టీవీ కార్యాలయంపై రాళ్ల దాడి | Attack On Tv Channel Office In Hyderabad | Sakshi
Sakshi News home page

ఓ టీవీ కార్యాలయంపై రాళ్ల దాడి

Published Sun, Sep 20 2020 12:28 PM | Last Updated on Sun, Sep 20 2020 12:39 PM

Attack On Tv Channel Office In Hyderabad - Sakshi

జూబ్లీహిల్స్ ‌: గుర్తు తెలియని వ్యక్తులు బంజారాహిల్స్‌లోని ఓ టీవీ కార్యాలయంపై శుక్రవారం అర్ధరాత్రి రాళ్లతో దాడిచేసినట్లు సంస్థ సీఈవో రాజశేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేవారు. వివరాల్లోకి వెళితే.. మూడు ద్విచక్రవాహనాలపై వచ్చిన అగంతకులు రాళ్లతో పలు ఫ్లోర్లపై దాడి చేశారని, ఈ దాడిలో పలు అంతస్తుల అద్దాలు ధ్వంసం అయ్యాయన్నారు. నైట్‌ షిఫ్ట్‌లో పనిచేస్తున్న దాదాపు 50 మంది ఉద్యోగులు భయాందోళనకు గురవడంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది 100కు ఫోన్‌ చేయగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటన వెనుక పెద్దకుట్ర ఉందని, దర్యాప్తు చేసి దాడికి దిగిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాజశేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement