సంజీవరెడ్డినగర్,న్యూస్‌లైన్: టీవీ చానల్ మార్పు విషయంలో అక్కాచెల్లల మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన చెల్లి చివరకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన సంజీవరెడ్డినగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ సుదర్శన్‌రెడ్డి వివరాల ప్రకారం..బోరబండ రాజీవ్‌నగర్‌కు చెందిన వైద్యుడు ఉస్మాన్ కూతురు ఫాతిమా(13) స్థానిక పాఠశాలలో 8వతరగతి చదువుతుంది.
ఫాతిమా టీవీ చూస్తుండగా అక్క వచ్చి మరోచాన ల్ మార్చింది. ఎందుకు చానల్ మార్చావంటూ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఫాతిమా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. మధ్యాహ్నం నమాజ్ చేసుకున్న అనంతరం 2గంటల సమయంలో గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
గదిలోకి వెళ్లిన ఫాతిమా ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. కొనఊపిరితో ఆమెను చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించగా కాసేపటికే మృతిచెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా చానల్ మార్పు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
టీవీ చానల్ మార్పు విషయంలో అక్కాచెల్లెళ్ల వాగ్వాదం చెల్లి ఆత్మహత్య
Published Mon, Jun 2 2014 3:02 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement