Visa debit cards
-
వీసా,మాస్టర్‌కార్డ్‌తో సమానంగా రూపే కార్డు: మోదీ సర్కార్ సరికొత్త ప్లాన్
న్యూఢిల్లీ: రూపే డెబిట్ కార్డులకు అంతర్జాతీయంగా ఆమోదయోగ్యతను మరింతగా పెంచడంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) దృష్టి పెడుతోంది. వీసా, మాస్టర్ కార్డ్‌లను ఉపయోగించే వారితో సమానంగా రూపే కార్డుదారులకు కూడా ప్రయోజనాలు ఉండేలా చూసేందుకు ఎన్పీసీఐ ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా మరిన్ని అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నట్లు వివరించాయి. (స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు) ప్రస్తుతం అమెరికాకు చెందిన డిస్కవర్, డైనర్స్ క్లబ్.. జపాన్‌కు చెందిన జేసీబీ, పల్స్.. చైనాకు చెందిన యూనియన్ పే సంస్థలకు సంబంధించిన పాయింట్స్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా రూపే కార్డులతో లావాదేవీలు నిర్వహించ డానికి వీలుంటోంది. రూపే జేసీబీ గ్లోబల్ కార్డును జేసీబీ కార్డు చెల్లుబాటయ్యే ఇతర దేశాల్లోని పీవోఎస్‌లు, ఏటీఎంలలోనూ ఉపయోగించవచ్చు. రూపే డెబిట్ కార్డులు, చిన్న మొత్తాల్లో లావాదేవీలకు ఉపయోగపడే ఏకీకృత చెల్లింపుల విధానం.. భీమ్-యూపీఐని ప్రోత్సహించేందుకు కేంద్రం రూ. 2,600 కోట్లతో ప్రత్యేక స్కీమును ఈ మధ్యే ఆమోదించింది. (కేంద్రం గుడ్ న్యూస్: మొబైల్ పోతే..మే 17 నుంచి కొత్త విధానం) -
రష్యాకు సర్ప్రైజ్ షాక్.. టెన్షన్లో పుతిన్..?
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 11వ రోజుకు చేరుకున్నాయి. దాడుల నేపథ్యంలో రష్యా బలగాలు అరాచకంగా వ్యవహరిస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని పలు పట్టణాలు, నగరాలపై పట్టును సాధించే ప్రయత్నం చేస్తున్న రష్యన్ బలగాలు ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రష్యన్ సైనికులు తమ దేశ ప్రజలపై రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఆరోపించారు. మరోవైపు దాడుల నేపథ్యంలో రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికన్ పేమెంట్ సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్.. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తున్నామని వీసా సీఈవో అల్ కెల్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో రష్యాలో వీసా కార్డు సేవలను పూర్తి స్థాయిలో నిలిపివేస్తామని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ పూర్తి స్థాయిలో సైబర్ వార్‌ను ముమ్మరం చేసింది. ఆ దేశానికి చెందిన వందలాది మంది హ్యాకర్లు డిజిటిల్ యుద్ధం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. యువకులు డిజిటల్ ఆర్మీగా ఏర్పాటై రష్యా దాడుల్ని నిలువరిస్తున్నారు. వీరంతా రష్యాకు చెందిన వెబ్సైట్లను బ్లాక్ చేయడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా అడ్డుకోవడమే కాకుండా రష్యా సైనికులు ఏయే ప్రాంతాల్లో ఉన్నారో గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. దీంతో రష్యా సైతం తమ హ్యాకర్లని రంగంలోకి దింపింది. రష్యా హాకర్లు ఇ–మెయిల్స్ ద్వారా మాల్వేర్లు పంపించి ఇంటర్నెట్ వ్యవస్థని స్తంభింపజేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య డిజిటల్ యుద్ధంతో యూరప్ దేశాలు కూడా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. -
ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే వడ్డీ కట్టక్కర్లేదు
ప్రముఖ ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ యూని కొత్త రకం సేవలను ప్రారంభించింది. కొత్తగా 'పే 1/3' పేలేటర్ కార్డును తీసుకొనివచ్చింది. ఈ కార్డు ద్వారా మీరు ఏమైనా కొనుగోలు చేస్తే ఆ మొత్తాన్ని మూడు భాగాలుగా ఆటోమేటిక్ గా విభజిస్తుంది. వినియోగదారులు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా మూడు నెలల వ్యవధిలో మూడు భాగాలను చెల్లించాల్సి ఉంటుంది. స్వల్పకాలంలో డబ్బులు కోసం ఎదురుచూసే వినియోగదారుల కోసం ఈ కార్డును తీసుకొచ్చినట్లు సంస్థ ప్రకటించింది. అలా కాకుండా 30 రోజులు తీసుకున్న మొత్తాన్ని చెల్లిస్తే కస్టమర్లకు క్యాష్ బ్యాక్ రూపంలో 1 శాతం రివార్డును అందిస్తున్నట్లు పేర్కొంది.(చదవండి: క్రిప్టోకరెన్సీలో భారత్ స్థానం ఎంతో తెలుసా...!) ఎలాంటి ఛార్జీలు లేవు 'పే 1/3' పేలేటర్ కార్డును తేదీ జూన్ 2021లో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చారు. తీసుకొచ్చిన రెండు నెలల కాలంలోనే ఇప్పటికే 10,000 మంది కస్టమర్లు ఈ కార్డును తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. వచ్చే ఏడాదిలోగా 1 మిలియన్ వినియోగదారులను చేరుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. పేలేటర్ కార్డును లాంఛ్ చేయడంపై యూని వ్యవస్థాపకుడు సీఈఓ నితిన్ గుప్తా మాట్లాడుతూ.. "వినియోగదారులను త్వరగా చేరుకోవడం కోసం చెల్లింపు వ్యవదిని మూడు నెలలకు పెంచడం ఉత్తమం అని భావించాము. ఈ కార్డు మా వినియోగదారుల జీవనశైలి ఎంపికగా మార్చాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో ఎలాంటి రహస్య ఛార్జీలు లేకుండా పారదర్శకంగా అందించాలనుకుంటున్నాము. కస్టమర్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవడంపై ఎక్కువగా దృష్టి సారించాలనుకుంటున్నాము" అని అన్నారు. ప్రస్తుతం, జాయినింగ్ ఫీజు లేదా వార్షిక ఛార్జీలు లేవు. పే 1/3ర్డ్ యాప్ ద్వారా రియల్ టైమ్ లో వారి ఖర్చులను ట్రాక్ చేయవచ్చు, కేటగిరీల వారీగా చేసిన ఖర్చులను తెలుసుకోవచ్చు. అలాగే తిరిగి చెల్లించే సమయానికి ముందే అలర్ట్ లు వస్తాయి. ఈ కార్డును ‘వీసా కార్డు’ మద్దతుతో తీసుకొస్తున్నారు. దీంతో ఈ కార్డును వీసా కార్డులకు అనుమతి ఉండే ప్రతిచోటా వినియోగించుకోవచ్చు. ఫుడ్, గ్రోసరీస్, ఈ-కామర్స్ సహా పీఓఎస్ అందుబాటులో ఉన్న ప్రతిచోటా దీన్ని వినియోగించవచ్చు. అలాగే కస్టమర్లు 6, 9, 12 నుండి 18+ నెలల వరకు ఈఎమ్ఐ ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు. -
మాస్టర్, వీసా డెబిట్ కార్డులపై ఎండీఆర్ రద్దు
న్యూఢిల్లీ: మాస్టర్, వీసా డెబిట్ కార్డులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్)ను డిసెంబర్ 31 వరకూ రద్దు చేస్తున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. రూపే డెబిట్ కార్డులపై ఎండీఆర్‌ను గతవారమే ఎత్తివేశారు. పెన్షనర్లకు ఇబ్బంది కలిగించొద్దు పెన్షనర్లు, భద్రతా దళాల సిబ్బందికి చెల్లింపుల కోసం తగినంత నగదు ఉండేలా చూసుకోవాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. భద్రతా దళాల సిబ్బంది కోసం మిలట్రీ అవుట్‌పోస్టుల వద్ద ఏర్పాట్లు చేయాలని కోరింది. ఎయిర్‌పోర్ట్‌ల వద్ద భద్రత కట్టుదిట్టం రద్దైన పెద్ద నోట్లు అక్రమంగా తరలకుండా దేశ వ్యాప్తంగా అన్ని ఎరుుర్‌పోర్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని కేంద్రం హోం శాఖ ఆదేశాలు జారీచేసింది. ప్రైవేట్ చార్టెడ్ విమానంలో హరియాణా నుంచి నాగాలాండ్ లోని దిమాపూర్ ఎరుుర్‌పోర్టుకు భారీగా నగదు తరలిస్తుండగా పట్టుకున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యారుు. నగదు అక్రమ తరలింపుపై గట్టి నిఘా పెట్టాలని అన్ని ఎయిర్ పోర్టుల్ని హోం శాఖ కోరింది. దేశంలో దాదాపు 98 ఎరుుర్ పోర్టుల రక్షణ బాధ్యతలు చూస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఎస్ఐఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్ఫీఎప్)లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.