
సాక్షి, హైదరాబాద్: ఓ టీవీ ఛానల్ యాంకర్‌ను యువతి కిడ్నాప్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. యాంకర్‌ను పెళ్లి చేసుకోవాలంటూ బెదిరింపులకు దిగిన త్రిష్ణ అనే యువతి కిడ్నాప్‌కు పాల్పడింది. తనను వివాహం చేసుకోవాలని రూమ్‌లో బంధించింది. త్రిష్ణ చెర నుంచి తప్పించుకున్న ప్రణవ్ పోలీసులను ఆశ్రయించాడు. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్‌ను నడుపుతున్న త్రిష్ణ.. భారత్ మాట్రిమోన్‌లో ప్రణవ్ ఫోటోలు చూసి ఇష్టపడింది.
ప్రణవ్ పేరుతో నకిలీ ఐడిని సైబర్ కేటుగాళ్లు క్రియేట్ చేయగా, నిజంగానే ప్రణవ్ ఐడి అనుకున్న త్రిష్ణ ఇష్టపడింది. ప్రణవ్‌పై మనసు పడ్డ ఆమె కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని భావించింది. చివరికి కథ అడ్డం తిరిగింది. త్రిష్ణను అరెస్ట్ చేసిన ఉప్పల్ పోలీసులు రిమాండ్‌కు పంపించారు. ఐదు స్టార్టప్ కంపెనీలకు త్రిష్ణ ఎండిగా ఉంది.
ఇదీ చదవండి: నిన్ను లవ్ చేస్తున్నా.. ఫ్యాకల్టీ నో చెప్పాడని.. ఎంత పనిచేసిందంటే..
Comments
Please login to add a commentAdd a comment