Haryana: TV Channel Editor Arrested For False, Misleading Post On Nuh Violence - Sakshi
Sakshi News home page

నూహ్ అల్లర్లు: ప్రముఖ టీవీ ఛానల్‌ ఎడిటర్ అరెస్టు..

Published Sat, Aug 12 2023 12:42 PM | Last Updated on Sat, Aug 12 2023 1:35 PM

Nuh Violence TV Channel Editor Arrested For False Post  - Sakshi

చంఢీగర్‌: నూహ్ అల్లర్లలో అసత్యాలను ప్రచారం చేశారనే ఆరోపణలపై హిందీ ఛానల్‌ సుదర్శన్‌ టీవీ ఎడిటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లను మరింత పెంచేంతగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు ఆరోపించారు. 

సుదర్శన్ టీవీ ఛానల్ ఎడిటర్ ముఖేష్ కుమార్‌ను గురుగ్రామ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. కొంతమంది గుండాలు అతన్ని అరెస్టు చేసినట్లు సుదర్శన్ ఛానల్‌ పేర్కొంది. దీనిపై వివరణ ఇచ్చిన పోలీసులు.. సైబర్ క్రై విభాగం అరెస్టు చేసినట్లు చెప్పారు. 

ఆల్ జజిరా ఛానల్ ఒత్తిడి మేరకు గురుగ్రామ్ పోలీసులు.. హిందు కార్యకర్తల మీద చర్యలు తీసుకుంటున్నారని ట్వీట్టర్‌లో ముఖేష్ కుమార్ పోస్టు చేశారు. గురుగ్రామ్ పోలీసులకు విదేశీ మీడియా కాల్‌ చేసిందని ఈ మేరకు హిందువులపై చర్యలు తీసుకుంటున్నారని ఎడిటర్ ఆరోపణలు చేస్తూ పోస్టులు చేశారు. 

దీనిపై స్పందించిన పోలీసులు..కుమార్ పోస్టులు నిరాధారమైనవని కొట్టిపడేశారు. తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని అన్నారు. ఐటీ చట్టం కింద అతనిపై చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. అయితే.. విధుల్లో భాగంగా కుమార్ మేవాత్ ప్రాంతానికి వెళ్లినట్లు సుదర్శన్ టీవీ తెలిపింది. కొందరు దుండగులు ఆయన్ను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. పోలీసుల చర్యలను తప్పుబడుతూ సుదర్శన్ టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ సురేష్ వాంఖడే ట్వీట్ చేశారు. అయితే.. కొన్ని గంటల తర్వాత ముఖేష్ కుమార్‌ను విడుదల చేసినట్లు సమాచారం. 

హర్యానాలోని నూహ్‌లో జులై 31న అల్లర్లు చెలరేగాయి.విశ్వహిందూ పరిషత్ రథయాత్ర సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమై.. రాష్ట్రం మొత్తం వ్యాపించాయి. ఈ ఆందోళనల్లో ఆరుగురు మరణించారు.

ఇదీ చదవండి: తప్పుడు వాగ్దానంతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement