధారావాహికలు, సర్, రాజా హిందుస్తానీ, జఖ్మ్, భాయ్, హమ్ హై రాహి ప్యార్ కే మొదలైన సినిమాల్లో బాలనటుడు కునాల్ ఖేము. అయితే నేటి యువతకూ అంతే పరిచయం అతను. భాగ్ జానీ, గుడ్డు కీ గన్ వంటి సినిమాల్లో హీరోగానే కాదు సైఫ్ అలీ ఖాన్ చెల్లెలు సోహా అలీఖాన్ భర్తగా కూడా. ఇదీ ఒకప్పటి లిటిల్ స్టార్స్ నేటి కథ. -
పిల్లల స్క్రిప్ట్‌తో...
‘‘చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ చూసిన ఇన్స్పిరేషన్తో ఈ చిత్రం చేశాను. దీనికోసం చిన్నారులను ఎంపిక చేసి వర్క్‌షాప్ నిర్వహించాం. చిన్నపిల్లలే ఈ సినిమాకు స్క్రిప్ట్ అందించడం విశేషం. ఆరుగురు స్నేహితులు తమ స్నేహితురాలు కోసం ఏం చేశారనేదే ఈ చిత్రం కథ’’ అని దర్శకుడు రషీద్ బాషా తెలిపారు. మాస్టర్ మహమ్మద్ అఫ్పాన్స్ సమర్పణలో హెచ్.డి. విజన్ ఇండియా పతాకంపై నిర్మించిన ‘లిటిల్ స్టార్స్’ ఈ నెల 12న విడుదలవుతోంది. ఈ చిత్రానికి నిర్మాతలు: ఇబ్రహీం షేక్, అమీర్ బాషా షేక్, ఖాజాబి షేక్, నజీమ్ షేక్, కెమెరా: కిషన్ సాగర్, సంగీతం: శ్రీ వెంకట్. -
కలాం స్పూర్తితో...
లక్ష్య సాధన కోసం ఆరుగురు చిన్నారులు అవరోధాలను జయించి విజయతీరం చేరుకునేందుకు చేసిన సాహసాలు ఏంటి? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. మహమ్మద్ అఫ్పాన్ సమర్పణలో హెడ్విజన్ ఇండియా పతాకంపై అనంతపురం ఫిల్మ్ సొసైటీ సహకారంతో రషీద్ బాషా దర్శకత్వంలో ఎన్. ఇబ్రహీం నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. దర్మక-నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలకు చూపించాల్సిన చిత్రం ఇది. ‘దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోగలం’ అన్న అబ్దుల్ కలాం ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ చిత్రం చేశాం. అందుకే ఈ చిత్రాన్ని ఆయనకు అంకితం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచే చిత్రం అవుతుంది’’ అన్నారు. -
లిటిల్ వండర్స్...!
స్నేహితురాలి చదువు కోసం ఆరుగురు చిన్నారులు ఎలాంటి కష్టాలు పడ్డారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. రషీద్ బాషా దర్శకత్వంలో ఇబ్రహీం షేక్, నజీవ్ షేక్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. శ్రీవెంకట్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను దర్శకుడు రేలంగి నరసింహారావు విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘వెవిధ్యమైన కథాకథనాలతో కుటుంబ బాంధవ్యాలకు ప్రాధాన్యమిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని చెప్పారు. హీరో వంశీకృష్ణ, నిర్మాత ఇబ్రహీం షేక్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల ఆశయం
సమాజం మానవతా విలువలను మరచిపోతోంది. ఆరుగురు చిన్నారులు ఆ విలువలను ఏ విధంగా కాపాడారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. రషీద్ బాషా దర్శకత్వంలో మాస్టర్ మహమ్మద్ అఫ్పాన్స్ సమర్పణలో హెచ్.డి. విజన్ ఇండియా, అనంతపురం ఫిల్మ్ సొసైటీ సంయు క్తంగా నిర్మించిన చిత్రం ఇది. పాటలను డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయనున్నారు. ‘‘పిల్లల్లో మేధాశక్తి పెంపొందించడానికి పర్యవేక్షణతో కూడిన స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే వాళ్లు అద్భుతాలు సాధించగలరనే సందేశాన్ని ఈ చిత్రంతో చెబుతున్నాం’’ అని నిర్మాత అన్నారు. -
పిల్లలు కాదు... పిడుగులు
నేటి బాలలే...రేపటి పౌరులు. ఈ అంశాన్నే నేపథ్యంగా తీసుకుని చేసిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. రిషి ప్రధాన పాత్రలో రషీద్ బాషా దర్శకత్వంలో ఎస్. ఇబ్రహీమ్ నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘‘మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ గారి స్ఫూర్తితో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఆరుగురు పిల్లలు పిడుగులై, అసాధ్యాన్ని సుసాధ్యం ఎలా చేశారన్నదే ఈ సినిమా ఇతివృత్తం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:కిషన్‌సాగర్, సంగీతం: శ్రీ వెంకట్. -
లిటిల్ ‘స్టార్స్’