కలాం స్పూర్తితో... | Little Stars Movie | Sakshi
Sakshi News home page

కలాం స్పూర్తితో...

Published Sun, Jan 31 2016 11:15 PM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM

కలాం స్పూర్తితో... - Sakshi

కలాం స్పూర్తితో...

లక్ష్య సాధన కోసం ఆరుగురు చిన్నారులు అవరోధాలను జయించి విజయతీరం చేరుకునేందుకు చేసిన సాహసాలు ఏంటి? అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘లిటిల్ స్టార్స్’. మహమ్మద్ అఫ్పాన్ సమర్పణలో హెడ్‌విజన్ ఇండియా పతాకంపై అనంతపురం ఫిల్మ్ సొసైటీ సహకారంతో రషీద్ బాషా దర్శకత్వంలో ఎన్. ఇబ్రహీం నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. దర్మక-నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లలకు చూపించాల్సిన చిత్రం ఇది.

‘దృఢ సంకల్పంతో ప్రయత్నిస్తే అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోగలం’ అన్న అబ్దుల్ కలాం ఆశయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఈ చిత్రం చేశాం. అందుకే ఈ చిత్రాన్ని ఆయనకు అంకితం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలిచే చిత్రం అవుతుంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement