ఈజిప్టులో అల్ జజీరా చానల్ను బహిష్కరిస్తూ అక్కడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ చానల్ ప్రసారాలను దేశంలో అనుమతించకూడదని ఆదేశించింది. దాంతో పాటు ముస్లిం బ్రదర్హుడ్కు చెందిన అహ్రార్ 25, జోర్డాన్కు చెందిన అల్-యర్ముక్, పాలస్తీనాకు చెదిన అల్- కుద్స్ చానళ్లనూ బహిష్కరించింది. ఈ మేరకు ఈజిప్టు అధికార వార్తా సంస్థ మెనాను ఉటంకిస్తూ సిన్హువా వార్తా సంస్థ తెలిపింది.
ఇస్లామిస్టు అల్-హఫజ్ చానల్ను కూడా ఇంతకుముందు ఇదే కోర్టు తన ఆదేశాలతో బహిష్కరించింది. ఆ చానల్ మతవిద్వేషాలను రేపుతోందన్న ఆరోపణల కారణంగానే బహిష్కారం విధించింది. మరికొన్ని ఇస్లామిస్టు నెట్వర్కులను తాత్కాలికంగా ఆపేశారు. ఇస్లామిస్టు అధ్యక్షుడు మహ్మద్ మోర్సీని పదవీచ్యుతుడిని చేశాక ఇదంతా జరిగింది.
అల్ జజీరా చానల్ను బహిష్కరించిన ఈజిప్టు కోర్టు
Published Tue, Sep 3 2013 4:49 PM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement
Advertisement