అసెంబ్లీ వ్యవహారాలపై త్వరలో టీవీ చానల్ ప్రారంభం
Published Sat, Aug 10 2013 11:57 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
సాక్షి, ముంబై: అసెంబ్లీలో కొనసాగుతున్న వ్యవహారాలన్నింటినీ ప్రజలకు తెలియపరిచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తొందర్లోనే ‘అమ్చీ విధానసభా’ అనే టీ వీ చానల్‌ను ప్రారంభించనుంది. ఇందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. అందిన వివరాల మేరకు ఈ విషయంపై తుది నివేదిక రూపొందించినట్టు తెలిసింది.
అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు ఎలా పనులు చేస్తారనే విషయంతోపాటు అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల్లో వారు సమస్యలపై చర్చలు ఎలా జరుపుతున్నారనే విషయం తెలుసుకోవాలని ప్రజల్లో కుతూహలం ఉంటుంది. వీటితోపాటు అనేక సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ చానల్‌ను ప్రారంభిస్తున్నారని చెప్పవచ్చు. ఈ విషయంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌లతోపాటు శాసన సభ, శాసన మండలిల స్పీకర్లు, పదాధికారులు లోకసభ టీవీ చానల్ అధికారులతో భేటీ అయినట్టు సమాచారం.
Advertisement
Advertisement