హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి , యంగ్ హీరో నానీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. నానీకి ఓ మంచి సైకిల్ కొని పెట్టారు. అలా మాస్టర్ సినిమా సందర్భంగా కోల్పోయిన సైకిల్ ను సరికొత్తగా నానీ సొంతం చేసుకున్నారు. మరి ఈ సంతోషాన్ని నాని అభిమానులతో పంచుకోకుండా ఉంటాడా.. వెంటనే ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. చిరంజీవి గారు పంపిన సూపర్ కూల్ సైకిల్ అంటూ ఫోటోలను షేర్ చేశారు.
చిరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ పాపులర్ టెలివిజన్ షోకి ముఖ్య అతిధిగా విచ్చేసిన నాని తన చిన్న నాటి సంగతులను పంచుకున్నారు. తన చిన్నప్పుడు చిరంజీవి ‘మాస్టర్’ సినిమాకు సైకిల్ వేసుకెళ్తే దానిని ఎవరో దొంగిలించారని, అయితే చిరు సినిమాకు టికెట్ దొరికిన ఆనందంలో సైకిల్ పోయిందన్న బాధే తనకు కలగలేదని చెప్పారు. షోలో గెలుచుకున్న దానిలో కొంత సొమ్ముతో ఆ సైకిల్ కొనుక్కుంటానంటూ నానీ చెప్పుకొచ్చాడు. అయితే అందుకు చిరంజీవి నో చెప్పారు. ..తన సినిమాకు వచ్చినందుకు సైకిల్ పోయింది కాబట్టి, తానే కొత్త సైకిల్ కొనిపెడతానని హామీ ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని చిరు తొందరగానే దాన్ని నెరవేర్చారు.
And the boy got his cycle back :)
— Nani (@NameisNani) April 14, 2017
As promised on the show, Chiranjeevi Garu sent me this super cool cycle!#MegastarForAReason pic.twitter.com/zMrbDLMwGj