Usman
-
భీకర ఎన్కౌంటర్.. మధ్యలో బిస్కెట్!
శ్రీనగర్: సుధీర్ఘ చర్చలు, మంతనాల వేళ మధ్యమధ్యలో ఛాయ్‌తోపాటు బిస్కెట్లు తినడం పరిపాటి. మిత్రదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చల వేళ పనికొచ్చే బిస్కెట్లు శత్రువుతో పోరాడేవేళ అక్కరకు రావడం విశేషం. పాకిస్తాన్ విద్వేషాగి్నని ఎగదోస్తుంటే దానిని కశ్మీర్లో విస్తరింపజేస్తున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు బలగాలు బిస్కెట్లను వాడుకుని విజయం సాధించారు. శనివారం జరిగిన లష్కరే కమాండర్ ఉస్మాన్ ఎన్కౌంటర్ వివరాలను సీఆర్పీఎఫ్ బలగాలు ఆదివారం వెల్లడించాయి. మొరిగితే అసలుకే మోసం కశ్మీర్లో కీలకమైన ఉగ్రకమాండర్ ఉస్మాన్ శ్రీనగర్ శివారులోని ఖన్యాయ్ ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. 2000 నుంచి లోయలో మెరుపుదాడులు చేయడంలో ఉస్మాన్ సిద్ధహస్తుడు. గత ఏడాది పోలీస్ ఇన్స్పెక్టర్ మస్రూర్ వనీని చంపేసిన ఘటనలో ఇతని ప్రమేయముంది. ఇంతటి కరడుగట్టిన ఉగ్రవాది జాడ తెలియడంతో సీఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు పక్కా ప్రణాళిక రచించారు. అయితే ఖన్యాయ్లో శునకాల బెడద ఎక్కువ. కొత్త వ్యక్తులు కనిపిస్తే వెంటనే మొరుగుతాయి. ఈ శబ్దాలకు ఉస్మాన్ అప్రమత్తమవడం ఖాయం. దీనికి పరిష్కారంగా బలగాలు తమ వెంట బిస్కెట్లు తీసుకెళ్లాయి. అంతా జల్లెడ పడుతూ కుక్కలు అరవకుండా బిస్కెట్లు వెదజల్లుతూ వాటి నోరు మూయించారు. దీంతో వీరి పని సులువైంది.ఏకే47తో సిద్ధం ఉస్మాన్ ఎల్లప్పుడూ అత్యాధునిక ఏకే47 గన్‌తో అప్రమత్తంగా ఉంటాడు. గ్రనేడ్లు, పిస్టల్ ధరిస్తాడు. వేగంగా దాడిచేస్తాడు. దీంతో తమ రాక విషయం తెలీకుండా జాగ్రత్తపడుతూ బలగాలు అతడిని సమీపించాయి. చివరి నిమిషంలో ఉస్మాన్ దీనిని కనిపెట్టి బలగాలపైకి ఎదురుకాల్పులు జరిపాడు. గ్రనేడ్లు విసిరాడు. ఈ క్రమంలో నలుగురు జవాన్లు గాయపడినా ఎట్టకేలకు ఉస్మాన్‌ను సైన్యం హతమార్చింది. గత రెండేళ్లలో కశీ్మర్ లోయలో సైన్యం సాధించిన అతిపెద్ద విజయంగా ఈ ఘటనను చెబుతారు. లష్కరే తోయిబా విభాగమైన రెసిస్టెంట్ ఫ్రంట్‌కు ఈ ఎన్కౌంటర్ కోలుకోలేని దెబ్బ. స్థానికేతర కారి్మకులు, భద్రతా బలగాలపైకి ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ సభ్యులు తరచూ కాల్పులకు తెగబడటం తెల్సిందే. వీరికి సూచనలు చేసే ఉస్మాన్‌ను సైన్యం ఎట్టకేలకు తుదముట్టించి ఉగ్రవ్యతిరేక కార్యక్రమాల్లో ఘన విజయం సాధించింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన పాక్ క్రికెటర్.. నాలుగేళ్లకే కెరీర్ ఖతం
పాకిస్తాన్ క్రికెటర్ ఉస్మాన్ కాదిర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై తాను అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించబోవడం లేదని తెలిపాడు. దేశం తరఫున ఆడే గొప్ప అవకాశం తనకు దక్కిందని.. తన ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. ఒడిదుడుకుల్లో తనకు మద్దతుగా నిలిచిన అభిమానుల రుణం తీర్చుకోలేనని ఉద్వేగానికి లోనయ్యాడు.పాకిస్తాన్ మేటి స్పిన్నర్లలో ఒకడైన అబ్దుల్ కాదిర్ కుమారుడే ఉస్మాన్ కాదిర్. ఈ లెగ్ స్పిన్నర్ 2020లో జింబాబ్వేతో టీ20 సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. గతేడాది అక్టోబరులో ఆసియా క్రీడల్లో భాగంగా బంగ్లాదేశ్‌తో టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఆఖరిసారిగా ఆడాడు.ఇప్పటి వరకు కేవలం ఒక వన్డే ఆడిన ఉస్మాన్ కాదిర్ ఖాతాలో ఒక వికెట్ ఉంది. ఇక పాక్ తరఫున ఆడిన 25 టీ20లలో అతడు 31 వికెట్లు పడగొట్టగలిగాడు. అయితే, 31 ఏళ్ల ఉస్మాన్‌కు జాతీయ జట్టులో ఎప్పుడూ సుస్థిర స్థానం దక్కలేదు. దీంతో కలత చెందిన అతడు.. తాను ఇక పాకిస్తాన్‌కు ఆడనని.. ఆస్ట్రేలియా తరఫున ఆడాలనుకుంటున్నానని 2018లో వ్యాఖ్యానించాడు.ఇక తాజాగా.. రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగానూ పాకిస్తాన్ క్రికెట్ వీడ్కోలు పలుకుతున్నానని ఉస్మాన్ పేర్కొనడం గమనార్హం. అంతేకాదు.. తాను జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నానని.. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తాననంటూ ట్విస్టు ఇ వ్వడం విశేషం. ఏదేమైనా పాకిస్తాన్ జట్టుతో తనకున్న అనుబంధం మర్చిపోలేనని.. సహచర ఆటగాళ్లు, కోచ్‌లకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఉస్మాన్ కాదిర్ ఇటీవల చాంపియన్స్ వన్డే కప్‌లో డాల్ఫిన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. -
‘ఆమె’ కోసం పాక్ నుంచి వచ్చి బుక్కయ్యాడు..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, సైబర్ క్రైమ్‌కు పాల్పడి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ ఇంకొన్నాళ్లు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. కేసులో అభియోగపత్రం దాఖలై, విచారణ ప్రారంభమైనా... కోవిడ్ ప్రభావంతో దానికి బ్రేక్ పడింది. దీంతో మళ్లీ ట్రయల్ మొదలై, ముగిసే వరకు డిపోర్టేషన్ ప్రక్రియ ఆగాల్సి వచ్చింది. ‘ఆమె’ కోసం వచ్చి బుక్కయ్యాడు... నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయారు. సదరు మహిళకు ఇద్ద రు కుమార్తెలు. పన్నెండేళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఆమెకు అక్కడ పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ అబ్బాస్ ఇక్రమ్‌తో పరిచయమైంది. తాను భారతీయుడినే అని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతగాడు ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలిసిన సదరు మహిళ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. 2011లో ఉస్మాన్ సైతం అక్రమం మార్గంలో హైదరాబాద్‌కు వచ్చాడు. సైబర్ క్రైమ్‌కు పాల్పడి అరెస్టు... ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు ఇతగాడు అక్రమంగా దేశంలోకి వచ్చాడని తెలుసుకున్న సదరు మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షగట్టిన ఇక్రమ్ ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు చిత్రీకరించడంతో పాటు కొందరికి ఆన్లైన్లో విక్రయించానంటూ బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానని బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్ సందేశం పంపాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అధికారులు 2018 జూన్‌లో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అబ్బాస్ పేరుతో అనేక బోగస్ ధ్రువీకరణలు పొంది పాస్‌పోర్ట్ తీసుకున్నాడని, అలాగే కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేశాడని బయటపడింది. ధ్రువీకరించిన పాక్ ఎంబసీ ఆఫీస్.. ఇతగాడిని అరెస్టు చేసినప్పుడు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో టెన్త్ నుంచి డిగ్రీ (2003–08) వరకు చదివినట్లు ఉన్న సర్టిఫికెట్లతో పాటు అబ్బాస్ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్‌పోర్ట్, ఆధార్ సహా ఇతర గుర్తింపు కార్డులతో పాటు పాక్ పాస్‌పోర్ట్‌నకు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతడివద్ద ఉన్నవి బోగస్ పత్రాలని, వాస్తవానికి పాక్ జాతీయుడని నిర్థారించడం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు విదేశీ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ద్వారా ఎంఈఏ పాక్‌కు లేఖ రాశారు. ఆ దేశ రాయ బార కార్యాలయం అతడు తమ జాతీయుడేనంటూ సమాధానం ఇచ్చింది. కోవిడ్‌తో ఆగిన ట్రయల్... దీన్ని ఆధారంగా చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇక్రమ్‌పై అభియోగపత్రాలు దాఖలు చేశారు. సాధారణంగా నేరం చేసిన వాళ్లను జైలుకు పంపి, నిరూపితం కాని వారిని బయటకు వదిలేస్తారు. అయితే ఇక్రమ్ కేసులో మాత్రం ఈ విధానం చిత్రంగా ఉంది. అతడు దోషిగా తేలినా, నిర్దోషిగా బయటపడినా తక్షణం ఆ దేశానికి పంపేయాల్సిందే. ఎంఈఏ నుంచి ఈ మేరకు అందిన ఉత్తర్వుల మేరకు కోర్టులో కేసు డిస్పోజ్ అయిన వెంటనే అతడిని తీసుకువెళ్లి ఢిల్లీలోని పాక్ ఎంబసీలో అప్పగించాలని యోచించారు. అయితే ఈ ఏడాది మార్చి నుంచి కోవిడ్ ప్రభావం, లాక్డౌన్ తదితరాల నేపథ్యంలో కేసు ట్రయల్ ఆగిపోయింది. ఫలింతంగా ఇక్కమ్ రిమాండ్ ఖైదీగా జైల్లోనే ఉండిపోయాడు. కోర్టులు పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభమై, కేసు విచారణ ముగిసే వరకు ఇక్రమ్ ఇక్కడ ఉండాల్సిందే. -
చిక్కిన పాకిస్థానీ.. అప్పగించాల్సిందే..
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, ఓ సైబర్ నేరానికి పాల్పడి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కిన పాకిస్థాన్ జాతీయుడు మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ కేసులో అభియోగపత్రం దాఖలైంది. విచారణ చేపట్టే న్యాయస్థానం అతడు దోషా..? నిర్దోషా..? అనేది తేల్చనుంది. తీర్పు ఎలా ఉన్నా సరే వెలువడిన వెంటనే ఇక్రమ్‌ను సొంత దేశానికి పంపేయాల్సి ఉంది. ఈ నిబంధనల నేపథ్యంలోనే ఆ కేసు ఓ తంతుగా పోలీసులు పేర్కొంటున్నారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించి పట్టుబడిన పాకిస్థానీయులను సాధారణంగా ఆ దేశం పట్టించుకోదు. అయితే ఇక్రమ్ వ్యవహారంలో మాత్రం అతడు తమ దేశీయుడేనంటూ సమాధానం ఇవ్వడం కొసమెరుపు. ‘ఆమె’ కోసం వచ్చి బుక్కయ్యాడు.... నగరంలోని పాతబస్తీకి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం భర్తను కోల్పోయింది. సదరు మహిళకు ఇద్దరు కుమార్తెలు. 12 ఏళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లిన ఆముకు అక్కడ ఉద్యోగం చేస్తున్న ఈ మహిళకు పాకిస్థానీ మహ్మద్ ఉస్మాన్ ఇక్రమ్ అలియాస్ మహ్మద్ అబ్బాస్ ఇక్రమ్‌తో పరిచయం ఏర్పడింది. తాను భారతీయుడినేనని, స్వస్థలం ఢిల్లీ అని నమ్మించిన అతను ఆమెను వివాహం చేసుకున్నాడు. కొన్నాళ్లకు అసలు విషయం తెలియడంతో ఆమె హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. దీంతో 2011లో ఉస్మాన్ సైతం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. అప్పట్లో తాను ఆరు నెలల విజిట్ వీసాపై వచ్చినట్లు చెప్పాడు. అయితే వాస్తవానికి అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన అతడు దుబాయ్ నుంచి నేపాల్ వరకు విమానంలో..అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గాల్లో ఢిల్లీ వెళ్లి అక్కడినుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. సైబర్ క్రైమ్ కేసులో అరెస్టు... ఇక్రమ్ వచ్చిన ఆరు నెలలకు తర్వాత అతను అక్రమంగా దేశంలోకి వచ్చినట్లు తెలియడంతో సదరు మహిళ అతడిని దూరంగా ఉంచడం ప్రారంభించారు. దీంతో కక్షకట్టిన అతను ఆమె 12 ఏళ్ల కుమార్తె నగ్న చిత్రాలు చిత్రీకరించడంతో పాటు కొందరికి ఆన్లైన్లో విక్రయించానంటూ బెదిరింపులకు దిగాడు. తనకు డబ్బు ఇవ్వకపోతే సదరు ఫొటోలను బయటపెడతానంటూ బాధిత మహిళ స్నేహితురాలికీ వాట్సాప్ మెసేజ్ పంపాడు. దీంతో బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు గత ఏడాది జూన్‌లో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ నేపథ్యంలో అబ్బాస్ పేరుతో అనేక బోగస్ ధ్రువీకరణలు పొందిన ఉస్మాన్ పాస్‌పోర్ట్ సైతం తీసుకున్నట్లు వెల్లడైంది. సర్టిఫికెట్ల ఆధారంగా కొన్ని ప్రైవేట్ ఉద్యోగాలు చేసినట్లు బయటపడింది. ధ్రువీకరించిన పాక్ ఎంబసీ ఆఫీస్... ఇక్రమ్‌ను అరెస్టు చేసినప్పుడు మహారాష్ట్రలోని ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో టెన్త్ నుంచి డిగ్రీ చదివినట్లు ఉన్న సర్టిఫికెట్లతో పాటు అబ్బాస్ పేరుతో గోల్నాక చిరునామాతో 2012లో తీసుకున్న భారత పాస్‌పోర్ట్, ఆధార్ సహా ఇతర గుర్తింపుకార్డులతో పాటు పాక్ పాస్‌పోర్ట్‌నకు చెందినదిగా అనుమానిస్తున్న ఓ పేజీ జిరాక్సు ప్రతిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సర్టిఫికెట్ల ప్రకారం 2003లో టెన్త్, 2003–05ల్లో ఇంటర్, 2005–08ల్లో డిగ్రీ పూర్తి చేసినట్లు ఉంది. వాస్తవానికి ఇక్రమ్ 2009 వరకు పాకిస్థాన్ పాస్‌పోర్ట్‌తో దుబాయ్‌లో ఉన్నాడు. దీంతో ఇతడి వద్ద ఉన్నవి బోగస్ పత్రాలని, వాస్తవానికి పాక్ జాతీయుడని నిర్థారించడం కోసం సైబర్ క్రైమ్ పోలీసులు విదేశీ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ద్వారా ఎంఈఏ పాక్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆ దేశ రాయబార కార్యాల యం అతడు తమ జాతీయుడే నంటూ ఇచ్చిన జవాబు సైతం ఎంఈఏ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు చేరింది. పక్కాగా చార్జ్‌షీట్.. దీనిని ఆధారంగా చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇక్రమ్‌పై అభియోగపత్రాలు దాఖలు చేశారు. న్యాయస్థానంలో కేసు విచారణ పూర్తయిన తర్వాత అతడు నేరం చేశాడా? లేదా? అనేది తేలుతుంది. సాధారణంగా నేరం చేసిన వారిని జైలుకు పంపి, నిరూపితం కాని వారిని వదిలేస్తారు. అయితే ఇక్రమ్ కేసులో మాత్రం ఈ విధానం చిత్రంగా ఉంది. అతడు దోషిగా తేలినా, నిర్దోషిగా బయటపడినా తక్షణం ఆ దేశానికి పంపేయాల్సిందే. ఎంఈఏ నుంచి అందిన ఉత్తర్వులు అలానే ఉన్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కోర్టులో కేసు పెండింగ్‌లో లేకుండా డిస్పోజ్ అయిన వెంటనే అతడిని తీసుకువెళ్లి ఢిల్లీలోని పాక్ ఎంబసీలో అప్పగించాల్సిందే. ఈ నేపథ్యంలోనే కేసు విచారణ తదితరాలు అవసరం లేకుండా ఇక్రమే నేరం అంగీకరించేలా చేస్తే (ప్లీడెడ్ గిల్టీ) వెంటనే కేసు తేలిపోతుందని, ఫలితంగా కోర్టు సమయం, ఇతర వ్యయప్రయాసలు తప్పుతాయని భావించిన అధికారులు డిఫెన్స్ లాయర్ ద్వారా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్రమ్ మాత్రం నేరం అంగీకరించడానికి సిద్ధంగా లేకపోవడంతో విచారణ తప్పనిసరిగా మారింది. -
బెంగళూరులో కామారెడ్డి టీడీపీ నేత అదృశ్యం
సాక్షి, కామారెడ్డి: టీడీపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి ఎండీ ఉస్మాన్ మిస్సింగ్ మిస్టరీగా మారింది. ఈనెల 2వ తేదీన కామారెడ్డి నుంచి ఇంటి నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లిన ఉస్మాన్ చివరగా 9న పట్టణ టీడీపీ అధ్యక్షుడు నజీరొద్దీన్‌తో ఫోన్లో మాట్లాడాడు. మరుసటి రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, ఎంతకూ ఆయన ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఈనెల 15న కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉస్మాన్‌కు మంచి పేరు ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. కామారెడ్డితోపాటు హైదరాబాద్‌లో రియల్ దందా చేసేవాడు. టీడీపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. కాగా ఈ నెల 2న హైదరాబాద్‌కు అక్కడి నుంచి బెంగుళూరుకు వెళ్లిన ఉస్మాన్ అక్కడి నుంచి ఎటు వెళ్లాడు ? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి ఉంచాడు.? అన్నది తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థికంగా స్థిరపడ్డ ఉస్మాన్‌కు ఏ ఇబ్బంది లేదు. వ్యాపారంలో రాణించాడు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఏవైనా గొడవలు ఉన్నాయా అన్నది తెలియరాలేదు. ఉస్మాన్ జాడ కోసం కుటుంబ సభ్యులు బెంగుళూరుకు వెళ్లారు. ఈ విషయమై కామారెడ్డి పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. -
25న హాకీ బాలికల జూనియర్స్ ఎంపిక పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హాకీ జూనియర్స్ స్థాయి బాలికల ఎంపిక పోటీలను ఈనెల 25వ తేదీన హన్మకొండలోని ఎన్‌యూసీ క్లబ్లో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉస్మాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన బాలికలు తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు నల్లగొండలో జరిగే రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారని చెప్పారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే వారు జనవరి 1, 1998 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన వారు 25న ఉదయం 8 గంటలకు పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రాలను తీసుకుని హాకీ క్లబ్లో హాజరుకావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ 90002–82185 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
పాక్ ఉగ్ర ఊతానికి సజీవ సాక్ష్యం
కశ్మీర్లో ఇద్దరు గ్రామస్తుల తెగువతో దొరికిన టైస్ట్ పాక్ నుంచి వచ్చానని వెల్లడి అంతకుముందు మరో ఉగ్రవాదితో కలసి బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై దాడి * ఇద్దరు కానిస్టేబుళ్ల మృతి; 11 మందికి గాయాలు * ప్రతిదాడిలో హతమైన ఒక ఉగ్రవాది ఉధంపూర్/న్యూఢిల్లీ: భారత్‌పై విషం చిమ్ముతూ ఉగ్రదాడులకు ఊతమిస్తున్న పాకిస్తాన్ విద్రోహాలను బట్టబయలు చేసే మరో సజీవ సాక్ష్యం భారత్‌కు చిక్కింది. భారత్‌లో మారణహోమం సృష్టించేందుకు సరిహద్దులు దాటి వచ్చిన ఓ పాక్ ఉగ్రవాదిని బుధవారం ఇద్దరు భారత పౌరులు ప్రాణాలకు తెగించి, ప్రాణాలతో పట్టుకున్నారు. పాక్ దుశ్చర్యలను ససాక్ష్యంగా ఎండగట్టేందుకు అవసరమైన కీలక ఆధారాన్ని భారత ప్రభుత్వానికి అందించారు. అయితే, అప్పటికే ఆ ముష్కరుడి, అతడి సహచరుడి దాడిలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో 11 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలు.. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో జమ్మూ, శ్రీనగర్ జాతీయ రహదారిపై శ్రీనగర్‌వైపు వెళ్తున్న సరిహద్దు రక్షణ దళ(బీఎస్ఎఫ్) వాహన శ్రేణి ఉధంపూర్ దగ్గర్లోని సిమ్రోలి వద్దకు చేరుకోగానే సాయుధులైన ఇద్దరు ఉగ్రవాదులు.. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి ఆ కాన్వాయ్‌పై గ్రెనేడ్లతో దాడి ప్రారంభించారు. అత్యాధునిక ఆయుధాలతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తేరుకున్న బీఎస్ఎఫ్ జవాన్లు ప్రతిదాడి ప్రారంభించారు. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన హరియాణాకు చెందిన కానిస్టేబుల్ రాకీ.. ఒక ఉగ్రవాదిని హతమార్చి, తానూ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఉగ్రవాది తప్పించుకుని పక్కనే కొండల్లో ఉన్న ఒక చిన్న గ్రామంలోకి వెళ్లాడు. అక్కడ ఐదుగురు గ్రామస్తులను బందీలుగా పట్టుకుని, స్థానిక పాఠశాలలో దాక్కున్నాడు. పారిపోయేందుకు దారి చెప్పాలని, లేదంటే అందరినీ చంపేస్తానంటూ బెదిరించాడు. అప్పటికే పోలీస్, ఆర్మీ ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. బందీలుగా చిక్కిన గ్రామస్తుల్లో గ్రామ రక్షణ కమిటీ సభ్యులు ఉన్నారు. వారిలో ఇద్దరు రాకేశ్ కుమార్, విక్రమ్‌జిత్‌లు ధైర్యంగా ఆ ఉగ్రవాదిని ఎదిరించడం ప్రారంభించారు. విక్రమ్‌జిత్ ఆ టైస్ట్ మెడను గట్టిగా పట్టుకోగా, రాకేశ్ తుపాకీ కాల్చకుండా అడ్డుకున్నాడు. అయినా, ఆ ఉగ్రవాది కొన్ని రౌండ్లు కాల్పులు జరిపాడు. కానీ అదృష్టవశాత్తూ అవి రాకేశ్, విక్రమ్జిత్లకు తగల్లేదు. పెనుగులాటలో ఆ ఉగ్రవాది కిందపడిపోయాడు. అతన్ని అలాగే బంధించి వారిద్దరూ పోలీసులకు అప్పగించారు. ఈలోగా బందీలుగా ఉన్న మరో ముగ్గురు గ్రామస్తులు దేశిరాజ్, సుభాష్ శర్మ, జీవన్‌లు తప్పించుకుని గ్రామంలోకి పారిపోయారు. జమ్మూలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఆ ప్రాంతంలో బంద్ పాటిస్తున్నారు. అందువల్ల ఆ స్కూల్లో విద్యార్థులెవరూ లేరు. పాక్ నుంచి సరి‘హద్దులు’ దాటి.. అనంతరం పోలీసుల విచారణలో తమ వివరాలను ఆ ఉగ్రవాది వెల్లడించాడు. మొదట తన పేరు ఖాసిమ్ ఖాన్ అని, ఆ తరువాత ఉస్మాన్ అని చెప్పి, చివరగా తన అసలుపేరు మొహమ్మద్ నవేద్ యాకూబ్ అని తెలిపాడు. తనకు 20 ఏళ్లని, పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్ పట్టణంలో ఉన్న గులం ముస్తఫాబాద్ ప్రాంతానికి చెందినవాడినని వివరించాడు. తనకు ఇద్దరు సోదరులు, ఒక సోదరి ఉందని చెప్పాడు. వారిలో ఒకరు లెక్చరర్‌గా పనిచేస్తున్నారని, మరొకరికి చిన్న వస్త్ర దుకాణముందని తెలిపాడు. జవాన్ల కాల్పుల్లో చనిపోయిన టైస్ట్ పేరు నొమన్ అలియాస్ మొమిన్ అని, అతడు భావల్పూర్కు చెందిన వాడని తెలిపాడు. గత నెలలో తను, మరో నలుగురు ఉగ్రవాదులు కలిసి భారత్‌లో ఉగ్రదాడి చేసే ఉద్దేశంతో కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోకి వచ్చామని, అయితే, తమకు గైడ్‌గా రావల్సిన వ్యక్తి సమయానికి రాకపోవడంతో మళ్లీ పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి వెళ్లిపోయామని వెల్లడించాడు. మళ్లీ కొన్ని రోజుల తరువాత, ముగ్గురితో కలిసి బారాముల్లా వద్ద సరిహద్దు ఫెన్సింగ్‌ను కత్తిరించి భారత్‌లోకి వచ్చామని, అవంతిపుర-పుల్వామా దగ్గర్లోని ఒక గుహలో దాక్కున్నామని వెల్లడించాడు. మంగళవారం తాను, నోమన్ కలిసి ఒక ట్రక్‌లో ఉధంపూర్ చేరుకున్నామని తెలిపాడు. అనంతరం అతడిని పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆ సమయంలో టీవీ కెమెరాల వైపు నవ్వుతూ చూస్తూ.. విలేకరుల ప్రశ్నలకు ఎలాంటి బెదురు లేకుండా అతడు సమాధానాలివ్వడం విశేషం. ‘ఇలా చేయడం(ప్రాణాలు తీయడం) నాకు సరదాగా ఉంది. ఇందులో నేను చనిపోతే అది అల్లా ఆజ్ఞగా భావిస్తా’నని నిర్భయంగా సమాధానమిచ్చాడు. ముంబైలో భీకర దాడులకు పాల్పడిన కసబ్ నవేద్ కన్నా ముందు సజీవంగా భారత దళాలకు చిక్కాడు. 26/11 ముంబై దాడుల్లో పాక్ పాత్రను ఆ దేశ ఎఫ్ఐఏ మాజీ అధికారే స్వయంగా వెల్లడించిన మర్నాడే.. పాక్ కుట్రలను బట్టబయలు చేసే మరో సజీవ సాక్ష్యం లభించడం విశేషం. చర్చల విషయంలో ముందుకే! భారత్, పాక్ ప్రధానమంత్రుల ఇటీవలి భేటీలో నిర్ణయించిన మేరకు, ఇరుదేశాల జాతీయ భద్రత సలహాదారుల స్థాయి చర్చల విషయంలో ముందుకే వెళ్లాలనుకుంటున్నట్లు భారత్ స్పష్టం చేసింది. ఈ నెల 23, 24 తేదీల్లో ఢిల్లీలో జరపాలని తలపెట్టిన ఆ చర్చలకు సంబంధించి తాము పంపిన ఆహ్వానంపై పాక్ నుంచి ఇంకా ఏ స్పందన రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. గతవారం గురుదాస్‌పూర్‌లో, తాజాగా జమ్మూలో జరిగిన పాక్ ప్రేరేపిత ఉగ్రదాడుల నేపథ్యంలో చర్చల నుంచి భారత్ తప్పుకోనుందనే వార్తలు వస్తున్నాయి. పోలిసుల ఎదురుదాడిలో హతమైన ఉగ్రవాది వీరు లష్కరే ముష్కరులే! బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసిన వారిని పాక్ నుంచి వచ్చిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందినవారిగా భావిస్తున్నామని జమ్మూ ఐజీ డేనిష్ రాణా తెలిపారు. వీరి దాడిలో కానిస్టేబుల్ రాకీతో పాటు మరో కానిస్టేబుల్ శుబేందు రాయ్(పశ్చిమబెంగాల్) కూడా చనిపోగా, 11 మంది జవాన్లు గాయాలపాలయ్యారని వివరించారు. క్షతగాత్రులను జమ్ము, ఉధంపూర్ల్లోని ఆసుపత్రులకు తరలించామన్నారు. ఈ దాడికి అమర్నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకున్నది కాదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ దాడికి ముందేఅమర్నాథ్ యాత్రికులు అదే దారి గుండా వెళ్లారు. పాక్‌కు ఇప్పటికైనా తగిన సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రాణాలతో ఒక టైస్ట్ను పట్టుకోవడం చాలా అరుదని, ఇది భద్రతాదళాలకు, భారత ప్రభుత్వానికి గొప్ప విజయమని బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి అన్నారు. భారత్‌లో ఉగ్రవాద చర్యల్లో పాక్ పాత్రను స్పష్టం చేసే సాక్ష్యంగా అంతర్జాతీయ సంస్థల ముందు అతడిని చూపవచ్చన్నారు. భారత్‌లో చొరబాటుకు ప్రయత్నిస్తున్న 17 మంది ఉగ్రవాదులను ఈ ఏడాదిలో ఇప్పటివరకు హతమార్చామని లెఫ్ట్‌నెంట్ జనరల్ సుబ్రత సాహ తెలిపారు. రాక్‌ఫోర్స్.. రాకీ! న్యూఢిల్లీ: ఈ దాడిలో సహచరుల ప్రాణాలు కాపాడి, తాను ప్రాణాలొదిలిన కానిస్టేబుల్ రాకీ(27) బీఎస్ఎఫ్లో ఇటీవలే చేరాడు. ఉగ్రవాదుల దాడిలో తనకు బుల్లెట్ గాయాలైనా తట్టుకుని.. తన తుపాకీలోని 40 బుల్లెట్లు ఖాళీ అయేంతవరకు వారిపై తూటాలవర్షం కురిపించాడు. వారికి జవాన్లతో నిండి ఉన్న బస్‌పై గ్రెనేడ్లు విసిరే సమయం, అవకాశం ఇవ్వకుండా దాడి కొనసాగించాడు. అదనపు బలగాలు వచ్చేవరకు వారిని నిలువరించాడు. టైస్ట్లపై సహచరులు పొజిషన్స్ తీసుకుని, దాడి చేసేందుకు వీలు కల్పించాడు. రాకీ అంత వీరోచితంగా పోరాడి ఉండకపోతే.. మరి కొంతమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయేవారని బీఎస్ఎఫ్ డీజీ డీకే పాఠక్ స్వయంగా చెప్పడం రాకీ చూపిన సాహసానికి అద్దం పడుతోంది. తన యూనిట్లో రాకీని అంతా ‘రాక్‌ఫోర్స్’గా పేర్కొనేవారని, పేరుకు తగ్గట్లే వీరోచితంగా, హీరోలా పోరాడాడని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు కొనియాడారు. -
కసబ్ తర్వాత చిక్కిందే ఉస్మానే
-
కసబ్ తర్వాత చిక్కింది ఉస్మానే
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లో ఉదంపూర్ ఉగ్రవాద దాడి ఘటనలో సరిహద్దు భద్రత దళం (బీఎస్ఎఫ్), సైన్యం పట్టుకున్న ఉగ్రవాదిని పాకిస్థాన్ జాతీయుడిగా గుర్తించారు. ఉగ్రవాది పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందినవాడని, అతడి పేరు ఖాసింఖాన్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ అని సీనియర్ పోలీస్ అధికారి డానిష్ రానా చెప్పారు. కసబ్ తర్వాత ప్రాణాలతో దొరికిన రెండో పాక్ ఉగ్రవాది ఉస్మానే.అతడి వద్ద ఒక ఏకే-47 తుపాకిని స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు ఉదయం ఉదంపూర్ సమీపంలో జమ్ము-శ్రీనగర్ హైవేపై వెళ్తున్న బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేసి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. అనంతరం ఉగ్రవాదులు సమీపంలోని గ్రామంలోకి వెళ్లి ముగ్గురిని బందించారు. బీఎస్ఎఫ్తో పాటు ఆర్మీ రంగంలోకి దిగిన బందీలను విడిపించాయి. ఉగ్రవాదులో ఒకడిని సజీవంగా పట్టుకోగా, మిగిలిన వారు పారిపోయారు. ఉగ్రవాద దాడి నేపథ్యంలో భద్రత చర్యలను పర్యవేక్షించేందుకు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ డీకే పాఠక్ జమ్మూకు వెళ్లారు. -
టీవీ చానల్ మార్పు విషయంలో అక్కాచెల్లెళ్ల వాగ్వాదం చెల్లి ఆత్మహత్య
సంజీవరెడ్డినగర్,న్యూస్‌లైన్: టీవీ చానల్ మార్పు విషయంలో అక్కాచెల్లల మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన చెల్లి చివరకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన సంజీవరెడ్డినగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఎస్ఐ సుదర్శన్‌రెడ్డి వివరాల ప్రకారం..బోరబండ రాజీవ్‌నగర్‌కు చెందిన వైద్యుడు ఉస్మాన్ కూతురు ఫాతిమా(13) స్థానిక పాఠశాలలో 8వతరగతి చదువుతుంది. ఫాతిమా టీవీ చూస్తుండగా అక్క వచ్చి మరోచాన ల్ మార్చింది. ఎందుకు చానల్ మార్చావంటూ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఫాతిమా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. మధ్యాహ్నం నమాజ్ చేసుకున్న అనంతరం 2గంటల సమయంలో గదిలోకి వెళ్లి చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గదిలోకి వెళ్లిన ఫాతిమా ఎంతకూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. కొనఊపిరితో ఆమెను చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించగా కాసేపటికే మృతిచెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా చానల్ మార్పు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.