
హైదరాబాద్: బంజారాహిల్స్‌రోడ్‌నెం 12, ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఓ తెలుగు చానల్‌లో ఈ నెల 28న అర్థరాత్రి దాటిన తర్వాత అకస్మాత్తుగా అశ్లీల వీడియోలు ప్రసారమయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు తమ చానల్‌కు చెందిన సర్వర్‌ను హ్యాక్‌చేసి వీడియోలు అప్‌లోడ్ చేశారంటూ సదరు చానల్ నిర్వాహకులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లైవ్ చానెల్‌గా నడిచే తమ చానల్‌లో అర్ధరాత్రి 15 నిమిషాల పాటు అశ్లీల వీడియోలు ప్రసారం అయ్యాయని, తమ సిబ్బంది అప్రమత్తమై వాటి ని తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని కోరారు.