చికిత్స పొందుతూ సెంట్రింగ్ మేస్త్రి మృతి
చితకబాదిన తోటి లేబర్లు
పటాన్‌చెరు టౌన్: వంట మ నిషి చెయ్యి పట్టి లాగాడని సెంట్రింగ్ మేస్త్రిని లేబర్లు చితకబాదడంతో మృతి చెందిన ఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బీహార్‌కి చెందిన దీపక్ ఠాగూర్ (30) నాలుగు నెల కిందట బతుకుదెరువు కోసం వచ్చాడు. పటాన్‌చెరు మండలం నందిగామ పరిధిలోని మై ఫేర్ విల్లాస్‌లో సెంట్రింగ్ మేస్త్రిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఆదివారం రాత్రి మద్యం మత్తులో వెస్ట్ బెంగాల్‌కు చెందిన వంట మనిషి మాషారాణి చేయి పట్టి లాగడంతో ఆమెతోపాటు సంజయ్, సోప్‌దేవ్ సర్కార్, గోధంగా సన్యాసి మేస్త్రిని చితకబాదారు. తీవ్ర గాయాలైన అతడిని పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. వంట మనిషితోపాటు ముగ్గురు లేబర్లపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: HYD: బ్లాక్‌మెయిలింగ్ సొమ్ముతో అపార్ట్‌మెంట్ కొనుగోలు
Comments
Please login to add a commentAdd a comment