ఫొటోలో కనిపిస్తున్న ఈ బాలుడు ఐదేళ్ల వయసులోనే యోగా గురువు స్థాయికి చేరుకున్నాడు. రాజస్థాన్‌కు చెందిన ప్రత్యక్ష్ విజయ్ అతి పిన్న వయసు యోగా గురువుగా, ప్రతిష్ఠాత్మక గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నాడు. నాలుగేళ్ల వయసు నుంచే ప్రత్యక్ష్ , తన తల్లిదండ్రులతో కలసి యోగా సాధన చేయటం మొదలు పెట్టాడు.
రెండువందల గంటల యోగా టీచర్స్ ట్రైనింగ్ కోర్సును పూర్తి చేసిన ఈ బాలుడు, గత ఏడాది జులై 27న ఆనంద్ శేఖర్ యోగా పాఠశాల నుంచి యోగా గురువు ధ్రువపత్రాన్ని అందుకున్నాడు. కోర్సు సమయంలో ప్రత్యేక యోగాకు సంబంధించి అనేక మెలకువలను నేర్చుకున్నాడు. యోగాలోని ‘అలైన్‌మెంట్, అనాటమిక్ ఫిలాసఫీ’ వంటి క్లిష్టమైన అంశాలను నేర్చుకున్నాడు.
ప్రత్యక్ష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగా అనేది శారీరక భంగిమలు, శ్వాస గురించి మాత్రమే కాదు, మానసిక, శారీరక ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా అని గ్రహించా’ అని తెలిపాడు. ప్రస్తుతం అతడు పెద్దలతోపాటు పిల్లలకు కూడా యోగా నేర్పిస్తున్నాడు. ఆన్‌లైన్‌లో వర్చువల్ రియాలిటీ క్లాసులు కూడా తీసుకుంటున్నాడు. వీటితోపాటు కొన్ని పాఠశాలల్లోనూ విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తున్నాడు.
(చదవండి: కిడ్స్ మేకప్ కోసం ఈ బ్యూటీ కిట్..!)
Comments
Please login to add a commentAdd a comment