ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, ఎన్సీపీకి చెందిన ఒక శాసన సభ్యుడు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు బుధవారం విధాన సభలో ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుని వాగ్వాదానికి దిగారు. అధికార శివసేన-బీజేపీ సంకీర్ణాన్ని దూషించే ప్రయత్నంలో ఎన్సీపీ ఎమ్మెల్యేలు శాసనసభ భవనం మెట్ల పై క్యారెట్‌లను తీసుకువెళ్లారు.
షిండే వర్గం ఎమ్మెల్యేలు ఎన్సీపీ ఎమ్మెల్యేల నుంచి క్యారెట్లు లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇద్దరి మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాసేపటికి ఇరువర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని ఉద్రిక్తత సద్దుమణిగేలా చేశారు. అంతకు ముందు మహారాష్ట్ర మాజీ సీఎం ఉథవ్ థాక్రే, అతని కుమారుడు ఆదిత్య థాక్రేలను లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీ వర్గానికి చెందిన శాసన సభ్యులు, షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు నిరసనలు చేపట్టారు.
అంతేకాదు నగదు అధికంగా ఉండే బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో అవినీతి జరిగిందని, థాక్రేలు అధికారం కోసం హిందుత్వవాదంతో రాజీ పడ్డారంటూ వివిధ సందేశాలతో కూడిన బ్యానర్‌లతో నినాదాలు చేశారు. ఈ మేరకు షిండే పార్టీకి చెందిన ఎమ్మెల్యే భరత్ గోగావాలే విలేకరులతో మాట్లాడుతూ...ఇన్నిరోజులు ప్రతిపక్షాలు నిరసనలు చేస్తున్నప్పుడూ తాము ఒక్కమాట కూడా మాట్లడలేదన్నారు. అయినా నిరసన చేస్తున్నప్పుడు తమ దగ్గరికి రావాల్సిన అవసరం ఏమిటన్ని ప్రశ్నించారు. ఇలా ఇరుపక్షాల సభ్యులు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ సభకు వెళ్లారు. అదీగాక మహారాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగియనున్నాయి.
#WATCH | A scuffle broke out between a few ruling party MLAs and Maha Vikas Aghadi MLAs outside the Maharashtra Assembly, in Mumbai pic.twitter.com/genqozygaU
— ANI (@ANI) August 24, 2022
(చదవండి: అఘాడీ కూటమితోనే శివసేన.. ఆ అడ్డంకిని అధిగమిస్తాం: ఉద్ధవ్ థాక్రే)
Comments
Please login to add a commentAdd a comment