master
-
వంట మనిషి చెయ్యి పట్టి లాగాడని..
పటాన్చెరు టౌన్: వంట మ నిషి చెయ్యి పట్టి లాగాడని సెంట్రింగ్ మేస్త్రిని లేబర్లు చితకబాదడంతో మృతి చెందిన ఘటన బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బీహార్‌కి చెందిన దీపక్ ఠాగూర్ (30) నాలుగు నెల కిందట బతుకుదెరువు కోసం వచ్చాడు. పటాన్చెరు మండలం నందిగామ పరిధిలోని మై ఫేర్ విల్లాస్‌లో సెంట్రింగ్ మేస్త్రిగా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో వెస్ట్ బెంగాల్‌కు చెందిన వంట మనిషి మాషారాణి చేయి పట్టి లాగడంతో ఆమెతోపాటు సంజయ్, సోప్‌దేవ్ సర్కార్, గోధంగా సన్యాసి మేస్త్రిని చితకబాదారు. తీవ్ర గాయాలైన అతడిని పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. వంట మనిషితోపాటు ముగ్గురు లేబర్లపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.చదవండి: HYD: బ్లాక్‌మెయిలింగ్ సొమ్ముతో అపార్ట్మెంట్ కొనుగోలు -
Prabhu Deva: తిరుమల శ్రీవారిని దర్శించిన హీరో ప్రభుదేవా కుటుంబం (ఫోటోలు)
-
హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ హతం? అక్టోబరు 7 దాడుల మాస్టర్‌మైండ్?
ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో 22వ రోజున ఇజ్రాయెల్ సైన్యం తాము భారీ విజయాన్ని సాధించినట్లు ప్రకటించింది. హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అబు రకాబాను సైన్యం హతమార్చిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడికి రకాబా ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, దాని అధికారిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్లో ఒక పోస్ట్ చేస్తూ, హమాస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అబు రకాబా హత్యను ధృవీకరించింది. అక్టోబరు 7న జరిగిన మారణకాండను ప్లాన్ చేయడంలో రకాబా కీలక పాత్ర పోషించాడని, అతను పారాగ్లైడర్లపై ఇజ్రాయెల్‌లోకి చొరబడి, ఉగ్రవాదులకు ఆజ్ఞలు జారీ చేశాడని, డ్రోన్ దాడులకు బాధ్యుడని ఇజ్రాయెల్ పేర్కొంది. అక్టోబర్ 7 న హమాస్ జరిపిన దాడిలో 1400 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులు హమాస్ చేతిలో బందీలుగా మారారు. అక్టోబర్ 7 దాడి తర్వాత ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించి, హమాస్ స్థానాలపై దాడి చేస్తూ వస్తోంది. హమాస్‌ను పూర్తిగా నిర్మూలించిన తర్వాతే ఊపిరి పీల్చుకుంటామని ఇజ్రాయెల్ మరోసారి స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయెల్ తిరస్కరించింది. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ మాట్లాడుతూ హమాస్‌ను అంతమొందించాలని ఇజ్రాయెల్ భావిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: జైలులో రావణ దహనం.. నలుగురు అధికారులు సస్పెండ్! Overnight, IDF fighter jets struck Asem Abu Rakaba, the Head of Hamas' Aerial Array. Abu Rakaba was responsible for Hamas' UAVs, drones, paragliders, aerial detection and defense. He took part in planning the October 7 massacre and commanded the terrorists who infiltrated… — Israel Defense Forces (@IDF) October 28, 2023 -
ఆయన దయ వల్లే ఈ హోదా – జానీ మాస్టర్
‘‘ఈ రోజు మాకు (డ్యాన్స్ మాస్టర్స్) ఇంత పేరు, హోదా వచ్చి కార్లలో తిరుగుతున్నామంటే ముక్కురాజు మాస్టర్ దయే. ‘తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్– డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటే కారణం కూడా ఆయనే. యూనియన్ తరఫున ఆయన వారసురాలికి చిరు కానుకగా రెండు లక్షల రూపాయలు ఇవ్వడం సంతోషంగా ఉంది’’ అని ‘తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్– డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ నూతన అధ్యక్షుడు జానీ మాస్టర్ అన్నారు. ‘తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్– డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్’ అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఎన్నికయ్యారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఆయన ప్రమాణ స్వీకారానికి నిర్మాతల మండలి అధ్యక్షుడు, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ కేఎల్ దామోదర ప్రసాద్ విశిష్ఠ అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘నూతన కార్యవర్గం యూనియన్ సభ్యుల మంచి కోసం పని చేయాలి. జానీ ప్రమాణ స్వీకారానికి తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి డ్యాన్స్ మాస్టర్లు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘మా యూనియన్ సొంత స్థలం, భవనం కోసం కృషి చేస్తా’’ అన్నారు జానీ మాస్టర్. ఈ కార్యక్రమంలో మద్రాస్ డ్యాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ దినేష్ మాస్టర్, పలువురు డ్యాన్స్ మాస్టర్స్ పాల్గొన్నారు. -
Sekhar Master Daughter Sahithi Birthday: శేఖర్ మాస్టర్ కూతురు బర్త్ డే.. ఫోటోలు వైరల్!!
-
విశాఖ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
సాక్షి, విశాఖపట్నం : నీతి ఆయోగ్ గ్రోత్ హబ్స్ జాబితాలో విశాఖ ఎంపికైన నేపథ్యంలో అభివృద్ధికి అవసరమైన భవిష్యత్ ప్రణాళికల్ని రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో శనివారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్, వీఎంఆర్డీఏ కమిషనర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్‌వర్మ, టూరి జం ఆర్డీ శ్రీనివాస్‌పాణి, మెట్రోరైల్ ఎండీ యూజేఎం రావు తదితరులతో మాట్లాడారు. విశాఖ అభివృద్ధికి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలపై ప్ర త్యేక కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. మెట్రో రైలు ప్రాజెక్టు నాలుగు విభాగాలుగా రూ పొందుతోందని మెట్రో ఎండీ యూజేఎంరావు తెలిపారు. లైట్ కారిడార్, మోడరన్ కారిడార్ పేర్లతో రూపొందుతున్న మెట్రో రైలు ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించాలని జవహర్‌రెడ్డి సూచించారు. జవహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అర్బన్ గ్రోత్ హబ్ సిటీస్ జాబితాలో విశాఖ చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. 2047 నాటి కి వికసిత్ భారత్‌గా వెలుగొందాలంటే అర్బన్ సిటీ స్ గ్రోత్ సెంటర్స్ ముఖ్యమని నీతి ఆయోగ్ గుర్తించిందని తెలిపారు. ఇందుకోసం నీతి ఆయోగ్ బృందం టోక్యో, న్యూయార్క్ వంటి 20 ప్రపంచస్థాయి నగరాల్ని అధ్యయనం చేసి రోడ్ మ్యాప్ సిద్ధం చే సిందని, ఇందులో భాగంగా విశాఖని ఎంపిక చేసిందని వివరించారు. విశాఖ నుంచి సీఎం పరిపాలనపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తామన్నారు. -
అందులో అర్ధ నగ్నంగానే నటించాను తప్పేంటి: టాప్ హీరోయిన్
బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ నటి ఆండ్రియా. తమిళనాడుకు చెందిన ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో పుట్టిన ఈమెకు చిన్నతనం నుంచి సంగీతంపై మక్కువ. ఆండ్రియా పియానో వాయిద్య కళాకారిణి. ఇక ఈమె న్యాయవాది అన్న విషయం చాలా మందికి తెలియదు. అదేవిధంగా నటిగా కంటే కూడా గాయనిగా ముందు సినీ రంగ ప్రవేశం చేశారు. గాయనిగా గుర్తింపు పొందిన తర్వాత కోలీవుడ్‌లో పచ్చైక్కిళి ముత్తుచ్చారం చిత్రంతో కథానాయకిగా రంగ ప్రవేశం చేశారు. (ఇదీ దచవండి: ముంబయికి షిఫ్ట్ అయిన ఫ్యామిలీ.. సూర్య ఏమన్నారంటే!) ఆ తర్వాత మంగాత్తా, విశ్వరూపం,తడాఖా,మాస్టర్, వడచైన్నె అంటూ పలు చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించారు. మలయాళం, తమిళం, తెలుగు తదితర భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్నారు. 36 ఏళ్ల ఈ అవివాహిత భామ ఇప్పటికీ నటిగా గాయనిగా బిజీగా ఉన్నారు. కాగా ఇటీవల పుష్ప చిత్రం తమిళ్ వెర్షన్లో 'ఊ అంటావా మామ' పాటను పాడి ఆ పాటకు ఇక్కడ కూడా క్రేజ్ తెచ్చిపెట్టింది ఈమెనే. అయితే వ్యక్తిగతంగా ఈమె పలు విమర్శలను ఎదుర్కొన్నారు. ఇటీవల దర్శకుడు వెట్రిమారన్ నిర్మించిన అనల్ మేల్ పణితులి చిత్రంలో ఆండ్రియా అర్ధ నగ్నంగా నటించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. దీనిపై ఇటీవల ఒక భేటీలో స్పందించిన ఆండ్రియా నిజమే ఆ చిత్రంలో ఒక సన్నివేశంలో నటిస్తున్నప్పుడు తనకే చాలా బిడియంగా అనిపించిందని అన్నారు. అయితే నిజ జీవితంలో తనకు ఇంతకు మించిన సంఘటనలను జరిగాయని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈమె పిశాచి 2, మాలిగై, నో ఎంట్రీ, బాబి ఆంటోనీ చిత్రం అంటూ అరడజను చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అదేవిధంగా తెలుగులో 'సైంధవ్' చిత్రంలో ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. -
డైరెక్టర్ గా మారిన శేఖర్ మాస్టర్.. హీరో ఎవరో తెలుసా..?
-
యాంకర్ ఓంకార్, కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
ఇలాగైతే... ఎలా మాస్టర్?
చిత్రం:‘మాస్టర్’ తారాగణం: విజయ్, విజయ్ సేతుపతి మాటలు: రాజేశ్ ఎ. మూర్తి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లోకేశ్ కనకరాజ్ రిలీజ్: జనవరి 13 దాదాపు ఏణ్ణర్ధం శ్రమ... లాక్ డౌన్ అనంతర ప్రపంచంలో తమిళనాట విడుదలవుతున్న తొలి బిగ్ బడ్జెట్, బిగ్ రిలీజ్ ఫిల్మ్! తమిళంలో తయారై, తెలుగులోనూ రిలీజైన విజయ్ ‘మాస్టర్’ చిత్రం గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్లుగా వెలుగుతున్న హీరో విజయ్, విలక్షణ నటుడు సేతుపతి ప్రత్యర్థులుగా రూపొందిన చిత్రం ఇది. కానీ ఆ స్టార్లు మినహా ‘మాస్టర్’లో ఇంకేముందంటే జవాబు కష్టం. కథేమిటంటే..: వరంగల్‌లో చిన్నప్పుడే కొందరు దుర్మార్గుల వల్ల తల్లితండ్రులను కోల్పోయి, పిల్లల జైలులో పెరిగి, కసి కొద్దీ దుష్టుడిగా మారిన వ్యక్తి భవాని (విజయ్ సేతుపతి). ఆ బాల నేరస్థుల అబ్జర్వేషన్ హోమ్‌లోని వాళ్ళందరికీ గంజాయి, మందు అలవాటు చేసి, అసాంఘిక కార్యకలాపాలకు వాడుకుంటూ ఉంటాడు. మరోపక్క స్టూడెంట్స్ ప్రేమించే ఓ కాలేజీ ప్రొఫెసర్ జె.డి. (విజయ్). ఆ పిల్లల జైలును ఒక దారిలో పెట్టే పని అనుకోకుండా ఆ మాస్టర్ చేతిలో పడుతుంది. అక్కడ అతనికి ఎదురైన అనుభవాలు, మద్యానికి బానిసైన హీరోలో వచ్చిన మార్పు, చివరకు అతను భవాని ఆట కట్టించిన తీరు – మూడు గంటల ‘మాస్టర్’ చిత్రం. ఎలా చేశారంటే..: హీరో విజయ్ తన స్టార్ హోదాకు తగ్గట్లు నటించారు. సినిమానంతా తన భుజాల మీద తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అలాగే, సేతుపతి విలన్ పాత్రను తనదైన పద్ధతిలో పండించారు. కానీ, ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని రాసుకున్న సీన్లలో ఉన్నంత బిల్డప్ స్క్రిప్టులో, సినిమాలో లేకపోవడం విషాదం. హీరోకు ప్రత్యేకించి హీరోయినంటూ లేని ఈ సినిమాలో మాళవికా మోహనన్ ఉన్నంతలో హీరోయిన్ అనుకోవాలి. బాణాలు పట్టుకొని, నటి ఆండ్రియా ఎదురవుతారు. కానీ, ఈ నటీమణులెవరివీ కీలకపాత్రలు కాకపోవడం విచిత్రం. ఎలా తీశారంటే..: గతంలో సందీప్ కిషన్‌తో ‘నగరం’, కార్తీతో ‘ఖైదీ’ లాంటి చిత్రాలు అందించిన దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌కు ఇది ముచ్చటగా మూడో సినిమా. మొదటి రెండు సినిమాలనూ కథ, కథన బలాలతో నడిపించిన ఈ యువ దర్శకుడు ఈసారి మాత్రం ‘మాస్టర్’ కథను రాసుకోవడంలో, తీయడంలో రాజీపడ్డట్టుంది. సేతుపతి, విజయ్– ఇలా ఇద్దరు హాట్ స్టార్లను తీసుకున్నాక, ఇమేజ్ను బ్యాలెన్స్ చేస్తూ, వారిని కథలో ఇరికించడానికే ఎక్కువ ఎనర్జీ పెట్టినట్టుంది. వెరసి, ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని, ‘మాస్టర్’గా కాకుండా మా ‘స్టార్’గా తీశారు. అదే ఈ సినిమాకు పెద్ద బలహీనత. అలాగే, తెర మీది భావోద్వేగాలను కథలా చూపడమే తప్ప, ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడంలోనూ డైరెక్టర్ ఫెయిలయ్యారు. విలన్, హీరోల పరిచయానికే అరగంట తీసుకున్న ఈ సినిమాలో అసలు కథ కన్నా పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్, ప్రతి సన్నివేశానికీ బిల్డప్పులపైనే శ్రద్ధ పెట్టారు. మంచివాడిగా మొదలై పిల్లల జైలులో చెడ్డవాడిగా ఎదిగిన విలన్ లక్ష్యంలో క్లారిటీ లేదు. హీరో ఎందుకు తాగుబోతుగా మారాడో అర్థం కాదు. తాగుడు మానేసిన సీన్, సందర్భం కూడా కన్విన్సింగ్‌గా అనిపించదు. తమిళనాట విజయ్ రాజకీయ ఆకాంక్షలకు అనుగుణంగా పొలిటికల్ డైలాగు లూ అక్కడక్కడా ఉన్నాయి. గతంలో కార్తీ ‘ఖైదీ’, తెలుగులో వై.ఎస్.ఆర్. బయోపిక్ ‘యాత్ర’ లాంటి వాటికి పనిచేసిన సత్యన్ సూర్యన్ కెమేరా వర్క్ బాగుంది. పి.సి. శ్రీరామ్ శిష్యుడైన సత్యన్ ఈసారి కూడా నైట్ ఎఫెక్ట్ షాట్స్, యాక్షన్ పార్టుల లాంటివి బాగా తీసినా, దాదాపు 3 గంటల క్లాసు పీకిన ‘మాస్టర్’ను అవి గట్టెక్కించలేవు. ప్రత్యేకించి హీరో – హీరోయిన్లకు డ్యూయట్లు, చెప్పుకోదగ్గ పాటలేవీ లేకుండా నేపథ్య సంగీతం మీదే ఆధారపడడంతో, ఈ సినిమాకు కొలవెరి ఫేమ్ అనిరుధ్ సంగీతం పరిస్థితీ అంతే. ఇక, విజయ్ చేసిన ‘గిల్లీ’ (మహేశ్ ‘ఒక్కడు’కు తమిళ రీమేక్)లోని కబడ్డీ సీన్ స్ఫూర్తితో ఈ సినిమాలోనూ తీసిన కబడ్డీ ఫైట్ లాంటి యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అయితే, రాసుకున్న కథలో, తీస్తున్న విధానంలోనే దమ్ము లేనప్పుడు ఇవి ఎన్ని ఉన్నా ఏం లాభం! వెరసి, ఎంత ఇమేజ్ ఉన్నప్పటికీ స్టార్ ఈజ్ నాట్ బిగ్గర్ దేన్ సినిమా అనే పాఠం ఈ ‘మాస్టర్’ గట్టిగా చెబుతుంది. స్క్రిప్టు గనక బలంగా లేకపోతే, స్టార్లున్నా... నో యూజ్ మాస్టర్!! కొసమెరుపు: అన్నట్టు... మూడు గంటల క్లాసు తెరపై చూపించాక, విలన్‌పై విజయం సాధించిన హీరో ‘‘దూల తీరిపోయింది’’ అంటాడు. హాలులో నుంచి బయటకొస్తున్న జనం మనసులో మాట హీరోకి ఎలా తెలిసిందబ్బా? బలాలు: సేతుపతి, విజయ్‌ల స్టార్ పవర్ మెరిసే యాక్షన్, కెమేరా వర్క్ బలహీనతలు: í్రÜ్కప్టును మింగేసిన స్టార్ ఇమేజ్ నీరసమైన కథ, నిదా...నమైన కథనం హీరో, విలన్ మినహా అన్నీ అప్రధాన పాత్రలే వినోదం, పాటలు కొరవడడం – రెంటాల జయదేవ -
‘మాస్టర్’ రొమాంటిక్ ప్రోమో : మాలవిక మాయ
సాక్షి, హైదరాబాద్: తమిళహీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’ 4వ ప్రోమోను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది. విజయ్‌తో పాటు ప్రముఖ తమిళ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి కూడా నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం మరింత ఆకర్షణగా నిలవనుంది. ముఖ్యంగా అందం వాడి చూపేరా అనే పాట యువతను ఉర్రూతలూగించేలా, అద్భుతంగా ఉంది. అలాగే ఈ లవ్లీ, రొమాంటిక్ ప్రోమోలో కాలేజీ లెక్చరర్‌గా మాలవికా మోహనన్ గ్రేస్ లుక్‌లో అలరిస్తోంది. మరి తన అందంతో ఏం మాయ చేస్తుందో చూడాలి. తెలుగు, తమిళంలో ఈ సినిమా జనవరి 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్, ప్రోమోలతో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ టీజర్ ను సుమారు 5 లక్షల మంది వీక్షించారంటేనే మాస్టర్ మ్యాజిక్‌ను ఊహించుకోవచ్చు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయక పాత్రలో కనిపించనున్నారు. వీరిద్దరి మధ్య చోటుచేసుకునే ఉత్కంఠ భరిత సన్నివేశాల కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. మరోవైపు సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల్లో ప్రేక్షకుల సీటింగ్ సామర్థ్యాన్ని 100 శాతం ఆక్యుపెన్సీ నిర్ణయం నుంచి తమిళనాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కరోనా నిబంధనల నేపథ్యంలో 50 శాతం మాత్రమే ఉండాలన్న కేంద్రం సూచన మేరకు సర్కార్ తాజా నిర్ణయం తీసుకుంది. దాంతో విజయ్ సినిమా ఓపెనింగ్స్‌పై సందేహాలు నెలకొన్నాయి. Small break for the mass promos. Here's a lovely romantic promo from #Master this time.. @actorvijay @MalavikaM_ A @Dir_Lokesh film .. @XBFilmCreators @Lalit_SevenScr @Jagadishbliss @SonyMusicSouth #మాస్టర్ pic.twitter.com/PXVOM3zGlj — Mahesh Koneru (@smkoneru) January 8, 2021 -
విజయ్ ‘మాస్టర్’ రిలీజ్ డేట్ వచ్చేసింది..
లాక్డౌన్ అనంతరం సినిమా థియేటర్లు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. మొన్నటి వరకు సినిమాలు ఓటీటీలో విడుదలయ్యినప్పటికీ ఇప్పుడు మాత్రం మళ్లీ థియేటర్లలోనే హడావిడి చేసేందుకు దర్శకనిర్మాతలు ముందడుగు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మర్డర్, సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాలు థియేటర్లలో విడుదల అయ్యాయి. మరోవైపు థియేటర్లలో విడుదలైన చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో మిగిలిన వారు కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో తలపతి విజయ్ నటిస్తోన్న యాక్షన్ మూవీ మాస్టర్ సంక్రాంతి బరిలో దిగనుంది. 2021 జనవరి 13న సంక్రాంతి కానుకగా మాస్టర్ థియేటర్లలలో సందడి చేయనుందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు దర్శకుడు మంగళవారం ఓ పోస్టర్‌ను విడుదల చేశాడు. తమిళంతో పాటు తెలుగు భాషల్లో కూడా మాస్టర్ ఒకేసారి విడుదల అవుతుంది. హిందీలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా జనవరి 14న రిలీజ్ అవ్వనుంది. చదవండి: సీఎంతో హీరో విజయ్ భేటీ..! See you soon in theatres 🤜🤛#Master #MasterPongal#மாஸ்டர்#మాస్టర్#VijayTheMaster pic.twitter.com/gsF9unlhfR — Lokesh Kanagaraj (@Dir_Lokesh) December 29, 2020 ఖైదీ ఫేమ్ లోకేశ్ కనగరాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాస్టర్‌లో విజయ్‌కు జోడిగా మాళవిక మోహన్ నటిస్తున్నారు. మరో నటుడు విజయ్ సేతుపతి పవర్ఫుల్ విలన్‌పాత్రలో కనిపించనున్నాడు. ఆండ్రియా జెరెమియా, రమ్య సుబ్రమణియన్, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్, నాసర్, ధీనా, సంజీవ్, శ్రీనాథ్, శ్రీమాన్, సునీల్ రెడ్డి కీలకపాత్రల్లో నటించారు. తొలుత ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 9 న విడుదల చేయాలని భావించారు. కానీ కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. చిత్రానికి అనిరుద్ మ్యూజిక్ అందించారు. ఇక మాస్టర్ విడుదల తేదీ ప్రకటించడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమా కోసం తమిళ అభిమానులతోపాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతోపాటు యువ హీరో రామ్ రెడ్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రాబోతోంది. అలాగే బెల్లంకొండ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కించిన అల్లుడు అదుర్స్ కూడా సంక్రాంతి బరిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా జనవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. చదవండి:అభిమానులకు రకుల్ గుడ్‌న్యూస్ -
'మర్డర్' సెకండ్ ట్రైలర్ విడుదల
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ నేతృత్వంలోని మర్డర్ సినిమా సెకండ్ ట్రైలర్ విడుదలైంది. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితీ ప్రధానపాత్రల్లో నటించిన మర్డర్ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృతల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. పరువు కోసం అమృత తండ్రి మారుతీ రావు ప్రణయ్‌ను హత్య చేయించారు. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. (బిగ్‌బాస్: అరియానాపై ఆర్జీవీ కామెంట్స్ ) మాస్టర్ మూవీ తెలుగు టీజర్ తమిళ హీరో విజయ్ నటించిన మాస్టర్ మూవీ తెలుగు టీజర్ విడుదలైంది. లోకేష కనగరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినమాలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటించింది. ఇప్పటికే తమిళ వెర్షన్లో విడుదలైన మాస్టర్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన 16 గంటల్లోనే 1.6 మిలియన్లకు పైగా లైక్‌లతో యూట్యూబ్‌లో ఎక్కువ లైక్స్‌ను సొంతం చేసుకున్న టీజర్లలో ఒకటిగా అరుదైన రికార్డును సాధించింది.ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా,కరోనా కారణంగా బ్రేక్ పడింది. అయితే 'మాస్టర్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందుకు గాను భారీ మొత్తంలోనే నిర్మాతలకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించారు. (‘ఆదిపురుష్’ దర్శకుడు, విలన్‌పై కోర్టులో పిటిషన్ ) -
థియేటర్లోనే మాస్టారూ...
విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్‌గా కలసి చేసిన తొలి చిత్రం ‘మాస్టర్’. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మొదట ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా థియేటర్లు లేకపోవటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. థియేటర్ల రీ ఓపెన్‌కి ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినప్పటికీ ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ఫామ్లోనే విడుదల చేయబోతున్నారనే వార్త వైరల్‌గా మారింది. ఈ వార్తను ఖండిస్తూ.. ‘మాస్టర్’ని థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ ప్రేక్షకులను ఉద్దేశించి ‘మాస్టర్’ సినిమాని టీవీలో చూస్తారా? సినిమా థియేటర్లోనా? అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. ఆ ట్వీట్‌కు స్పందించిన ప్రేక్షకులు ‘థియేటర్లోనే’ అన్నారు. ఈ సినిమా నేరుగా థియేటర్లోనే విడుదల కావడం విజయ్ అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయం. -
నెట్‌ఫ్లిక్స్‌లో విజయ్ 'మాస్టర్',100కోట్లకు డీల్!
చెన్నై : తమిళ స్టార్ దళపతి విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్ సినిమా అంటే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. తాజాగా విజయ్ నటించిన 'మాస్టర్' సినిమాపై కూడా అంచనాలు అదే రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన రెండు వారాలలోపే 40 మిలియన్ల వ్యూస్ సాధించింది విజయ్ స్టామినాను మరోసారి చూపించింది. అన్ని వర్గాల ప్రేక్షకులు, విమర్శకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. టీజర్ విడుదలైన 16 గంటల్లోనే 1.6 మిలియన్లకు పైగా లైక్‌లతో యూట్యూబ్‌లో ఎక్కువ లైక్స్‌ను సొంతం చేసుకున్న టీజర్లలో ఒకటిగా అరుదైన రికార్డును సాధించింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా,కరోనా కారణంగా బ్రేక్ పడింది. తాజాగా 'మాస్టర్' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందుకు గాను భారీ మొత్తంలోనే నిర్మాతలకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. (‘మాస్టర్’ టీజర్.. స్టైలిష్ లుక్‌లో విజయ్) అయితే 'మాస్టర్' లాంటి భారీ బడ్జెట్ సినిమా థియేటర్లోనే విడుదల అవుతుందని, ఓటీటీల వైపు వెళ్లే ఆలోచనే లేదని నిర్మాతలు ఇదివరకు ప్రకటించారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. మరోవైపు తమిళ థియేటర్స్ సంఘం సైతం విజయ్ సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఒప్పుకనేది లేదని హెచ్చరించాయి. అయితే థియేటర్లు తెరిచినా ఇప్పుడప్పుడే జనాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు టాక్. ఇందుకుగానూ నెట్‌ఫ్లిక్స్ 100కోట్లకు పైగానే డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మాస్టర్ చిత్రం 2021 జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా ఈ వార్తలపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు. జేవియర్ బ్రిట్టో తన సొంత బ్యానర్ ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. మాలవికా మోహనన్, ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్ వంటి భారీ తారగణంతో చిత్రం పై అంచానలను పెంచాయి. .ఇదిలావుండగా, విజయ్ తన 65 వ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులను ప్రారంభించాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నఈ చిత్రం ఫిబ్రవరి 2021 లో మాస్టర్ విడుదల అనంతరం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. (ట్రెండింగ్‌లో మాస్టర్ టీజర్) -
విజయ్ ‘మాస్టర్’ రికార్డుల మోత
చెన్నై : తమిళనాడులో దళపతి విజయ్ పేరుకు పరిచయం అక్కర్లేదు. అక్కడ ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఇటీవల విజయ్ నటించిన మాస్టర్ సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన రెండు వారాలలోపే 40 మిలియన్ల వ్యూస్ సాధించింది విజయ్ స్టామినాను మరో సారి చూపించింది. టీజర్‌ను ఈ నెల 14 న నిర్మాతలు విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి అన్ని వర్గాల ప్రేక్షకులు, విమర్శకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ప్రసుతం నెట్టింట్లో టీజర్ ట్రెండింగ్‌లో కొనసాగుతు హల్చల్ చేస్తోంది. గురువారం సాయంత్రం చిత్ర నిర్మాతలు మాస్టర్ టీజర్ వ్యూస్ తో పాటు విడుదలైన 16 గంటల్లోనే 1.6 మిలియన్లకు పైగా లైక్‌లతో యూట్యూబ్‌లో ఎక్కువ లైక్స్‌ను సొంతం చేసుకున్న టీజర్లలో ఒకటిగా అరుదైన రికార్డును సాధించినట్లు ప్రకటించారు. పొంగల్ పండగ ముందే వచ్చింది ఇంటర్నెట్లో టీజర్ హిట్ కావడంతో విజయ్ అభిమానులు పొంగల్ పండగను ముందే జరుపుకుంటున్నారు. వారు నిన్నటి నుంచి మాస్టర్ టీజర్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. విజయ్ ఈ చిత్రంలో కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో ప్రేక్షుకుల ముందుకు రాబోతున్నాడు.జేవియర్ బ్రిట్టో తన సొంత బ్యానర్ ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ గా నటించారు. మాలవికా మోహనన్, ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్ వంటి భారీ తారగణంతో చిత్రం పై అంచానలను పెంచాయి. చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. చివరకు పొంగల్ సందర్భంగా జనవరి 14 న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఇదిలావుండగా, విజయ్ తన 65 వ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులను ప్రారంభించాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నఈ చిత్రం ఫిబ్రవరి 2021 లో మాస్టర్ విడుదల అనంతరం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. -
బ్రో.. అతడో తాగుబోతు.. వదిలెయ్!
చెన్నై: తమిళ స్టార్ దళపతి విజయ్, విజయ్ సేతుపతిల తాజా చిత్రం మాస్టర్ టీజర్ దీపావళి కానుకగా విడుదలైంది. దళపతి విజయ్ను జేడిగా పరిచయం చేస్తూ ఈ టీజర్ మొదలైంది. ఇందులో విజయ్ ఎలాంటి నియమ నిబంధనలు లేని ఓ కాలేజీ ప్రొఫెసర్‌గా, మద్యానికి బానిసైన తనకు తానే రాజు అనేవిధంగా కాలేజీ క్యాంపస్ నేపథ్యంలో సాగింది. చెప్పాలంటే కొంతమేర అర్జున్ రెడ్డిని తలపించింది. అయితే ఇద్దరూ పెద్ద స్టార్ హీరోలు కావడంతో విజయ్, విజయ్ సేతుపతిల మార్క్ ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు లోకేష్ కనకరాజు జాగ్రత్త పడినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. ఇక టీజర్ గురించి స్థూలంగా చెప్పాలంటే... కాలేజ్ ప్రొఫెసర్ జేడి, విపరీతంగా మద్యం తాగుతూ మిగతా టీచర్లకు తలనొప్పిగా మారుతాడు. అంతేగాక క్యాంపస్ లోపలే విద్యార్థులకు, జేడికి మధ్య నెలకొన్న కొన్ని మనస్పర్థల కారణంగా చిన్నగా మొదలైన గొడవలు, వీధీ రౌడీలు కూడా కలుగజేసుకునేంత పెద్దగా మారుతాయి. అలా క్యాంపస్‌లో విజయ్ సేతుపతి ఆధ్వర్యంలో రౌడీ మూకతో విజయ్ ఫైట్ చేస్తుంటాడు. టీజర్ చివరలో విజయ్, విజయ్ సేతుపతిలు ఫైట్ చేస్తున్న కట్ సీన్స్ పెట్టి దర్శకుడు టీజర్‌ను మరింత ఆసక్తికరంగా మలుపు తిప్పాడు. వీరిద్దరి మధ్య సాగే ఫైట్ సన్నివేశాలు టీజర్లో హైలైట్. ఇక కాలేజ్ ప్రొఫెసర్ జేడి పాత్రలో విజయ్ మద్యానికి బానిసైన వ్యక్తిగా కనిపిస్తూనే స్టైలిష్ లుక్స్‌తో అదరగొట్టాడు. ఇక ఈ చిత్రంలో మాళవిక మోహనన్న నటిస్తోంది. అనిరుధ్ అందించిన సంగీతం సినిమాకు మేజర్ హైలైట్ కానుంది. తెలుగులో కూడా ఈ సినిమా 11 కోట్లకు అమ్ముడైనట్లు సినీ వర్గాల సమాచారం. ఇక థియేటర్స్ తిరిగి తెరుచుకోగానే మాస్టర్ సినిమా విడుదల చేయడాలనే ఆలోచనలో చిత్ర బృందం భావిస్తోంది. -
అబ్బాయ్ లార్డ్ కృష్ణ
అంతా చేత వెన్నముద్ద కృష్ణులే.. వెన్న తీసే కృష్ణులెవరు మన ఇళ్లలో! అమ్మ చేసి పెట్టాలి. అక్క గిన్నెలు కడగాలి. చెల్లి ఇల్లు తుడవాలి. ‘కొంచెం ఒళ్లొంచరా.. కృష్ణా..’ ‘నేనా మమ్మీ! అది ఆడవాళ్ల పని కదా!’ ఈ స్టీరియో మారదా?! మారాలంటే అద్దాలు మార్చాలి. కళ్లజోడు మార్చకుంటే సైట్ అలాగే ఉంటుంది. క్రమంగా ఎక్కువౌతుంది కూడా. మగాళ్ల దగ్గర ఎన్ని కళ్లజోళ్లు ఉన్నా.. ఆడవాళ్లను చూడ్డానికి ప్రత్యేకంగా ఒక కళ్లజోడు ఉంటుంది. అమ్మ కట్టుకున్న పట్టుచీర వారసత్వంగా ఆడపిల్లలకు వచ్చినట్లు.. నాన్న నుంచి పరంపరగా మగపిల్లలకు వచ్చే కళ్లజోడు అది. అందులోంచి చూస్తే.. స్త్రీ వంట చేస్తూ కనిపించాలి. లేదా పిల్లల్ని సిద్ధం చేస్తూ కనిపించాలి. లేదా భర్తకు, అత్తమామలకు సేవ చేస్తూ కనిపించాలి. అలా కాకుండా ఆమె ల్యాప్‌టాప్‌లో వర్క్ చేస్తూ కనిపించిందా.. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ కనిపించిందా.. వేళ్లతో పియానో వాయిస్తూ కనిపించిందా.. కుషన్ చెయిర్లో కూర్చొని కాళ్లు రెండూ హ్యాండ్ రెస్ట్ మీదకు ఎత్తిపెట్టి ఊపుతూ కనిపించిందా.. కళ్లజోడుకు అపచారం జరిగినట్లే. కళ్లజోడుకు జరిగిందంటే నాన్నకు, నాన్నకు జరిగిందంటే వాళ్ల నాన్నకు.. వాళ్ల నాన్నకు జరిగిందంటే మొత్తం పురుష లోకానికే అపచారం జరిగినట్లే. స్త్రీ అంటే చిన్నపిల్లవాడి మైండ్‌లో కూడా ఒక చిత్రం ఉంటుంది. ఆ చిత్రంలో ఉన్నట్లుండాలి స్త్రీ. అప్పుడే ఆమె స్త్రీ. అప్పుడే ఆమె అమ్మ. అప్పుడే ఆమె సహోదరి. అప్పుడే ఆమె భార్య!! తమిళ్ సినిమా ‘మాస్టర్’ క్వారంటైన్లోకి వెళ్లిపోయింది. అదొక్కటే కాదు, హాలీవుడ్లో, బాలీవుడ్లో, మిగతా వుడ్‌లలో రిలీజ్ కావలసిన సినిమాలన్నీ లాక్డౌన్లో ఉన్నాయి. అన్ని భాషల్లోనూ హీరోల ఫ్యాన్స్ చేతులు కట్టేసినట్లయింది. కటౌట్లు లేవు. ఔట్లు లేవు. పూలాభిషేకాలు, పాలాభిషేకాలు లేవు. ‘మాస్టర్’లో విజయ్ హీరో. మాళవికా మోహనన్ హీరోయిన్. హీరోయినే.. కానీ ప్రతి ట్రైలర్లోనూ విజయ్ ఒక్కడే కనిపించాడు ఇంతవరకు. కనుక ఇది హీరో ఓరియెంటెడ్ అనుకోవాలి. ఆమె కూడా తన పార్ట్ ఏదో అది చేసేసి వెళ్లిపోయారు. కేరళ తనది. ముంబైలో పెరిగింది. ఉండటం అక్కడే. ‘పొట్టం పోలే’ ఆమె తొలి సినిమా. మలయాళం. పొట్టం పోలే అంటే ‘గాలి పటంలా..’ అని అర్థం. ‘పేట్ట’ ఇటీవలి తమిళ సినిమా. పేట్ట తర్వాత చేసిందే.. ఇప్పుడీ ‘మాస్టర్’. మాళవికకు సినిమాల్లోనే చేయాలన్న పట్టింపేంలేదు. కొన్నింట్లో మాత్రం పట్టింపు ఉంది. ‘స్త్రీ ఇలా ఉండాలి’ అని ఎవరైనా కళ్లజోడు పెట్టుకుని చెబితే మాత్రం ‘‘దయచేసి ఆ కళ్లజోడు తీసి మాట్లాడతారా?’’ అనేస్తారు మాళవిక. అలా అన్నందుకే గత నాలుగు రోజులుగా హీరో విజయ్ ఫ్యాన్స్ ఆమెను ఈ సభ్యసమాజం నుంచే వెలివేసినంతగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఖిన్నురాలయ్యారు. నేను అన్నదేమిటి? వీళ్లు అంటున్నదేమిటి? ఏప్రిల్ 26. ‘యాక్టర్ విజయ్ ఫ్యాన్స్’ ట్విట్టర్ అకౌంట్లో ఒక ఇలస్ట్రేషన్ని చూశారు మాళవిక. ‘మాస్టర్ టీమ్ ఆన్ క్వారంటైన్’ అనే క్యాప్షన్‌తో ఉన్న కార్టూన్లాంటి ఇలస్ట్రేషన్ అది. అందులో హీరో విజయ్ ఉన్నాడు. డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ ఉన్నాడు. ఇంకో యాక్టర్ విజయ్ సేతుపతి ఉన్నాడు. డిజైనర్ గోపి ప్రసన్న ఉన్నాడు. మరో ముగ్గురు టెక్నీషియన్లు ఉన్నారు. ఓ వైపు తనూ ఉంది. వాళ్లంతా గేమ్స్‌తో, ల్యాప్‌టాప్స్‌తో, మ్యూజిక్‌తో, స్మార్ట్ఫోన్లలోని మూవీలతో ఎంటర్టైన్ అవుతూ ఉంటే తను మాత్రం ఓ పక్కన వంట చేస్తూ ఉంది! నచ్చలేదు మాళవికకు. తనను వంట చేస్తున్నట్లుగా చూపించడం నచ్చకపోవడం కాదు. వంట చేయడానికే ఆడవాళ్లు పుట్టినట్లు చూపించడం ఏంటని. ‘‘కల్పిత పాత్రల్లో కూడా స్త్రీలు వంటకే పరిమితమా! ఆడవాళ్ల పనులు, మగవాళ్ల పనులు అన్న భేదం ఎప్పటికి పోతుంది?’’ అని ఆ ఇలస్ట్రేషన్కి కామెంట్ పెట్టారు మాళవిక. ఇక తిట్ల వరద. జీర్ణించుకోలేనిదంతా ట్విట్టర్‌లోంచి ఆమె పైన వచ్చిపడింది. అది ఇంకా బాధించింది మాళవికను. చివరికి ఆమె తన పోస్ట్‌ను డిలీట్ చేయవలసి వచ్చింది. చాలాకొద్దిమంది మాళవికను సమర్థించారు. ఆమె అభిమానులలో ఒకరు వంట చేస్తున్న మాళవికను పుస్తకం చదువుతున్న మాళవికగా మార్చి ట్వీట్ చేశారు. థ్యాంక్స్ చెప్పారు మాళవిక.. ‘నాకు బుక్స్ చదవడం ఇష్టమని మీకెలా తెలుసు’ అని ఆశ్చర్యపోతూ. ఇక.. విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్‌ని మనసుకు తీసుకోవద్దని కొందరు ట్వీట్ చేశారు. ఇండస్ట్రీలో మాళవికను గట్టిగా సమర్థించిన వారు మాత్రం ఒకే ఒక్కరు.. గాయని శ్రీపాద చిన్మయి. ఈ ఎపిసోడ్‌పై హీరో విజయ్ ఇంతవరకు బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. మాళవిక పైకి ఎత్తిన ట్వీట్ల కత్తులను అతడి ఫ్యాన్స్ దించేస్తే మాత్రం దాని వెనుక ఉన్న కారణం బహుశా అతడైతే కావచ్చు. ∙ ఒక ప్రొఫెషనల్ నటి తనది కాని పాత్రను తనకు ఆపాదించడం ఏమిటి అని ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే వేధిస్తారా! దూషిస్తారా! ద్వేషిస్తారా! ఆమె అన్నది కరెక్టే. కళ్లజోడు తీసి చూడనంత వరకు స్త్రీని మరోలా మీరు చూడలేరు. – చిన్మయి -
కరోనా: హీరో విజయ్ ఇంటిలో ఆరోగ్యశాఖ తనిఖీ
సౌత్ స్టార్ హీరో విజయ్ తళపతి ఇంటిని ఆరోగ్య శాఖ అధికారులు సోమవారం అకస్మాత్తుగా తనిఖీ చేశారు. కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన వారి ఇళ్లను ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీ చేసి కరోనా వైరస్ బారిన పడ్డవారిని గుర్తించే పనిలో పడ్డారు. ఇందుకోసం గత రెండు, మూడు నెలల్లో విదేశాలకు వెళ్లిన వారి జాబితాను తీసుకుని వారందరి ఇళ్లను అధికారులు సందర్శిస్తున్నారు. (రెండు లక్షల వరకు కరోనా మృతులు) ఇక ఈ జాబితాలో హీరో విజయ్ కూడా ఉండటంతో చెన్నైలోని ఆయన నీలంకరి నివాసాన్ని కూడా అధికారులు సందర్శించారు. కాగా వైద్యులు విజయ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించి ఈ మహమ్మారి బారిన ఆయన కుటుంబ సభ్యులేవరు పడలేదని నిర్ధారించారు. అంతేగాక ఆరు నెలల ముందు విజయ్ మీనహా ఆయన కుటుంబ సభ్యులేవరు విదేశాలకు వెల్లలేదని నిర్థారించుకుని ఇంటిలో శానిటైజర్ స్ర్పే చేసి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రస్తుతం విజయ్ నటిస్తున్న ‘మాస్టర్’ సినిమా పేర్కొంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు సమాచారం. (హైదరాబాద్‌లో కరోనా మరణం.. అంత్యక్రియలు పూర్తి) -
'రాశి'బాగుంది..
సినిమా : నటి రాశీఖన్నా రాశి బాగుంది. ఆమె రాశి బాగుండబట్టే కదా తెలుగు, తమిళ భాషల్లో నాయకిగా రాణిస్తోంది అని అంటారా? అదీ కరెక్టే కానీ కోలీవుడ్‌లో ఇప్పుడు ఆమె టైమ్ ఇంకా బాగుంది. కారణం ఇళయదళపతితో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఇంతకు ముందు జయంరవికి జంటగా అడంగమరు, అధర్య సరసన ఇమైకా నొడిగళ్, విజయ్‌సేతుపతితో సంఘతమిళన్ వంటి చిత్రాల్లో రాశీఖన్నా నటించింది. ఆ చిత్రాలు మంచి సక్సెస్‌నే అందుకున్నాయి. ప్రస్తుతం సిద్ధార్థ్‌కు జంటగా సైతాన్ కా బచ్చా, సుందర్.సీ దర్శకత్వంలో అరణ్మణై 3 చిత్రాల్లో నటిస్తోంది. ఇక తెలుగులో విజయ్‌దేవరకొండతో జత కట్టిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ఈ నెల 14న తెరపైకి రానుంది. అయితే కోలీవుడ్‌లో ప్రముఖ స్టార్‌తో నటించే అవకాశం రాలేదు. కాగా విజయ్ వంటి స్టార్‌తో నటించే అవకాశం వస్తే ఆ స్టార్డమ్నే వేరు. అలాంటి క్రేజీ ఆఫర్‌ను రాశీఖన్నా కొట్టేసిందన్నది తాజా సమాచారం. విజయ్ ప్రస్తుతం మాస్టర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మలయాళ నటి మాళవికామోహన్ నటిస్తోంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఫైట్ సన్నివేశాలను చెన్నైలో చిత్రీకరిస్తున్నారు. చిత్రాన్ని సమ్మర్లో విడుదల చేయడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా విజయ్ తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుందని సమాచారం. అదే విధంగా అరుణ్‌రాజ్ కామరాజ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఇందులో విజయ్‌కు జంటగా నటి రాశీఖన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. మరో ముఖ్య పాత్రలో ఐశ్వర్యరాజేశ్ నటించనున్నట్లు తెలిసింది. ఇందులో ఆమె విజయ్‌కి చెల్లెలుగా నటించనున్నట్లు సమాచారం. అయితే ఇటీవలే ఈ అమ్మడు ఎవరికి చెల్లెలిగానైనా నటిస్తాను కానీ విజయ్‌కు చెల్లెలిగా నటించనని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు అలాంటి పాత్రనే విజయ్‌తో నటించడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. మరి దీనికి ఏం చెప్పి సమర్ధించుకుంటుందో ఐశ్వర్యరాజేశ్. కాగా ఇంతకు ముందు కూడా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఎంగవీట్టు పిళ్లై చిత్రంలో ఈ అమ్మడు శివకార్తీకేయన్‌కు చెల్లెలిగా నటించింది. మాస్టర్ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే తాజా చిత్రానికి విజయ్ రెడీ అవుతారని తెలిసింది. దీనికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా విజయ్ నటించనున్న 65వ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
విజయ్‌కి ఐటీ శాఖ సమన్లు
తమిళనాడు ,పెరంబూరు : హీరో విజయ్‌కి ఆదాయపన్ను శాఖ సోమవారం సమన్లు జారీ చేసింది. ఐటీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే సినిమా షూటింగ్లో బిజిగా ఉన్న నేపథ్యంలో ఆయన ఇందుకు హాజరు కాలేకపోయారు. ఇటీవల ఐటీ అధికారులు సుమారు 30 గంటల పాటు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో ఆదాయానికి సంబంధించిన లెక్కలన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయని, అదనంగా ఏమీ లభించలేదనే ప్రచారం జరగడంతో విజయ్‌తో పాటు, ఆయన సినీ వర్గాలు, ముఖ్యంగా ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజగా ఐటీ అధికారులు కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలంటూ సమన్లు జారీ చేయడంతో మరోసారి చర్చ మొదలైంది. గత ఏడాది అట్లీ దర్శకత్వంలో ఏజీఎస్ సంస్థ నిర్మించిన బిగిల్ చిత్రంలో విజయ్ నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం అధిక లాభాలు తెచ్చి పెట్టిందని ప్రచారం జరిగింది. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం రూ.300 కోట్ల వరకూ లాభాలను తెచ్చి పెట్టిందని ప్రచారం జరిగింది. వీటిపై బిగిల్ చిత్ర వర్గాలు ఐటీశాఖకు చూపించకపోవడంతో ఆ శాఖ అధికారులు ఇటీవల విజయ్, ఏజీఎస్ అధినేత అఘోరం, ఫైనాన్సియర్ అన్బు చెలియన్ల ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. మొత్తం 77 కోట్ల నగదు, పలు ఖరీదైన వజ్రాలు, బంగారంతో పాటు పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే విజయ్ ఇంటిలో ఏమీ దొరకలేదనే ప్రచారం జరిగింది. కాగా సోమవారం అనూహ్యంగా వీరందరికీ చెన్నైలోని ఆదాయశాఖ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఐటీ అధికారులు సమన్లు జారీ చేశారు. ముందు మూడు రోజుల్లోగా హాజరుకావాలని ప్రచారం జరిగింది. ఆ తరువాత సోమవారమే హాజరుకావాలని సమన్లలో పేర్కొనట్లు తెలిసింది. హాజరు కాని విజయ్ ఈ నేపథ్యంలో విజయ్ సోమవారం కూడా తాను నటిస్తున్న మాస్టర్ చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు. షూటింగ్ కారణంగా తాను ఆదాయశాఖ కార్యాలయానికి హాజరు కాలేకపోతున్నట్లు తెలిపినట్లు సమాచారం. మంగళవారం విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అదే విధంగా ఏజీఎస్ సంస్థ అధినేత అఘోరం, ఫైనాన్సియర్ అన్బు చెలియన్ కూడా సోమవారం విచారణకు హాజరు కాలేదు. దీంతో ఐటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. విజయ్ అడ్డు పడతారనే భయంతోనే కాగా విజయ్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు, ఆయన నటిస్తున్న మాస్టర్ చిత్ర షూటింగ్‌ను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు, సీపీఎం నేతలు, నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్, పలువురు సినీ ప్రముఖులు ఈ దాడులను ఖండించారు. తాజాగా దర్శకుడు, నటుడు అమీర్ సైతం ఐటీ దాడులను ఖండించారు. ఆదివారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో బీజేపీ ఎదుగుదలకు విజయ్ అడ్డం అవుతారనే భావనతోనే ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న భావన కలుగుతోందన్నారు. వారి ఆటంకాలు విజయ్ ఎదుగుదలను అడ్డుకోగలవేమో గానీ, ఆయన్ని వెనుకడుగు వేయనీయవన్నారు. విజయ్ చిత్ర షూటింగ్లో ఆందోళనలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. విజయ్ రాజకీయాల్లో రావడాన్ని ఒక తమిళుడిగా తాను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు, విజయ్ తలచుకుంటే తన అభిమానులను షూటింగ్ ప్రాంతానికి రప్పించి ఆందోళన కారులను తరిమి కొట్టించి ఉండవచ్చునని అయితే ఆయన పరిపక్వతను ప్రదర్శించారని అన్నారు. బీజేపీ రజనీకాంత్‌తో రాజకీయం చేస్తుండటంతో విజయ్ ఎదుర్కొంటారనే భయంతోనే ఆయన ఇంటిపై ఈ ఐటీ దాడులని అమీర్ పేర్కొన్నారు. ఐటీ దాడుల వ్యవహారంపై పార్లమెంట్లో చర్చ పెరంబూరు : నటుడు విజయ్ ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్వహించిన సోదాలు ఇప్పుడు తమిళనాడును దాటి పార్లమెంట్ వరకూ వెళ్లింది. విజయ్ నటిస్తున్న మాస్టర్ చిత్రం షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ఆయన్ను ఐటీ అధికారులు సుమారు 5 గంటల పాటు విచారణ జరిపిన సంఘటన, ఆ తరువాత ఆయనకు చెందిన ఇళ్లల్లో రెండు రోజుల పాటు జరిపిన సోదాలు కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. విజయ్ ఇళ్లలో ఐటీ సోదాలను పలువురు రాజకీయ పార్టీ నాయకులు ఖండించారు. కాగా ఈ వ్యవహారం ఇప్పుడు పార్లమెంట్ వరకూ వెళ్లింది. డీఎంకే పార్లమెంట్ సభ్యుడు దయానిధి మారన్ నటుడు విజయ్‌కు మద్దతుగా లోక్‌సభలో ప్రశ్నను రైజ్ చేశారు. రజనీకాంత్‌కు ఇటీవల కోటి రూపాయలకు పన్ను రాయితీని ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ, నటుడు విజయ్‌పై ఐటీ సోదాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. రజనీకాంత్‌కు ఒక న్యాయం, విజయ్‌కు మరో న్యాయమా? అంటూ ప్రశ్నించారు. కాగా దయానిధి మారన్ నటుడు రజనీకాంత్‌తో ఆయన 168వ చిత్రాన్ని నిర్మిస్తున్న కళానిధిమారన్ సోదరుడన్నది గమనార్హం. కాగా సోమవారం నటుడు విజయ్ మాస్టర్ చిత్ర షూటింగ్లో తనకు అండగా నిలిచిన అభిమానులతో సెల్పీ ఫోటో దిగి ధ్యాంక్యూ నైవేలి అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆయన అబిమానులు ఖుషీ అవుతున్నారు. -
వైరల్‌గా మారిన విజయ్ ఫస్ట్‌లుక్
తమిళ నటుడు విజయ్ తన అభిమానులకు కొత్త సంవత్సరానికి గానూ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన 64వ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమా ‘మాస్టర్’ టైటిల్‌ను విజయ్ తన తాజా చిత్రానికి ఎంచుకున్నాడు. ఈ మేరకు సినిమా ఫస్ట్‌లుక్‌తోపాటు మాస్టర్ అనే టైటిల్‌ను సోషల్ మీడియాలో ప్రకటించారు. ఫస్ట్‌లుక్‌లో మసకగా కనిపిస్తున్న విజయ్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ‘మాస్టర్’ అనే టైటిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా అధికభాగం కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ కాలేజీ ప్రొఫెసర్‌గా కనిపించనున్నాడు. విజయ్‌కు జోడీగా హీరోయిన్ మాళవిక్ మోహనన్ నటించనున్నారు. ‘మాస్టర్’ చిత్రంలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించనున్నారు. ‘మాస్టర్’ విజయ్, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా విజయ్ ద్విపాత్రాభినయం చేసిన బిగిల్ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించింది. ఇందులో జాకీ ష్రాఫ్, నయనతార ముఖ్య పాత్రలు పోషించారు. రూ.300 కోట్లు కలెక్షన్లతో 2019లో అత్యధిక వసూళ్లు అందుకున్న టాప్ తమిళ చిత్రంగా ‘బిగిల్’ నిలిచింది. #Master pic.twitter.com/dNhDc48eDA — Vijay (@actorvijay) December 31, 2019 -
అనుకరణ... అనుసరణ
బౌద్ధసంఘంలో కొందరు భిక్షువులు తమ గురువులను, ముఖ్యంగా బుద్ధుణ్ణి అనుకరిస్తూ జీవించేవారు. ప్రసంగాలు చేస్తూ ఉండేవారు. అలాంటి వారిలో దేవదత్తుడు ఒకడు. బుద్ధునిలా కూర్చుని, బుద్ధునిలా నడుస్తూ, బుద్ధునిలా పడుకుని, ‘నేనూ బుద్ధునిలాగే నడుచుకుంటున్నాను. బుద్ధునితో సమానమైన వాణ్ణే’ అని అంటూ ఉండేవాడు. దేవదత్తునిలాగా మరికొంతమంది భిక్షువులు తయారయ్యారు. ఒకరోజున ఒక అనుకరణ భిక్షువు బుద్ధుని కొరకు వచ్చినప్పుడు బుద్ధుడు ఈ కథ చెప్పాడు. ఒక అడవిలో ఒక మహావృక్షం కింద ఒక ఏనుగు జీవిస్తూ ఉండేది. ఆ సమీపంలో ఒక సరోవరం ఉంది. దాని నిండా ఎర్రకలువలూ, ఎర్ర తామరలూ ఉన్నాయి. ప్రతిరోజూ సరోవరం నిండా వాటి పూలే. ఆ ఏనుగు రోజూ సరోవరంలో దిగి తామరతూడులు, దుంపలు లాగేసేది. పూలూ, తూడులు తినేది. దుంపలకు అంటిన బురదని నీటిలో జాడించి, శుభ్రం చేసుకుని తినేది. దాని బొరియల్లో ఒక గుంటనక్క జీవిస్తూ ఉండేది. అది ముద్దుగా, బొద్దుగా ఉన్న ఏనుగుని చూసి ‘నేనూ ఇలా బలంగా తయారవ్వాలి’ అనుకుంది. ‘ఏనుగు తామర తూడులు, దుంపలు తినడం చూసి నేనూ ఇక వీటినే తినాలి. ఏనుగులా బలాన్ని తెచ్చుకోవాలి’ అనుకుని సరస్సులో దిగి తామరతూడుల్ని పీకి దుంపల్ని బురదతో సహా తినడం మొదలు పెట్టింది. కొన్ని రోజులు అలా తినేసరికి, దాని పేగుల్లో మట్టి పేరుకుని పోయి, జబ్బు చేసి, చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది. బుద్ధుడు చెప్పిన ఈ కథ విన్న భిక్షువుకి ‘మనిషికి ఆచరణ స్వాభావికం కావాలి కానీ, ఎవరినో అనుకరించి, మనది కాని స్వభావాన్ని మనం తెచ్చిపెట్టుకోకూడదు. తెచ్చిపెట్టుకున్నది నటనే అవుతుంది కానీ నిజం కాదు’ అని అర్థమై తన నడవడిక మార్చుకుని, ఆచరణను సరిదిద్దుకున్నాడు. – డా. బొర్రా గోవర్ధన్ -
హైదరాబాద్‌లో చెస్ సూపర్ గ్రాండ్ మాస్టర్ క్యాంప్
-
క్రియాశీలకంగా ‘గుడా’
– చైర్మన్, వైస్ చైర్మన్ నియామకంతో కార్యకలాపాలు వేగవంతం –‘గుడా’ పరిధికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ – ప్రత్యేకాధికారిగా సంజయ్‌రత్నకుమార్ – రాజమహేంద్రవరంలో జోనల్ కార్యాలయం సాక్షి, రాజమహేంద్రవరం : కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు, చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేసిన గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(గుడా) కార్యకలాపాల వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. గుడా చైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణను నియమించిన ప్రభుత్వం కాకినాడలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. తాజాగా రాజమహేంద్రవరంలోని నగరపాలక సంస్థ రెవెన్యూ కార్యాలయంలో గుడా జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. గుడాకు ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను రూపాందించేందుకు నియమించిన ప్రత్యేక అధికారి సంజయ్‌రత్నకుమార్ బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్‌గా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గుడా పరిపాలనా కార్యకలాపాలకు సంబంధించి మంగళవారం వైస్ చైర్మన్ విజయరామరాజు అధ్యక్షతన మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుడా పరిధిలోని కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీలు, గొల్లప్రోలు నగరపంచాయతీల కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు, టౌన్‌ప్లానింగ్ విభాగం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా, గుడా మాస్టర్‌ప్లాన్ తయారీ ప్రత్యేక అధికారి సంజయ్‌రత్నకుమార్ హాజరయ్యారు. గుడా పరిపాలనపై కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులకు వైస్ చైర్మన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై గుడా పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్, అర్బన్ డెవలప్మెంట్ అ«థారిటీస్ చట్టం–2016 కింద జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం నగరపాలక, పురపాలక సంఘాలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా ఇక నుంచి గుడా పరిధిలో భవనాల నిర్మాణం, ఇతర అనుమతుల కోసం గుడాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా దరఖాస్తులను పరిశీలించిన అనంతరం గుడా వారికి అనుమతులు మంజూరు చేస్తుంది. అంతేకాక పురపాలక శాఖ విడుదల చేసిన జీవో 439 ప్రకారం నగర, పురపాలక సంఘాలు అభివృద్ధి చార్జీలు, బిల్డింగ్ ఫీజులు, లే అవుట్ల అనుమతులకు ఫీజులు ఆయా సంఘాలు గుడాకు జమ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి కొత్త నిర్మాణాలు, లే అవుట్లు చేపట్టాలంటే గుడా అనుమతి తప్పనిసరి. గుడా పరిధిలో లే అవుట్లు, భవనాల నిర్మాణాలకు ప్లాన్లు తయారు చేసే లైసెన్స్ సర్వేయర్లు తమ పేర్లు తప్పనిసరిగా గుడా వద్ద నమోదు చేయించుకోవాలని వైస్ చైర్మన్ తెలిపారు. ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు చర్యలు గుడా పరిధిలోని ప్రాంతాలకు ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ తయారు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందు కోసం రాష్ట్ర టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉన్న ప్లానింగ్ అధికారి సంజయ్రత్నకుమార్ను గుడా ప్లానింగ్ అధికారిగా నియమించింది. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం కేంద్రంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వైస్ చైర్మన్ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ కావడంతో ఇక్కడే ఉంటున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మాస్టర్ ప్లాన్‌ను రూపాందించిన అనుభవం కమిషనర్‌కు ఉండడం గుడా మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు ఉపయోగపడనుంది. గుడాకు మాస్టర్‌ప్లాన్ రూపాందించి అమలు చేస్తే కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య అభివృద్ధి వేగవంతం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. -
నాని మొత్తానికి ఓ సూపర్ సైకిల్ కొట్టేశాడు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి , యంగ్ హీరో నానీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నానీకి ఓ మంచి సైకిల్ కొని పెట్టారు. అలా మాస్టర్ సినిమా సందర్భంగా కోల్పోయిన సైకిల్ ను సరికొత్తగా నానీ సొంతం చేసుకున్నారు. మరి ఈ సంతోషాన్ని నాని అభిమానులతో పంచుకోకుండా ఉంటాడా.. వెంటనే ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. చిరంజీవి గారు పంపిన సూపర్ కూల్ సైకిల్ అంటూ ఫోటోలను షేర్ చేశారు. చిరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ పాపులర్ టెలివిజన్ షోకి ముఖ్య అతిధిగా విచ్చేసిన నాని తన చిన్న నాటి సంగతులను పంచుకున్నారు. తన చిన్నప్పుడు చిరంజీవి ‘మాస్టర్’ సినిమాకు సైకిల్ వేసుకెళ్తే దానిని ఎవరో దొంగిలించారని, అయితే చిరు సినిమాకు టికెట్ దొరికిన ఆనందంలో సైకిల్ పోయిందన్న బాధే తనకు కలగలేదని చెప్పారు. షోలో గెలుచుకున్న దానిలో కొంత సొమ్ముతో ఆ సైకిల్ కొనుక్కుంటానంటూ నానీ చెప్పుకొచ్చాడు. అయితే అందుకు చిరంజీవి నో చెప్పారు. ..తన సినిమాకు వచ్చినందుకు సైకిల్ పోయింది కాబట్టి, తానే కొత్త సైకిల్ కొనిపెడతానని హామీ ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని చిరు తొందరగానే దాన్ని నెరవేర్చారు. And the boy got his cycle back :) As promised on the show, Chiranjeevi Garu sent me this super cool cycle!#MegastarForAReason pic.twitter.com/zMrbDLMwGj — Nani (@NameisNani) April 14, 2017 -
మహా రాజమహేంద్రి
విలీన ప్రతిపాదిత గ్రామాలకు వర్తింపజేసేలా కౌన్సిల్ ఆమోదం ప్రతిపాదించిన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజానగరంతోపాటు 8 గ్రామాలు, వేమగిరికి కూడా మాస్టర్‌ప్లాన్ తాజా ప్లాన్‌తో నగర విస్తీర్ణం 118.33 చ.కి.మీ 10 పంచాయతీల కలయికతో పెరగనున్న పదిరెట్ల విస్తీర్ణం సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగర చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల పరిధిలోని 13 గ్రామ పంచాయతీలను కలుపుతూ నగరపాలక మండలి ఆమోదించిన మాస్టర్‌ప్లాన్ పరిధి మరింత విస్తరించనుంది. విలీన ప్రతిపాదనలో ఉన్న రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కోరుకొండ మండలాల పరిధిలోని 21 పంచాయతీలకు, విలీన ప్రతిపాదన లేని కడియం మండలం వేమగిరిని కలిపి మాస్టర్ ప్లాన్ తయారు చేసే ప్రతిపాదన మండలి ఆమోదించింది. బుధవారం జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ అంశాన్ని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రతిపాదించగా మండలి ఏకగ్రీవంగా ఆమోదించింది. గతేడాది వరకు 1975లో రూపొం దించిన మాస్టర్ ప్లాన్ నగరంలో అమలులో ఉంది. పలు కారణాలతో ఇది అమలుకు నోచుకోలేదు. ఇప్పటి వరకు నగర విస్తీర్ణం 44.5 చదరపు కిలోమీటర్లు. 2031 నాటి అభివృద్ధిని అంచనా వేస్తూ రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నగర చుట్టు పక్కల ఐదు కిలోమీటర్ల దూరంలోని 13 పంచాయతీలను కలిపారు. ఇందులో రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని కాతేరు, కోలమూరు, పాలచర్ల, లాలాచెరువు, పిడింగొయ్యి, హుకుంపేట, శాటిలైట్‌సిటీ, బొమ్మూరు, ధవళేశ్వరం, గాడాల, తొర్రేడు, రాజానగరం మండల పరిధిలోని దివా¯ŒS చెరువు, కోరుకొండ మండలంలోని మధురపూడి(ఎయిర్‌పోర్టు) ఉన్నాయి. వీటిని కలుపుతూ మాస్టర్‌ప్లాన్ రూపొందించి గత ఏడాది డిసెంబర్ 3న ఆమోదించారు. ఫలితంగా 118.33 చ.కి.మీ విస్తీర్ణం కలవడంతో నగర పరిధి 162.83 చ.కి.మీ మేర పెరిగింది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో విలీన ప్రతిపాదన లేని వేమగిరి పంచాయతీకి కూడా మాస్టర్‌ప్లా¯ŒSను వర్తింపజేయాలన్న ఆలోచనకు రావడానికి అనేక అంశాలు దోహదం చేశాయి. మాస్టర్‌ప్లా¯ŒS పరిధిలో ఉన్న ధవళేశ్వరం గ్రామానికి వేమగిరి సమీపంలో ఉంటుంది. అదీగాక 216 నంబర్ జాతీయ రహదారికి సమీపంలో ఉండడం, అక్కడ జీఎంఆర్, సర్వారాయ బాటిలింగ్ యూనిట్(కోకాకోలా), యువరాజ్ పవర్‌ప్లాంట్ తదితర పరిశ్రమలు ఉండడంతో మాస్టర్‌ప్లాన్‌ను అమలు చేస్తే సౌకర్యాలు మెరుగుపడి అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని ఈ ప్రతిపాదన చేసి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరింతగా నగర పరిధి.. ప్రస్తుతం నగరానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని 13 పంచాయతీలను కలుపుతూ మాస్టర్‌ప్లాన్ రూపొందించడంతో నగర పరిధి 162.83 చ.కి.మీకు చేరుకుంది. ఇది గతంలో కన్నా నాలుగు రెట్లు ఎక్కువ. తాజాగా నగరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బూరుగుపూడి, 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజానగరం, రాజవోలు, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేమగిరి, వెంకటనగరం పంచాయతీలను కూడా మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించి, అమలుచేయాలనే ప్రతిపాదనను కౌన్సిల్ ఆమోదించడంతో నగర పరిధి పలురెట్లు విస్తరించనుంది. విలీన ప్రతిపాదిత మండలాలకు మాస్టర్‌ప్లాన్ రాజమహేంద్రవరం నగరంలో కోరుకొండ, రాజానగరం, రాజమహేద్రవరం రూరల్ మండలాలల్లోని 21 గ్రామ పంచాయతీలను విలీనం చేయాలన్న ప్రతిపాదనలు నాలుVó ళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నాయి. ఇందులో నగరానికి ఐదు కిలో మీటర్ల పరిధిలోని 13 పంచాయతీలను కలుపుతూ మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. అయితే తాజాగా విలీన ప్రతిపాదన ఉండి మాస్టర్‌ప్లాన్‌లో చేర్చని రాజమహేంద్రవరం రూరల్ మండలంలోని రాజవోలు, వెంకటనగరం, రాజానగరం మండలంలోని రాజానగరం, నామవరం, చక్రద్వారా బంధం, వెలుగుబంద, నరేంద్రపురం, కోరుకొండ మండల పరిధిలోని బూరుగుపూడి, నిడగట్లకు మాస్టర్‌ప్లాన్ తయారు చేసి వర్తింపజేయాలని కౌన్సిల్ ఆమోదించిది. ఈ పంచాయతీలతోపాటు విలీన ప్రతిపాదన లేని కడియం మండలం వేమగిరి పంచాయతీని కూడా మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించింది. -
మాస్టర్ ప్లాన్‌పై అఖిల పక్షం వేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి అరుణ్ డిమాండ్ కోటగ్ముమం (రాజమహేంద్రవరం) : రాజమహేందవరం నగరపాలక సంస్థ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఇటీవల ఆమోదించిన మాస్టర్ ప్లాన్ ఏకపక్షంగా జరిగిందని, దీనిపై అఖిలపక్షం వేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 13 గ్రామాలను విలీనం చేస్తూ తయారు చేసిన మాస్టర్ ప్లాన్‌పై గ్రామసభలు పెట్టి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తమ అనుచరులకు లాభం చేకూర్చే విధంగా మాస్టర్ ప్లాన్ మార్పులు చేశారని ఆరోపించారు. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పోలవరం విలీన మండలాల్లో తమ పార్టీ 25 రోజుల పాటు 250 గ్రామాల్లో పాదయాత్ర చేస్తే అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. విలీన మండలాలను చంద్రబాబు ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యానికి గురి చేస్తోందన్నారు. తాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, మరుగుదొడ్లు వంటి కనీస అవసరాలను కూడా ప్రభుత్వం కల్పించడం లేదన్నారు. పీహచ్‌సీల్లో గర్భిణులు ప్రసవానికి ఇంటి నుంచి బకెట్లతో నీరు మోసుకోవాల్సిన దుస్థితన్నారు. 50 రోజులు దాటినా ప్రజలకు నోట్ల కష్టాలు తీరలేదని, ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు. సీపీఎం నాయకులు ఎస్ఎస్ మూర్తి, బీబీ నాయుడు, ఎన్ భీమేశ్వరరావు విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. -
మాస్టర్‌ప్లాన్‌లో మాయాజాలం
పదుల సంఖ్యలో మార్పులు చేర్పులు ప్రజాప్రతినిధుల సిఫార్సులు పంచాయతీల్లోని భూములకు కార్పొరేటర్ల వత్తాసు ప్రతిపాదించిన రోడ్లు ఉపసంహరణ, జోన్లు మార్పు చేతులు మారిన కోట్ల రూపాయలు బహుమతులుగా ప్లాట్లు, పొలాలు పేదల ఇళ్లు పోతున్నాయన్నా పట్టించుకోని నేతలు సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్ర విభజన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్య నగరంగా, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రవరం నగర విస్తరణకు తాజాగా ఆమోదించిన నూతన మాస్టర్‌ప్లాన్‌లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. రోడ్ల వెడల్పు, కొత్త రోడ్ల ప్రతిపాదనలు, జోన్ల ఎంపికలో పలు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మాస్టర్ ప్లాన్‌లో కేవలం రోడ్ల విభజన, జోన్ల ఏర్పాటు వంటి వాటినే ప్రస్తావించగా, వాటిని కూడా అధికారపార్టీ నేతలు తమ స్వలాభం కోసం నచ్చినట్లుగా మార్చుకున్నారు. తమ ఆస్తుల విలువ పెరగడం కోసం ఆయా ప్రాంతాల్లో అవసరం లేకున్నా రోడ్లు వేయడం, తమ, తమ అనునూయల ఆస్తులకు నష్టం వాటిల్లుతుందంటే ఆ ప్రతిపాదనలను ఉపసంహరించడం వంటి అనేక మాయా జాలాలు మాస్లర్ ప్లాన్‌లో చేశారు. పలువురు సీనియర్ కార్పొరేటర్లు అధికార బలంతో తమ పరిధికాని డివిజన్లు, పంచాయతీల్లోని ప్రజల వినతులకు సిఫార్సులు చేసి ఆమోదించుకోవడం విశేషం. ఈ వ్యవహారాల్లో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. రోడ్డు వెడల్పు చేయడం వల్ల తమ ఇళ్లు పోతున్నాయని పేదలు, మధ్య తరగతి ప్రజలు విన్నవించినా పట్టించుకోని రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పాలక మండలి, అధికార పార్టీ ఎమ్మెల్యే, పలువురు కార్పొరేటర్లు ప్రతిపాదించిన సిఫార్సులకు మాత్రం ఎలాంటి అభ్యంతరం తెలపకుండా ‘సై’ అంది. కార్పొరేటర్ల అభ్యంతరాలు, సూచనలతో మొదలు... రాజమహేంద్రవరం నగరంలో 2031 సంవత్సరం నాటికి అభివృద్ధిని అంచనా వేస్తూ 2014లో నూతన మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. నగర చుట్టుపక్కల ఐదు కిలోమీట్లర పరిధిలోని ప్రాంతాలను నగరంలో కలుపుతూ ఈ మాస్టర్‌ప్లాన్‌ను తయారు చేశారు. నగర చుట్టుపక్కల ఉన్న 13 పంచాయతీలు కొత్తగా మాస్టర్ ప్లాన్ పరిధిలోకి వచ్చాయి. మాస్టర్ ప్లాన్‌పై అభ్యంతరాలు, సూచనలు తెలపాలంటూ యంత్రాంగం నగర ప్రజలను కోరింది. దీనిపై దాదాపు 600 సూచనలు, అభ్యంతరాలు వచ్చాయి. ఇందులో రోడ్లు వెడల్పులు పెంచడం, తగ్గించడం, జోన్ల మార్పిడి, నూతన రోడ్లు ఉపసంహరణ వంటి ప్రతిపాదనలున్నాయి. వీటిపై నగరపాలక మండలి చర్చించి ఆమోదయోగ్యమైన సలహాలు, అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుంది. మాస్లర్ప్లాన్పై పాలక మండలి మూడుసార్లు సమావేశమైంది. మొదటిసారి ఇతర అంశాలు ఉండడం, ప్రజల అభ్యంతరాలు, సూచనలు ఆంగ్లంలో ఉండడంతో తెలుగులోకి మార్చి ఇవ్వాలని వాయిదా వేశారు. రెండోసారి కార్పొరేటర్ల అభ్యంతరాలు తెలపడానికి ప్రత్యేకంగా వాయిదా వేశారు. ఇక్కడే పలువురు కార్పొరేటర్లు 50 అభ్యంతరాలు, సిఫార్సులు చేశారు. ఈ నెల 3వ తేదీన మూడోసారి మాస్టర్ ప్లాన్‌పై సమావేశమైన పాలక మండలి ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించింది. ప్రతిపక్ష పార్టీలు, స్వతంత్ర కార్పొరేటర్లు చర్చ జరగాలని పట్టుబట్టినా ఎకగ్రీవంగా ఆమోదించడం గమనార్హం. ‘పరిధి’దాటిన సిఫార్సుల ‘చిత్రాలు’... మాస్టర్ ప్లాన్‌పై కార్పొరేటర్ల అభ్యంతరాలు తెలపడం కోసం అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు వ్యూహాత్మకంగా రెండోసారి పాలక మండలి సమావేశాన్ని వాయిదా వేయించారు. ఇక్కడే మాస్టర్ ప్లాన్‌లో అనేక ‘చిత్రాలు’ చోటుచేసుకునేందుకు ఆస్కారం ఏర్పడింది. పలువురు కార్పొరేటర్లు, అధికార పార్టీ ప్రజాప్రతినిధికి కాసుల వర్షం కురిపించుకునే అవకాశం కుదిరింది. నగరంతోపాటు మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి వచ్చే పంచాయతీల ప్రజలు తమ పొలాలు, ఆస్తులు కాపాడుకునేందుకు వారిని ఆశ్రయించారు. తమ పొలం, ప్లాట్లు నుంచి పోతున్న రోడ్లను ఉపసంహరించడం, వెడల్పు తగ్గిండం, జోన్లు మార్పు వంటి వినతులు అందజేశారు. రోడ్ల వెడల్పు పెంచడం వల్ల దుకాణాలు, రోడ్ల పక్కన విలువైన స్థలాలు కోల్పోతుండడంతో వ్యాపారస్తులు, రియల్ వ్యాపారులు అధికార పార్టీ ప్రజాప్రతినిధి, నగరపాలక మండలిలో అధికారపార్టీ ముఖ్య నేతలను ఆశ్రయించారు. కానుకగా కాసులు, ప్లాట్లు మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేర్పులు వల్ల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. నగదుతోపాటు నచ్చిన వారికి వారివారి రియల్ వెంచర్లలో ప్లాట్లు కానుకగా ఇచ్చినట్లు తెలిసింది. మరికొందిరికి విలువైన బహుమతులు సిఫార్సులు చేయించుకున్నవారు అందించినట్లు నగరంలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఎన్నికల్లో మా కార్పొరేటర్ పెట్టిన ఖర్చు మాస్టర్‌ప్లాన్ వల్ల తీరిందని వారి ఆనుచరులు చర్చించుకుంటున్నారు. నగర అభివృద్ధిని ఫణంగా పెట్టి అధికారపార్టీలో ముఖ్య నేతలుగా ఉన్న పలువురు కార్పొరేటర్లు తమ ఆస్తులను కాపాడుకోవడం లేదా విలువ పెంచుకోవడం కోసం అధికారాన్ని బాగా ఉపయోగించుకున్నారని ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇవీగో సిఫార్సులు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దాట్ల సుభద్రాదేవీతోపాటు ఇతరులకు చెందిన ప్లాట్లలో రోడ్డు వెళుతుండడంతో ఆ రోడ్డును ఉపసంహిరించాలని సిఫార్సు చేసి తొలగింపజేశారు. 10వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్న డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు కోలమూరు పంచాయతీలో మూడు ఎకరాలు ఇండస్ట్రియల్ జోన్ నుంచి కమర్షియల్ జోన్‌కు మార్చాలని సిఫార్సు చేశారు. 8వ డివిజన్ కార్పొరేటర్‌గా, టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న వర్రే శ్రీనివాసరావు పిడింగొయ్యి గ్రామ పంచాయతీలో 60 అడుగుల రోడ్డు ప్రతిపాదన ఉపసంహరించాలంటూ సిఫార్సు చేశారు. 9వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్న కోసూరి ఛండీప్రియ కోలమూరు గ్రామంలో ఏడు ఎకరాల భూమి ఎన్విరాన్మెంటల్ బఫర్ జోన్ నుంచి నివాస ప్రాంత జోన్‌గా మార్చాలంటూ సిఫార్సు చేశారు. 44, 48, 38 డివిజన్ల కార్పొరేటర్లుగా ఉన్న పాలవలస వీరభద్రం, గరగా పార్వతి, నండూరి వెంకటరమణ కోలమూరు, పిడింగొయ్యి పంచాయతీల్లో పరిశ్రమజోన్లో ఉన్న భూమిని రెసిడెన్సియల్ జోన్ మార్చాలని సిఫార్సు చేశారు. -
మాస్టర్, వీసా డెబిట్ కార్డులపై ఎండీఆర్ రద్దు
న్యూఢిల్లీ: మాస్టర్, వీసా డెబిట్ కార్డులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్)ను డిసెంబర్ 31 వరకూ రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. రూపే డెబిట్ కార్డులపై ఎండీఆర్‌ను గతవారమే ఎత్తివేశారు. పెన్షనర్లకు ఇబ్బంది కలిగించొద్దు పెన్షనర్లు, భద్రతా దళాల సిబ్బందికి చెల్లింపుల కోసం తగినంత నగదు ఉండేలా చూసుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. భద్రతా దళాల సిబ్బంది కోసం మిలట్రీ అవుట్‌పోస్టుల వద్ద ఏర్పాట్లు చేయాలని కోరింది. ఎయిర్‌పోర్ట్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం రద్దైన పెద్ద నోట్లు అక్రమంగా తరలకుండా దేశ వ్యాప్తంగా అన్ని ఎరుుర్‌పోర్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్రం హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రైవేట్ చార్టెడ్ విమానంలో హరియాణా నుంచి నాగాలాండ్ లోని దిమాపూర్ ఎరుుర్‌పోర్టుకు భారీగా నగదు తరలిస్తుండగా పట్టుకున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యారుు. నగదు అక్రమ తరలింపుపై గట్టి నిఘా పెట్టాలని అన్ని ఎయిర్ పోర్టుల్ని హోం శాఖ కోరింది. దేశంలో దాదాపు 98 ఎరుుర్ పోర్టుల రక్షణ బాధ్యతలు చూస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఎస్ఐఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్ఫీఎప్)లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. -
పోస్టు మాస్టర్ల భర్తీకి బ్రేక్?
50 వేల దరఖాస్తులు బుట్టదాఖలు రూ.10 లక్షలు ఖర్చు చేసిన నిరుద్యోగులు నిరుద్యోగులతో పోస్టల్ శాఖ చెలగాటం ఆన్లైన్ విధానం ద్వారా భర్తీ చేసే యోచనలో పోస్టల్ శాఖ ఖమ్మం గాంధీచౌక్: గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచి పోస్టు మాస్టర్ల ఖాళీల భర్తీ వ్యవహారం అడ్డం తిరిగింది. జిల్లాలో ఖాళీగా ఉన్న 51 బ్రాంచి పోస్టు మాస్టర్ల పోస్టులను భర్తీ చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పోస్టల్ శాఖ ఉన్నతాధికారుల అనుమతితో జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మే 27 నుంచి జూన్ 25 వ తేదీ లోగా ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్హత కలిగి ఉండి 18 నుంచి 30 ఏళ్ల వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. ఈ పోస్టుల్లో రిజర్వేషన్లను కూడా కల్పించారు. దీంతో 10వ తరగతి మొదలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివిన నిరుద్యోగులు, బీటెక్ చదివిన నిరుద్యోగులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. 51 పోస్టులు కావటంతో ఒక్కో నిరుద్యోగి తన రిజర్వేషన్‌కు అర్హత ఉన్న ప్రతి చోట దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టుల్లో మాత్రమే పంపాలని పేర్కొనటంతో అభ్యర్థులకు మరింత ఖర్చయింది. ఒక్కో దరఖాస్తుకు రూ.50 ల వరకు ఖర్చు కాగా, పట్టణాలకు వచ్చి స్పీడ్ పోస్టు, రిజిష్టర్ పోస్టు చేయడానికి మరో రవాణా ఖర్చులు మరో రూ.50 అయ్యాయి. జిల్లాలో ఉన్న 51 పోస్టులకు మొత్తం 50 వేల దరఖాస్తులు అందాయి. దరఖాస్తులు బుట్టదాఖలు నిరుద్యోగులు కోటి ఆశలతో గ్రామీణ డాక్ సేవక్ బ్రాంచి పోస్టు మాస్టర్ పోస్టులకు చేసుకున్న దరఖాస్తులు బుట్టదాఖలు కానున్నాయి. దరఖాస్తుల గడువు ముగిశాక దాదాపు నెల రోజుల కాలంలో పోస్టులు భర్తీ జరుగుతాయని ప్రచారం జరిగింది. ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా పోస్టు భర్తీకి నెల రోజుల గడువు పడుతుందని భావించారు. అధికారులు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణయించిన విధంగా భద్రపరిచారు. గతంలో ఖమ్మం పోస్టల్ డివిజన్ విజయవాడ సర్కిల్లో ఉండేది. రాష్ట్రం విడిపోవడంతో ఇటీవల ఖమ్మం డివిజన్‌ను హైదరాబాద్ సర్కిల్‌కు మార్చారు. దీంతో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇదే క్రమంలో సర్కిల్ ఉన్నతాధికారులు బ్రాంచి పోస్టు మాస్టర్ల పోస్టుల భర్తీని కూడా నిలిపివేయాలని జిల్లా అధికారులకు సూచనలు చేశారు. దీంతో జిల్లా పోస్టల్ శాఖ అధికారులు పోస్టుల భర్తీ వ్యవహారాన్ని పక్కన పెట్టారు. ఆన్లైన్ విధానం వైపు చర్యలు.. బ్రాంచి పోస్టు మాస్టర్ భర్తీలో ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సేకరించే విధానాన్ని అనుసరించాలని పోస్టల్ శాఖ భావిస్తుంది. పారదర్శకతను పాటించటం కోసం, ఎటువంటి అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండటం కోసం ఆన్లైన్ విధానాన్ని అనుసరించి చర్యలు తీసుకునేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఆన్లైన్ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు జిల్లా స్థాయి పోస్టల్ అధికారులకు పోస్టుల భర్తీ ప్రక్రియను నిలిపివేయాలని కూడా సూచనలు చేశారు. రూ.10 లక్షల ఖర్చు ... బ్రాంచి పోస్టు మాస్టర్ ఎక్కడో ఓ చోట వస్తుందని నిరుద్యోగ అభ్యర్థులు ఆశపడి భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లాలో 50 వేల దరఖాస్తులను దరఖాస్తు చేసుకోవటానికి నిరుద్యోగులు సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు చేశారని పోస్టల్ శాఖ అధికారులు, ఉద్యోగులే లెక్కలేశారు. ఖర్చులు మొత్తంగా దరఖాస్తుకు రూ.50 నుంచి రూ.100 వరకు ఖర్చు చేశారు. నిరుద్యోగులతో పోస్టల్ శాఖ చెలగాటం నిరుద్యోగులతో పోస్టల్ శాఖ చెలగాటమాడుతుందని నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనను వెలిబుచ్చుతున్నారు. దరఖాస్తులు చేసి 50 రోజులు గడిచినప్పటికీ ఇంత వరకు పోస్టుల భర్తీ విషయంలో ఆ శాఖ ఎటువంటి ప్రకటనలు చేయటం లేదు. దీంతో దరఖాస్తు చేసి పోస్టులు వస్తాయని ఆశగా ఉన్న అభ్యర్థులు జిల్లా ప్రధాన పోస్టాఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తాం : ఖమ్మం పోస్టల్ సూపరింటెండెంట్ మల్లికార్జున శర్మ బ్రాంచి పోస్టు మాస్టర్ల పోస్టుల ప్రక్రియపై ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తాం. పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహించటం లేదు. అధికారుల నుంచి జారీ అయ్యే విధానాలతో పోస్టుల భర్తీ జరుగుతుంది. శాఖాపరమైన నిర్ణయాలను పాటిస్తాం. -
పులితో కుక్క ఫైట్...
షాజహాన్ పూర్: యజమానికి విధేయతను ఎల్లప్పుడూ చాటుకుంటూ ఉండే జీవి కుక్క. నిద్రపోతున్న యజమానిని కాపాడటానికి ఏకంగా పులితో పోరాడి ఓ కుక్క ప్రాణాలు వదిలింది. ఉత్తరప్రదేశ్ లోని దుద్వా జాతీయ పార్కు సమీపంలోని బార్బాత్ పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యజమాని గురుదేవ్ సింగ్ తన కుక్కతో పాటు ఇంటి బయట పడుకున్నాడు. అర్ధరాత్రి అలికిడి విని దక్షిణ ఖేరి అడవి నుంచి వస్తున్న పులిని చూసిన జాకీ(కుక్క) యజమానిని అప్రమత్తం చేయడానికి ప్రయత్నించింది. గాఢమైన నిద్రలో ఉన్న సింగ్ ఏం జరుగుతుందో గమనించే లోపే పులి అతని మీద దాడికి దిగింది. దీంతో జాకీ ఒక్క ఉదుటున పులి మీదకు దూకి యజమానికి కాపాడటానికి ప్రయత్నించింది. పులి తిరిగి దాడి చేసి జాకీను అడవిలోకి లాక్కుని వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న సింగ్ కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని జాకీ కోసం ఆ ప్రాంతాన్నంతా తీవ్రంగా గాలించారు. సాయంకాల సమయంలో అటవీశాఖ అధికారులు అందించిన సమాచారంతో దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన జాకీకి అంత్యక్రియలు నిర్వహించారు. జాకీ తల్లి ఒక వీధి కుక్క అని, తన పిల్లలు సుప్రీత్, గుల్షన్ ప్రీత్ లు చిన్నప్పుడే దాన్ని తీసుకువచ్చారని సింగ్ తెలిపారు. పిల్లలతో పాటు వారి వెనుకే స్కూల్ కి వెళ్లేదనీ, గుల్షన్ జాకీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడని కన్నీటి పర్యంతమయ్యారు. అరణ్యంలో పులుల సంఖ్య ఎక్కువగా ఉందనీ, అప్పుడప్పుడు ఆహారం కోసం జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్ఎన్ యాదవ్ తెలిపారు. -
'అమ్మా' రక్షించు.. శివశంకర్ మాస్టర్ విన్నపాలు!
చెన్నై: తెలుగు ప్రేక్షకులకు శివశంకర్ మాస్టర్ గా సుపరిచితమైన డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్... శివశంకర్.. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు లేఖ రూపంలో విన్నపాలను పంపారు. తమ కుటుంబానికి ఆత్మ హత్య చేసుకోవడం తప్పించి మరో దారి లేదని, తమ కేసును ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించే ప్రయత్నం చేయాలంటూ ఆయన తన లేఖలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనదైన శైలిలో.. ప్రత్యేక అభినయంతో.. సూపర్ ఛాలెంజ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన డ్యాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ శివశంకర్ ప్రసాద్ కష్టాల్లో పడ్డట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు విజయ కృష్ణ ప్రసాద్ తో భార్య జ్యోతి... విడాకులు తీసుకున్నప్పటికీ తమపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని, తమ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఆయన అమ్మకు (తమిళనాడు సీఎం జయలలిత) రాసిన ఉత్తరంలో తన గోడును వెళ్ళబోసుకున్నారు. చట్ట ప్రకారం విడాకులు తీసుకుని మరీ తమను ఏడిపించాలని చూస్తోందని, పది కోట్లు చెల్లించాలని డిమాండ్ చేయడంతోపాటు, తమ కుటుంబంపై తప్పుడు కేసులు పెట్టి ఇంటిని లాక్కోవాలని చూస్తోందంటూ జయలలితకు శివశంకర్ ప్రసాద్ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. 2013 సంవత్సరంలో శివశంకర్ మాస్టారి కుమారుడు విజయశంకర్ ప్రసాద్ బెంగళూరుకు చెందిన జ్యోతిని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇద్దరి మధ్యా వచ్చిన విభేదాలతో డైవర్స్ తీసుకున్నారు. అయితే అప్పట్నుంచీ శివశంకర్ మాస్టారి కుటుంబాన్ని పలు రకాలుగా వేధిస్తున్న జ్యోతి... తాజాగా వారిపై కేసు పెట్టింది. ఇటీవల తమ ఇంటిముందు ఆందోళనకు దిగి పదికోట్ల డబ్బును డిమాండ్ చేసిందని, ఆమె టార్చర్ భరించలేక తమ కుటుంబం కొన్ని రోజులపాటు అజ్ఞాతంలోకి పోవాల్సిన పరిస్థితి వచ్చిందని శివశంకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తమ కుటుంబంపై అక్రమ కేసును బనాయించిందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని, లేదంటే కుటుంబం మొత్తం ఆత్మ హత్య చేసుకోవడం తప్ప మరోదారి లేదని తెలిపారు. మరి మాస్టారి విషయంలో అమ్మ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
మార్చి నెలాఖరు వరకు గడువు ఇవ్వాలి..
-
సింగిల్ లెగ్ సాకులు
సోల్ / సాకులు లోకులు పలు కాకులని పెద్దలు అన్నారు గానీ, లోకంలో పలు సాకులు ఉన్నాయని ఎవరూ చెప్పలేదు. అయినా నష్టమేమీ లేదు. చాకులాంటి తెలివైన మహానుభావులు కొందరు ఈ రహస్య సత్యాన్ని గుర్తించారు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి... ఎస్కేపై తిరుగువాడు ఎక్స్పర్ట్ సుమతీ అనే నీతిశతకంలోని అంతరార్థం ఇదేనని వారు గ్రహించారు. ఆత్మరక్షణ కోసం కొన్ని, అవసరార్థం ఇంకొన్ని, అనవసరాల నుంచి తప్పించుకోవడం కోసం మరికొన్ని... టోకున సాకులు చెప్పే విద్యలో ఆరితేరిన వీరులుగా, అసహాయ శూరులుగా... మొత్తానికి ఈ పాడు లోకంలో పెద్దమనుషులుగా చలామణీ అవుతూ వస్తున్నారు. ఇలాంటి పెద్దమనుషుల్లో కొందరు రాజకీయాల్లో సహజంగానే రాణిస్తున్నారు. లోకంలో ముక్కుసూటిగా పోయే అసమర్థులు, అప్రయోజకులు తప్ప వేరెవరూ సాకుల కోసం వెదుక్కోరనేది జగమెరిగిన లౌక్యసిద్ధాంతుల నిశ్చితాభిప్రాయం. అయితే, కొందరు అమాయకులు ఈ అభిప్రాయంతో విభేదిస్తారు. సాకులు చెప్పడాన్ని అవలక్షణంగా పరిగణిస్తారు. అయినదానికీ కానిదానికీ చెప్పే సాకులను ‘కుంటి’సాకులుగానూ అభివర్ణించి, తమ అక్కసును వెళ్లగక్కుతారు. సాకులు సాహిత్యావలోకనం తెలుగు సాహిత్యంలో సాకులు చెప్పే పాత్రలు చాలానే ఉన్నాయి. తెనాలి రామకృష్ణుడి వంటి వికటకవి కూడా రాయలవారి సమక్షంలో అడపాదడపా సాకులు చెప్పి, వినోదాన్ని పంచిన దాఖలాలూ ఉన్నాయి. అయితే, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరితో పడితే వారితో ఎడాపెడా టోకున సాకులు చెప్పడంలో ‘కన్యాశుల్కం’లోని గిరీశాన్ని మించిన జాదూగాడు తెలుగు సాహిత్యంలోనే లేడు. పరీక్ష తప్పి ముఖం వేలాడేసుకు వచ్చిన తన ప్రియశిష్యుడు వెంకటేశం మీదే సాకులు సంధిస్తాడు. ‘మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టలు కాల్చడం ఒక్కటే. ఎప్పుడూ కబుర్లు చెప్పడమే కానీ, ఒక మారయినా, ఒక ముక్క చెప్పిన పాపాన పోయినారూ?’ అని వెంకటేశం నిష్టూరమాడితే, గిరీశం తడుముకోకుండా సాకులు చెబుతాడు. ‘ఇలాటి మాటంటే నాకు కోపం వొస్తుంది. ఇది బేస్ ఇన్గ్రాటిట్యూడ్. నాతో మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్... ఆ మాటకొస్తే నీకున్న లాంగ్వేజీ నీ మాష్టరుకుందీ?... మనవాళ్లు వొట్టి వెధవాయలోయ్! చుట్ట నేర్పినందుకు థాంకు చెయ్యక, తప్పుపట్టుతున్నావ్? చుట్టకాల్చడం యొక్క మజా నీకు ఇంకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. చుట్ట కాల్చబట్టే కదా దొరలింత గొప్పవాళ్లయినారు. చుట్టకాల్చని యింగ్లీషువాణ్ణి చూశావూ? చుట్టపంపిణీ మీదే స్టీముయంత్రం వగైరా తెల్లవాడు కనిపెట్టాడు...’ అంటూ ఏకబిగిన చుట్ట మహిమ గురించి సాకులు చెప్పుకొస్తాడు. వెంకటేశం తండ్రి అగ్నిహోత్రావధాన్లు వంటి అపరదుర్వాసుడిని సైతం ఇలాంటి సాకులతోనే బుట్టలో పడేసుకుంటాడు. వినేవాళ్లకు చీకాకులు వినేవాళ్లను వెర్రిమాలోకాలుగా ఎంచే ధీమంతులే అలవోకగా సాకులు చెప్పగలరు. మొదట్లో హోంవర్క్ ఎగ్గొట్టిన పిల్లలు టీచర్లకు సాకులు చెప్పడం మొదలుపెడతారు. మొదట్లో వాళ్లు కాస్త భయంభయంగా సాకులు చెబుతారు. రాత్రి జ్వరం వచ్చిందనో, కడుపు నొప్పిగా ఉందనో పిల్లలు అమాయకపు మొహాలతో చెప్పే సాకులు వినే టీచర్లు కాస్త మానవత్వంతో ఆలోచించి, పోన్లే పాపం అని క్షమించేస్తారు. ఒకటికి రెండుసార్లు ఇలా జరగొచ్చు. పదే పదే పిల్లలు చెప్పే సాకులు వింటుంటే ఎంతటి సహనవంతులైన టీచర్లకైనా కోపం వేసవితాపంలా పెరుగుతుంది. అలాంటప్పుడు వారు దండోపాయాన్నే తరుణోపాయంగా ఎంచుకుంటారు. మొండిఘటాలైన పిల్లలు టీచర్ల దండనను కూడా తప్పించుకునే తరుణోపాయాలను తక్షణమే ఆలోచించగలరు. మొదట్లో తేలికపాటి సాకులు చెప్పేవారు కాస్తా దెబ్బలు తప్పవనే పరిస్థితి ఎదురైనప్పుడు మరింత పెద్దపెద్ద సాకులు చెప్పి, ఆ ఆపదనూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. స్కూళ్లలో సాకులు చెప్పే పిల్లలు కాలేజీకి చేరేలోగానే చాలా ఢక్కామొక్కీలు తిని ఉంటారు. సాకులు చెప్పే విద్యలోనూ కొంచెం రాటుదేలి ఉంటారు. కాలేజీ నుంచి బయటపడి ఉద్యోగపర్వంలో కాలుపెట్టే నాటికి పూర్తిగా ఆరితేరిన సాకువీరులుగా తయారవుతారు. పని ఎగ్గొట్టడానికి ఆఫీసుల్లో బాసులకు సాకులు చెప్పడం ప్రారంభిస్తారు. ఈ పురోగతి అక్కడితోనే ఆగిపోదు. ఎదుటివాళ్ల బలహీనతలను పసిగట్టి, వాటికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సాకులు చెప్పడంలో నిరంతర సాధన కొనసాగుతూనే ఉంటుంది. పెళ్లిళ్లయి కుటుంబరావులుగా మారిన తర్వాత కూడా బలాదూర్ మందుపార్టీల్లో మునిగితేలి, ఆలస్యంగా కొంపలకు చేరినప్పుడు ఇల్లాళ్లకూ రకరకాల సాకులు చెబుతారు. సాకువీరుల్లోనూ కొందరు మరీ ముదుర్లుంటారు. అదృష్టం బాగుంటే ఇలాంటి వాళ్లు రాజకీయ పార్టీల్లో సలహాదారులుగా సెటిలైపోతారు. ఎవరు చెబుతారంటే..? జీవితాన్ని కులాసాగా ధిలాసాగా చీకూచింతా లేకుండా నిష్పూచీగా గడిపేయాలనుకునే నిక్షేపరాయుళ్లే ఎక్కువగా సాకులు చెబుతారట! కించిత్ కష్టమైనా వీరి ఒంటికి పడదు. ఇష్టంలేని పనులను తప్పించుకోవాలనుకునే వాళ్లు కూడా సాకులు చెబుతారట! అయిష్టమైన పనులు అనివార్యమైతే ఎటూ తప్పదు. ఈలోగా వాటిని సాధ్యమైనంత నివారించుకునేందుకు శాయశక్తులా చేసే ప్రయత్నంలో భాగంగానే చాలామంది సాకులు చెబుతారట! కొద్ది మంది అమాయకులను మినహాయిస్తే మనుషులందరిలోనూ కొద్దో గొప్పో సుఖాలకు దగ్గరగా, కష్టాలకు దూరంగా ఉండాలనే కోరిక ఉంటుంది. ఆ కోరిక ఏ మేరకు బలంగా ఉంటే, ఆ మేరకు సాకులు చెప్పడంలో ప్రావీణ్యం అబ్బుతుంది. ఇవన్నీ ఏ కాలజ్ఞానం చెప్పిన విశేషాలో కావు, ఆధునిక మానసిక శాస్త్రం చెబుతున్న కారణాలు. -
విజయశేఖరుడు
ఆశయం బలంగా ఉంటే సాధ్యంకానిది లేదు.. ఓటములు ఎన్ని ఎదురైనా పట్టువిడవని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తే విజయం మనదే.. ఇలాంటి వాటిని గట్టిగా నమ్మినట్లున్నాడు శేఖర్. ఒకప్పుడు ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం సంపాదించేందుకే ఇబ్బందులుపడిన ఆయన తర్వాత ఇతర దేశ జాతీయభాషను అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఎదిగారు. ఆ భాషలో పలు రచనలు చేపట్టి ప్రశంసలు అందుకున్నారు. - నంద్యాలటౌన్ శేఖర్‌ది జూపాడుబంగ్లా మండలం తూడిచర్ల గ్రామం. తండ్రి కుమ్మరి నారాయణ. రైతు కుటుంబంకావడంతో ఆర్థికంగా, కుటుంబపరంగా శేఖర్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చిన్నప్పటి ఆయనకు ఇంగ్లిష్ అంటే భయం. ఇంటర్లో కేవలం 38శాతం మార్కులతో పాసైన ఆయన తర్వాత మేనమామ సలహా మేరకు చెన్నైలోని మెరైన్ రేడియో ఆఫీసర్ కోర్సులో చేరారు. కోర్సు మొత్తం ఇంగ్లిష్‌లోనే. భాష సరిగా రాకపోవడంతో చదువు మధ్యలోనే బ్రేక్ పడింది. ఏడాది పాటు తన తండ్రికి పొలం పనుల్లో సేవలందించారు. తర్వాత మళ్లీ కర్నూలుకు వెళ్లి డిగ్రీ పూర్తి చేశారు. ఇంగ్లిష్‌పై పట్టుకు బెంగళూరుకు.. శేఖర్ ఏ ఇంటర్వ్యూకు వెళ్లినా ఇంగ్లిష్ మాట్లాడడం సరిగా రాకపోవడంతో అన్నీ ఫెయిల్యూర్ అయ్యేవి. ఎలాగైనా ఆ భాషలో పట్టు సాధించాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరుకు ప్రయాణమయ్యాడు. అక్కడ మొత్తం ఏడు స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్లకు వెళ్లారు. ఆంగ్లం అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఎదిగారు. తర్వాత చెన్నైలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో కొంత డిపాజిట్ చెల్లించారు. కాని కంపెనీ బోర్డు తిప్పేయడంతో మళ్లీ నిరుద్యోగిగా మారారు. చెన్నై నుంచి హోసూరు చేరి అక్కడ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగంలో చేరారు. అలా చేస్తూ ఉండగానే ఓ స్నేహితుడి ద్వారా స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్లో టీచింగ్ ఫ్యాకల్టీ జాబ్ వచ్చింది. అక్కడ ఉద్యోగం చేస్తుండగా శేఖర్ ప్రతిభను గుర్తించిన యాజమాన్యం అతనికి కోచింగ్ సెంటర్లో భాగస్వామ్యం ఇచ్చింది. కొన్ని రోజుల పాటు ఫ్యాకల్టీగా కొనసాగాక అక్కడ విద్యార్థులు లేకపోవడంతో బెంగుళూరులో సొంతంగా ఇన్సిట్యూట్ ప్రారంభించారు. ఇథియోపియాలో అవకాశం బెంగళూరులో స్పోకెన్ ఇంగ్లిష్ ఇన్సిట్యూట్ రన్ చేస్తున్న శేఖర్‌కు 2009లో జనవరిలో ఇథియోపియా దేశంలోని మీజోన్ తేపి విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ బోధించే అవకాశం వచ్చింది. అక్కడి వెళ్లాక ఇథియోపియా జాతీయభాష అమహారిక్ను ఆరు నెలల్లో నేర్చుకున్నారు. ఆ భాషపై పట్టు సాధించాక తొలిసారిగా 2012లో అమహారిక్-థిఎర్త్ ఆఫ్ ఇథోపియన్స్ అనే పుస్తకాన్ని రాశారు. తర్వాత ఆ భాషలలో మొత్తం 15 పుస్తకాలు రాశారు. ఇథియోపియన్స్ హిందీని నేర్చుకునేందుకు అమహారిక్ భాషలో ఒక పుస్తకాన్ని రచించినందుకు ఆ దేశ రాయబారి భగ్వీత్సింగ్ భిష్నోయి సన్మానించారు. {పస్తుతం నంద్యాలలోని ఎన్జీఓ కాలనీలో నివాసం ఏర్పరుచుకున్న శేఖర్.. బెంగుళూరులో స్పోకెన్ ఇంగ్లిష్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. త్వరలో కర్నూలు, నంద్యాలలో కూడా బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి విద్యార్థులకు, నిరుద్యోగులు ఇంగ్లిష్‌లో పట్టు సాధించేలా చేయాలనేది ఆయన తపన. -
కోపమే లోపమా?
‘‘నేను ఉద్యోగం మానేస్తాను’’. భార్య అన్న మాటకి ఆశ్చర్యపోయాడు శ్రీకాంత్. ‘‘అవునండీ. నేనిక ఆ ఆఫీసుకు వెళ్లను. వేరే ఎక్కడైనా చూసుకుంటాను’’... ఎటో చూస్తూ అంది ప్రవీణ. ‘‘మళ్లీ ఏమైంది?’’ అన్నాడు శ్రీకాంత్ ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తూ. ‘‘ఏం లేదు. అక్కడివాళ్లెవరూ నాకు నచ్చడం లేదు. నచ్చని వాళ్లమధ్య ఎలా పని చేస్తాను?’’ అంది నింపాదిగా. ఏం మాట్లాడలేదు శ్రీకాంత్. చిర్రెత్తుకొచ్చిందామెకి. ‘‘ఏంటి మాట్లాడరు? నాకేదైనా సమస్య వచ్చి చెబితే ఉలకరు పలకరు. మీకు చెప్పడం నాదే బుద్ధి తక్కువ’’... ప్రవీణ అరుపులకి టాప్ లేచిపోయింది. ల్యాప్‌టాప్ పక్కనపెట్టి ప్రవీణ వైపు చూశాడు శ్రీకాంత్. ఏడ్చేయడానికి సిద్ధంగా ఉంది ప్రవీణ. అప్పుడన్నాడు... ‘‘మనుషులు నచ్చలేదని నువ్వు ఆఫీసు మారడం ఇది మూడోసారి. ఎవరో నచ్చలేదని ఆఫీసు మారతానంటావు. అసలు ఎవరూ ఎందుకు నచ్చడం లేదో ఆలోచించావా?’’ భర్త అన్నమాటకు సెలైంట్ అయిపోయింది ప్రవీణ. నిజమే. తను ఎప్పుడూ ఆలోచించలేదు. తను చాలా కష్టపడి పని చేస్తుంది. మంచి వర్కర్ అనిపించుకుంది. యాజమాన్యం తరచు ప్రశంసిస్తుంటుంది. కానీ చుట్టూ ఉన్నవాళ్లు మాత్రం తనకు ఎప్పుడూ ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. అంతా బాగున్నా ఏదో లోపం ఉందని కామెంట్ చేస్తుంటారు. తనతో ఎవ్వరూ స్నేహంగా ఉండరు. అలా ఎందుకో అర్థం కాదామెకి. ఆ కారణంతోనే ఇప్పటికి రెండుసార్లు ఉద్యోగం మారింది. కానీ మూడోసారి కూడా అదే సమస్య. ఇలాంటి పరిస్థితి ఆఫీసుల్లో చాలామందికి ఎదురవుతూ ఉంటుంది. మనం ఇంత బాగా పనిచేస్తాం, మనల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అనిపిస్తూ ఉంటుంది. ప్రవీణ కూడా బాగా పనిచేస్తుంది కానీ బాగా మాట్లాడదు. ఎవరైనా ఇది ఇలా ఉంటే బాగుణ్ను అంటే కోపమొచ్చేస్తుంది ఆమెకి. నాకు తెలీదా అన్నట్టు మాట్లాడుతుంది. దాంతో మొదట్లో మామూలుగా చెప్పినవాళ్లు, తరువాత కావాలని వంకలు పెట్టి ఇరిటేట్ చేయడం మొదలుపెట్టారు. అది ఆమె అర్థం చేసుకోలేకపోతోంది. ఆ విషయం శ్రీకాంత్ కి తెలుసు. అందుకే ఆమెలో ఆలోచనను రేకెత్తించాడు. పదిమంది ఉండే చోట ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు. అందరికీ మనం, మన పని నచ్చాలని లేదు. కొందరు లోపాలు ఎత్తిచూపుతారు. మనం కరెక్ట్ అయితే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి. లేదంటే యాజమాన్యం అడిగితే నేను చెప్పుకుంటాలెండి అని సింపుల్‌గా చెప్పి తప్పించుకోవచ్చు. అప్పుడు వాళ్లే సెలైంట్ అయిపోతారు. అది మానేసి వాళ్లమీద విరుచుకు పడితే మన విలువ తగ్గుతుంది. వాళ్లకీ మనకీ మధ్య దూరం పెరుగుతుంది. పని చేసే చోటు నరకంలా కనిపిస్తుంది. ఒక్కసారి అందరూ నా వాళ్లే, అందరూ చెప్పేది నా మంచి గురించే అని అనుకుని చూడండి... ప్రశాంతంగా, హాయిగా ఉంటుంది! -
విశాఖ స్మృతుల్లో ‘మాస్టర్’సచిన్ ఇన్నింగ్స్
క్రీడావినీలాకాశంలో అసమాన కాంతితో ప్రకాశించే ఉజ్వల భానుడతడు.. భారత క్రికెట్లో అనితర సాధ్యుడు... క్రికెట్‌నే శ్వాసించే అభిమానులకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఆరాధ్యుడు.. విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాల్లో మహిమాన్వితుడు.. ఒక్కమాటలో చెప్పాలంటే భారత క్రికెట్లో ఆదర్శనీయుడు. రెండు దశాబ్దాలకు మించిన సుదీర్ఘ కాలంలో భారత క్రికెట్‌కు, ఆ మాటకొస్తే ప్రపంచ క్రికెట్‌కు కేంద్రమనదగ్గ ఖ్యాతిని సంపాదించిన వాడు.. అసాధారణ రికార్డులు సృష్టించి, మళ్లీ తానే వాటిని తిరగరాసి అభిమానులను అలరించిన ప్రతిభావంతుడు. ఇన్ని విశేషణాలకు ప్రతీకగా నిలిచే సత్తా ఉన్న వాడు.. మాస్టర్‌బ్లాస్టర్.. లిటిల్ మాస్టర్.. ఒకే ఒక్కడు! క్రికెట్ రారాజుగా వన్నె కెక్కిన ‘మాస్టర్’ థండర్ టెండూల్కర్ ఇక తనకు ఆరోప్రాణమైన ఆటకు వీడ్కోలు చెప్పే తరుణం ఆసన్నమైందని ప్రకటించాడు. తన 200వ టెస్ట్ తర్వాత ఇక సెలవని నిష్ర్కమించనున్నట్టు తెలిపాడు. అభిమానులకు అంతులేని నిరాశ కలిగిస్తున్నా.. ఇక తెరమరుగుకు తప్పుకోక తప్పదని ప్రకటించాడు. మాస్టర్ ప్రభంజనాన్ని మళ్లీ చూడలేమన్న బాధ సహజంగానే విశాఖ క్రీడాభిమానులను సైతం వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో విశాఖలో మాస్టర్ మెరుపులపై ‘సాక్షి’ విహంగ వీక్షణమిది. భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన తొలినాళ్ళలోనే సచిన్ టెండూల్కర్ విశాఖ వాసులతో బంధం పెనవేసుకున్నాడు. భారత్ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్ జట్టు మ్యాచ్‌లాడేందుకు వచ్చింది. సిరీస్ ప్రారంభానికి ముందు మూడు రోజుల మ్యాచ్ మున్సిపల్ స్టేడియం జరిగినప్పుడు సచిన్ దర్శనమిచ్చాడు. తొలిసారిగా 2001 ఏప్రిల్ 3న విశాఖ వేదికగా జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో తన సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ వన్డేమ్యాచ్లో విశాఖ క్రీడాభిమానులకు సచిన్ అర్ధసెంచరీతో అలరించాడు. విశాఖలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ 1988లో ప్రారంభం కాగా, మరో ఏడాదికే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆరంగేట్రం చేశాడు సచిన్. విశాఖలో క్రికెట్ మ్యాచ్‌లకు శ్రీకారం పడిన తొలినాళ్ళలోనే సచిన్ కెరీర్ తొలి అడుగులు పడుతున్న వేళ కావడం కాకతాళీయమే అయింది. విశాఖలో చివరిసారిగా ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ముంబయి ఇండియన్స్ తరఫున డెక్కన్చార్జర్స్తో ఆడేందుకు వ చ్చినా చేతికి గాయంతో ఆడలేక పోయాడు. వినమ్రతే విజయానికి కారణం సచిన్ వినమ్రత అతనిని క్రికెట్ ప్రపంచంలో దిగ్గజంగా నిలిపింది. 1997లో వెస్టీండీస్ పర్యటనకు మేనేజర్‌గా వ్యవహరించాను. మూడున్నర నెలల పాటు సచిన్‌తో గడిపాను. అప్పుడు ఎలాంటి ప్రవర్తన అతనిలో చూశానో, నేటికీ అదే ప్రవర్తన, అదే వినయం. -డి.వి.సుబ్బారావు, ఏసీఏ అధ్యక్షుడు. ఇన్స్పిరేషన్ సచినే ఔత్సాహిక క్రికెటర్లకు సచిన్ ఒక ఐకాన్. స్పూర్తిప్రదాత. చిన్నప్పటి నుంచి అయనంటే ఎంతో అభిమానం. బ్యాట్స్‌మెన్‌గా ఆయన్ని చూసి ఎంతో నేర్చుకున్నాను. - రికీబుయ్, ఔత్సాహిక అంతర్జాతీయ -19 క్రికెటర్. భారతరత్న ఇవ్వాలి సచిన్ ఒక్క క్రికెట్లోనే కాదు.. అతని అన్ని ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్‌లోనూ రోల్‌మోడల్. దేశానికి నిజాయితీగా సేవలందించాడు. అలాంటి వ్యక్తికి భారతరత్నతో గౌరవించాలి. ఔత్సాహిక క్రికెటర్లకు ఆయన చక్కటి సూచనలిస్తాడు. - ఎం.ఎస్.కె.ప్రసాద్, ఏసీఏ మహిళా క్రికెట్ అకాడమీ ప్రతినిధి. యంగ్‌స్టర్స్‌కు ప్రోత్సాహం సచిన్, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటన అనుకున్నదే. ఆయన చక్కటి క్రికెట్ ఆడాడు. అంతకు మించిన రికార్డుల్ని సొంతం చేసుకున్నా వినమ్రతతో మెలిగాడు. ఆయన రిటైర్మెంట్తో యంగ్‌స్టర్స్‌కు అవకాశం కల్పించాలనే ఉద్దేశం ఉంది. - చాముండేశ్వరీనాథ్, మాజీ కార్యదర్శి, ఏసీఏ.