న్యూఢిల్లీ: మాస్టర్, వీసా డెబిట్ కార్డులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్)ను డిసెంబర్ 31 వరకూ రద్దు చేస్తున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది. రూపే డెబిట్ కార్డులపై ఎండీఆర్‌ను గతవారమే ఎత్తివేశారు.
పెన్షనర్లకు ఇబ్బంది కలిగించొద్దు
పెన్షనర్లు, భద్రతా దళాల సిబ్బందికి చెల్లింపుల కోసం తగినంత నగదు ఉండేలా చూసుకోవాలని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. భద్రతా దళాల సిబ్బంది కోసం మిలట్రీ అవుట్‌పోస్టుల వద్ద ఏర్పాట్లు చేయాలని కోరింది.
ఎయిర్‌పోర్ట్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం
రద్దైన పెద్ద నోట్లు అక్రమంగా తరలకుండా దేశ వ్యాప్తంగా అన్ని ఎరుుర్‌పోర్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్రం హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రైవేట్ చార్టెడ్ విమానంలో హరియాణా నుంచి నాగాలాండ్ లోని దిమాపూర్ ఎరుుర్‌పోర్టుకు భారీగా నగదు తరలిస్తుండగా పట్టుకున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యారుు. నగదు అక్రమ తరలింపుపై గట్టి నిఘా పెట్టాలని అన్ని ఎయిర్ పోర్టుల్ని హోం శాఖ కోరింది. దేశంలో దాదాపు 98 ఎరుుర్ పోర్టుల రక్షణ బాధ్యతలు చూస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఎస్‌ఐఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్‌ఫీఎప్)లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.
మాస్టర్, వీసా డెబిట్ కార్డులపై ఎండీఆర్ రద్దు
Published Fri, Nov 25 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
Advertisement