Editor arrested
-
నూహ్ అల్లర్లు: ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్ అరెస్టు..
చంఢీగర్: నూహ్ అల్లర్లలో అసత్యాలను ప్రచారం చేశారనే ఆరోపణలపై హిందీ ఛానల్ సుదర్శన్ టీవీ ఎడిటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లను మరింత పెంచేంతగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పోలీసులు ఆరోపించారు. సుదర్శన్ టీవీ ఛానల్ ఎడిటర్ ముఖేష్ కుమార్‌ను గురుగ్రామ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. కొంతమంది గుండాలు అతన్ని అరెస్టు చేసినట్లు సుదర్శన్ ఛానల్ పేర్కొంది. దీనిపై వివరణ ఇచ్చిన పోలీసులు.. సైబర్ క్రై విభాగం అరెస్టు చేసినట్లు చెప్పారు. गुड़गांव की पुलिस कमिश्नर को @AJENews (अल जजीरा न्यूज चैनल) से फ़ोन किया जा रहा है हिंदुओं के खिलाफ कार्रवाई के लिए दबाव बनाया जा रहा है। और @DC_Gurugram फोन आने के बाद इतने दबाव में आ जाती हैं कि कहीं से भी हिंदूवादी कार्यकर्ताओं को उठा ले रही है@cmohry कृपया संज्ञान लें pic.twitter.com/bIjVYfR0Di — Mukesh Kumar (@mukeshkrd) August 8, 2023 ఆల్ జజిరా ఛానల్ ఒత్తిడి మేరకు గురుగ్రామ్ పోలీసులు.. హిందు కార్యకర్తల మీద చర్యలు తీసుకుంటున్నారని ట్వీట్టర్లో ముఖేష్ కుమార్ పోస్టు చేశారు. గురుగ్రామ్ పోలీసులకు విదేశీ మీడియా కాల్ చేసిందని ఈ మేరకు హిందువులపై చర్యలు తీసుకుంటున్నారని ఎడిటర్ ఆరోపణలు చేస్తూ పోస్టులు చేశారు. pic.twitter.com/FbtdApa5zq — Gurugram Police (@gurgaonpolice) August 11, 2023 దీనిపై స్పందించిన పోలీసులు..కుమార్ పోస్టులు నిరాధారమైనవని కొట్టిపడేశారు. తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని అన్నారు. ఐటీ చట్టం కింద అతనిపై చర్యలకు ఉపక్రమించినట్లు చెప్పారు. అయితే.. విధుల్లో భాగంగా కుమార్ మేవాత్ ప్రాంతానికి వెళ్లినట్లు సుదర్శన్ టీవీ తెలిపింది. కొందరు దుండగులు ఆయన్ను అరెస్టు చేసినట్లు వెల్లడించింది. పోలీసుల చర్యలను తప్పుబడుతూ సుదర్శన్ టీవీ ఛానల్ చీఫ్ ఎడిటర్ సురేష్ వాంఖడే ట్వీట్ చేశారు. అయితే.. కొన్ని గంటల తర్వాత ముఖేష్ కుమార్‌ను విడుదల చేసినట్లు సమాచారం. मुकेश कुमार को छोड़ा नहीं गया तो कल बड़ी घोषणा करेंगे। देखते है कौन- कौन मर्द हिंदू साथ है। नपुंसक तो जान कर भी मौन हैं। किसी अधिकारी की इतनी हिंम्मत और सभी असहाय…? हम तो असहाय नहीं है… #ReleaseMukeshKunar — Suresh Chavhanke “Sudarshan News” (@SureshChavhanke) August 11, 2023 హర్యానాలోని నూహ్‌లో జులై 31న అల్లర్లు చెలరేగాయి.విశ్వహిందూ పరిషత్ రథయాత్ర సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమై.. రాష్ట్రం మొత్తం వ్యాపించాయి. ఈ ఆందోళనల్లో ఆరుగురు మరణించారు. ఇదీ చదవండి: తప్పుడు వాగ్దానంతో పెళ్లి చేసుకుంటే.. ఇకపై పదేళ్ల జైలు.. -
జైహింద్ స్పెషల్: ఎడిటర్‌కి ఎనిమిదేళ్ల జైలు!.. రెండేళ్లకే పేపర్ మూత!!
‘జాతీయవాదం అనే మహా సౌధ నిర్మాణంలో భారతీయ పత్రికారంగం ప్రధానమైన, ప్రతిష్టాత్మకమైన పాత్రను నిర్వహించింది’ అన్నారు, స్వాతంత్య్రోద్యమ కాలం నాటి న్యాయ నిపుణుడు తేజ్ బహదుర్ సప్రూ. కాలానికి ఆధునికతనీ, చైతన్యాన్నీ అద్దిన చరిత్ర పత్రికలకు ఉంది. ప్రలకు కొత్త దృష్టిని ప్రసాదించడం, కదిలించడం వాటి సహజ లక్షణం. ఉద్యమాల చరిత్రలో కనిపించే ప్రజాసమూహాల అడుగులన్నీ పత్రికారంగం చూపిన దారి వెంట పడినవే. భారత స్వరాజ్య సమరంలోను ఆ జాడలు కనిపిస్తాయి. చదవండి: జైహింద్ స్పెషల్: జాతీయ గీతానికి ‘మదన’పల్లె రాగం జాతీయభావమే భారతీయులందరిని స్వాతంత్య్రం అనే లక్ష్యం వైపు నడిపించింది. మాతృభూమిని విదేశీ పాలన నుంచి తప్పించడానికి స్వాతంత్య్రోద్యమం అనివార్యమన్న తాత్త్వికతనీ, ఏకాత్మతనూ తీసుకువచ్చినవి వార్తాపత్రికలు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లేని జాతి ప్రతిభ, సృజన, ఘనతరగతాలకు రాణింపు ఉండదని, ప్రపంచపటంలో స్థానం ఉండదని హెచ్చరించినవీ పత్రికలే. స్వయం పాలనే ఆధునిక ప్రాపంచిక చింతన అని తెలియచెప్పినవీ అవే. ప్రజాళిని బానిసత్వం నుంచి బానిసత్వానికి కాకుండా, భవిష్యత్తులోకి పత్రికలు నడిపించాయి. ఎన్నో నిర్బంధాల మధ్య ఇలాంటి ఒక చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించినందుకే స్వాతంత్య్రోద్యమ చరిత్రలో పత్రికలకు కూడా ప్రముఖ స్థానం ఇస్తారు. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, జాతీయ కాంగ్రెస్ స్థాపన ఘట్టాలతో రాజకీయ ఐక్యతను సూచించే వాతావరణం దేశంలో ఏర్పడింది. ఆ భూమికతోనే పత్రికలు పుట్టుకు వచ్చాయి. బెంగాల్ విభజన నుంచి జనించిన జాతీయభావం వాటికి పదును పెట్టింది. తొమ్మిది దశాబ్దాల అణచివేత బ్రిటిష్ ఇండియాలో వార్తాపత్రికల ఉనికి, లేదా భారత స్వాతంత్య్ర సమరంలో వార్తాపత్రికల పాత్ర ఏ విధంగా పిలుచుకున్నా, అది తొమ్మిది దశాబ్దాల అణచివేత చరిత్ర. 1858–1947 మధ్య ఊపిరాడని తీరులోనే వాటి మనుగడ సాగింది. వలసదేశంలో వార్తాపత్రిక అంటే, ఉద్యమాలకు ఊపిరినిస్తూనే, తన ఊపిరి నిలిచిపోకుండా చూసుకుంటుంది. పత్రిక బ్రిటిష్ జాతీయుడిదైనా, భారతీయుడిదైనా ప్రభుత్వాలను వ్యతిరేకిస్తే బతికి బట్టకట్టలేదు. భారతదేశంలో పుట్టిన తొలిపత్రిక జనన మరణాలు ఇదే చెబుతున్నాయి. ఇంతకీ ఇదంతా అంతకు ముందు ఏడున్నర దశాబ్దాల పత్రికా రంగ అణచివేతకు కొనసాగింపే. 1780 జనవరి 29 న జేమ్స్ అగస్టస్ హికీ ‘బెంగాల్ గెజెట్’ అనే రెండు పేజీల వారపత్రికను ప్రారంభించాడు. ‘కలకత్తా జనరల్ అడ్వైజర్’ అని కూడా ఆ పత్రికకు పేరు. ఆంగ్లేయుడు భారతదేశంలో ఆరంభించిన ఈ తొలి పత్రిక, తొలి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్, ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంపే మీద ద్వేష పూరిత విమర్శలు కురిపించింది. ప్రధాన న్యాయమూర్తి మీద విమర్శలు సహించబోమని ఈస్టిండియా కంపెనీ బెదిరిస్తే, ఏకంగా ఆయన భార్య మీదే రాశాడు హికీ. ఎనిమిదేళ్లు కారాగారం, రూ. 2000 జరిమానా విధించారు. 1782లో పత్రిక మూతపడింది. హికీ నుంచి రాజా రామమోహనరాయ్ కాలం (1826) వరకు భారతీయ పత్రికారంగానిది నిజానికి సంఘర్షణ ధోరణి కాదు. అయినా నిర్బంధమే ప్రాప్తమైంది. పత్రికలకు కొంచెం స్వేచ్ఛ కావాలని రామమోహన్‌రాయ్ సుప్రీంకోర్టుకు వినతిపత్రం ఇచ్చారు. మనవాళ్లు దిగారు 1851 నుంచి 1900 వరకు సాగిన యుగంలో పత్రికల కదలిక కొంచెం సుస్పష్టంగా ఉంది. జాతీయభావాల వ్యాప్తికి ఒక భూమిక సిద్ధమవుతున్న జాడలు కనిపిస్తాయి. ప్రజలకు, ప్రభుత్వానికి వార్తాపత్రికలు వారథిగా వ్యవహరిం చాయి. భారతదేశ స్థితిగతులు, పాలకుల ధోరణి ప్రజలకు అర్థం కావడానికి ఈ యుగంలోని పత్రికలే దోహదం చేశాయి. ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ (రాబర్ట్ నైట్), ‘ది స్టేట్స్‌మన్’ (రాబర్ట్ నైట్), ‘ది ట్రిబ్యూన్’ (సర్దార్ దయాళ్‌సింగ్ మజీథియా) ‘బాంబే క్రానికల్’ (ఫిరోజ్‌షా మెహతా), ‘వాయిస్ ఆఫ్ ఇండియా’ (దాదాభాయ్ నౌరోజీ), ‘సుధాకర’ (గోపాలకృష్ణ గోఖలే), ‘కేసరి’, ‘మరాట్టా’ (బాలగంగాధర తిలక్), ‘ది హిందు’, ‘స్వదేశమిత్రన్’ (జి.సుబ్రహ్మణ్య అయ్యర్), ‘బెంగాలీ’ (సురేంద్రనాథ్ బెనర్జీ), ‘వందేమాతరం’ (సుబోధ్‌చంద్ర మాలిక్, చిత్తరంజన్ దాస్, బిపిన్ చంద్రపాల్), ‘అమృత్ బజార్ పత్రిక’ (శిశిర్‌కుమార్ ఘోష్), ‘హరిజన్’, ‘యంగ్ ఇండియా’ (గాంధీ) వంటి పత్రికల్ని ఈ సమయంలోనే నెలకొల్పారు. అరవిందుడు, మదన్ మోహన్ మాలవీయ, మోతీలాల్ నెహ్రూ, అబుల్ కలాం ఆజాద్, సుబ్రహ్మణ్య భారతి, సీవై చింతామణి, కోటంరాజు పున్నయ్య, కోటంరాజు రామారావు, ఎం.చలపతిరావు, కుందూరి ఈశ్వరదత్ వంటివారు కూడా అటు స్వరాజ్య సమరయోధులుగా, ఇటు పత్రికా రచయితలుగా ద్విపాత్రాభినయం చేసినవారే. అంటే, స్వాతంత్య్రోద్యమ రథసారథులంతా దాదాపు పత్రికా రచయితలే. లేదా పత్రికాధిపతులు. – డా.గోపరాజు నారాయణరావు ఎడిటర్, ‘జాగృతి’ -
అథ్లెట్ ద్యుతి చంద్ ఫిర్యాదు.. ‘ఫోకస్ ప్లస్’ ఎడిటర్ అరెస్టు
భువనేశ్వర్: ఫోకస్ ప్లస్ వెబ్ చానల్ ఎడిటర్ సుధాంశుశేఖర్ రౌత్ అరెస్ట్ అయ్యారు. ప్రముఖ స్ప్రింటరు ద్యుతి చంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. సదరు మీడియా ప్రతినిధి తనకు వ్యతిరేకంగా అవమానకరమైన ప్రసారాలు చేసి, మానసిక వేదనకు గురిచేసినట్లు నగరంలోని మహిళా పోలీస్టేషన్లో ద్యుతి చంద్ ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పరువునష్టం దావా దాఖలు చేయగా, విచారణలో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివాదాస్పద చానల్ కార్యాలయం నుంచి కంప్యూటర్ ఇతర సామాగ్రిని జప్తు చేశారు. చదవండి: Tokyo Paralympics: చెలరేగుతున్న భారత షట్లర్లు.. వరుసగా రెండో స్వర్ణం సొంతం టోక్యో ఒలింపిక్స్‌లో ఆడుతుండగా, ద్యుతి చంద్ కుటుంబ వ్యవహారాలపై అసభ్యకర ప్రసారాలు చేస్తానని, ఎడిటర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పాలని, లేకపోతే వీటిని ప్రసారం చేస్తానని పదేపదే బెదిరించడంతో మానసిక స్థైర్యం కోల్పోయి ఒలింపిక్స్‌లో తాను ఓడిపోయానని ద్యుతి చాంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ చర్యలకు వ్యతిరేకంగా దాదాపు రూ.5 కోట్ల వరకు పరువు నష్టం దావా దాఖలు చేసినట్లు సమాచారం. బెయిలు నిరాకరణ.. స్ప్రింటరు ద్యుతి చంద్‌ని బెదిరించిన కేసులో అరెస్టయిన ఎడిటర్ సుధాంశు శేఖర్ రౌత్‌కి స్థానిక సబ్–డివిజినల్ జ్యుడీషియల్ మెజి్రస్టేట్ (ఎస్డీజేఎమ్) కోర్టు బెయిలు నిరాకరించింది. ప్రస్తుతం సుధాంశుతో పాటు ఆయన అనుచరుడు స్మృతి రంజన్ బెహరాకి కూడా న్యాయ స్థానం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. సుధాంశు విచారణకు 7 రోజుల రిమాండ్‌కు పోలీస్ వర్గాలు అభ్యర్థించగా, కోర్టు ఒక్కరోజు రిమాండ్‌కు మాత్రమే అనుమతించడం విశేషం. చదవండి: Jeanette Zacarias Zapata: బాక్సింగ్ రింగ్‌లో విషాదం.. 18 ఏళ్ల టీనేజ్ బాక్సర్ మృతి -
హాంకాంగ్‌లో మీడియాపై... జాతీయ భద్రతా చట్టం ప్రయోగం
హాంకాంగ్: చైనా పాలకుల కర్కశత్వానికి మరో తార్కాణం. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య గళాలను అణచివేయడమే లక్ష్యంగా తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టాన్ని తొలిసారిగా మీడియాపై ప్రయోగించారు. యాపిల్ డైలీ అనే పత్రికకు చెందిన ఐదుగురు ఎడిటర్లు, కార్యనిర్వాహకులను పోలీసులు ఈ చట్టం కింద గురువారం అరెస్టు చేశారు. ఈ పత్రికలో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమ వార్తలను ప్రచురిస్తుంటారు. హాంకాంగ్‌కు చైనా చెర నుంచి విముక్తి లభించాలని, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కావాలని యాపిల్ డైలీ గట్టిగా నినదిస్తోంది. చైనా, హాంకాంగ్‌పై ఇతర దేశాలు ఆంక్షలు విధించేలా కుట్ర పన్నడమే ధ్యేయంగా 30కిపైగా ఆర్టికల్స్‌ను ఈ పత్రిక ప్రచురించినట్లు ఆధారాలున్నాయని పోలీసులు వెల్లడించారు. -
లైంగిక వేధింపుల కేసులో కెప్టెన్ టి.వి ఎడిటర్ అరెస్ట్
మహిళ జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై తెహల్కా ఎడిటర్ అరుణ్ తేజ్‌పాల్ అరెస్ట్ ఘటన స్మృతి పథంలో నుంచి చెరిగి పోక ముందే మరో ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. చెన్నైకు చెందిన కెప్టెన్ టీవీ ఎడిటర్ దినేష్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆ సంస్థలో విధులు నిర్వర్తించిన మాజీ మహిళ జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ టీవీ ఎడిటర్ దినేష్ ను ఆదివారం చెన్నైలో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మాజీ ఉద్యోగి అయిన మహిళ జర్నలిస్ట్ ఆరోపణలను కెప్టెన్ టీవీ సంస్థ తీవ్రంగా ఖండించింది. ఆ మహిళ ఆరోపణ సత్య దూరమైనవని పేర్కొంది. కెప్టెన్ టీవి ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్‌కు సారథ్యంలో నడుస్తోంది. ఆయన స్థాపించిన డీఎండీకే పార్టీ అధికార చానల్‌గా కెప్టెన్ టీవీ పని చేస్తోంది.