YSRCP Vijayasai Reddy Wrote Letter to Sansad TV, Details Inside - Sakshi
Sakshi News home page

సంసద్ టీవీకి లేఖ రాసిన వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

Published Tue, Jun 28 2022 9:23 PM | Last Updated on Wed, Jun 29 2022 5:47 PM

YSRCP Vijayasai Reddy Wrote Letter to Sansad TV - Sakshi

సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: సంసద్‌ టీవీలో చర్చలకు వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ రఘురామకృష్ణరాజును పిలవద్దని ఆ టీవీ సీఈవోకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆ టీవీ సీఈవోకి లేఖ రాశారు. సంసద్‌ టీవీ చర్చల్లో వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీ రఘురామ పాల్గొనడం తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.

ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆయనపై అనర్హత వేటు వేయాలని తాము ఇచ్చిన పిటిషన్‌పై స్పీకర్‌ విచారిస్తున్నారని లేఖలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు విశ్వసనీయత ఉండదని, ఆయన మాటలు వైఎస్సార్‌సీపీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అభిప్రాయాలను ప్రతిబింబించవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత 17వ లోక్‌సభ గడువు పూర్తయ్యేవరకు ఆయన్ని సంసద్‌ టీవీ షోలు, చర్చలకు పిలవద్దని విజయసాయిరెడ్డి కోరారు.  

చదవండి: (ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement