అన్నాడీఎంకేకు సొంత చానల్, పత్రిక! | AIADMK TO LAUNCH ‘AMMA’ CHANNEL | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకేకు సొంత చానల్, పత్రిక!

Published Thu, Jan 4 2018 5:11 AM | Last Updated on Thu, Jan 4 2018 5:11 AM

AIADMK TO LAUNCH ‘AMMA’ CHANNEL - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ సొంత టీవీ చానల్, దిన పత్రికను ప్రారంభించాలని భావిస్తోంది. ప్రతిపక్ష డీఎంకేతో పాటు ఇటీవలే ఆర్కేనగర్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన టీటీవీ దినకరన్‌కూ సొంత ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తమ పార్టీకి కూడా సొంత మీడియా ఉండాలని అన్నాడీఎంకే వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం సొంత మీడియా ఏర్పాటుపై ఎమ్మెల్యేలతో చర్చించారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి తొలిసారిగా హాజరుకానున్న దినకరన్‌ను చూసి నవ్వడం, మాట్లాడటం చేయరాదని ఎమ్మెల్యేలను ఎడపాడి, పన్నీర్‌ ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement