al-jazeera
-
ఇజ్రాయెల్ దాడుల్లో జర్నలిస్టుల మృతి
రఫా: గాజా్రస్టిప్‌పై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం దక్షిణ గాజాపై జరిగిన దాడుల్లో ఇద్దరు పాలస్తీనా జర్నలిస్టులు మరణించారు. వీరిలో అల్–జజీరా సీనియర్ కరస్పాండెంట్ వాయిల్ దాహ్‌దౌ కుమారుడు హమ్జా దాహ్‌దౌ కూడా ఉన్నాడు. మరో జర్నలిస్టు కూడా మృతి చెందాడు. ఇజ్రాయెల్ దాడుల్లో వాయిల్ దాహ్‌దౌ కుటుంబంలో ఇప్పటిదాకా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య, ఇద్దరు కుమారులు, మనవడు ఇప్పటికే చనిపోగా, ఆదివారం మరో కుమారుడు బలయ్యాడు. దాహ్‌దౌ సైతం గాయాలపాలయ్యాడు. అయినప్పటికీ తన విధులు నిర్వర్తిస్తూనే ఉన్నాడు. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధ వార్తలను ప్రపంచానికి అందిస్తున్నాడు. గాజాలో అసలేం జరుగుతోందో ప్రపంచం తెలుసుకోవాలని, అందుకోసం తన ప్రాణాలైనా ధారపోస్తానని వాయిల్ దాహ్‌దౌ చెప్పాడు. తన కుటుంబం మొత్తం బలైపోయినా తన సంకల్పం సడలిపోదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 22,800 మందికిపైగా పాలస్తీనియన్లు మృత్యువాత పడ్డారు. -
బై బై అమెరికా.. ప్రసారాలు ఇంతటితో సమాప్తం
అమెరికా బై బై..టా టా.. ఇన్ని రోజులు తమను ఆదరించిన ప్రేక్షకులందరకు కృతజ్ఞతలంటూ ఆల్ జజీరా చానల్ ప్రకటించింది. ప్రేక్షకులను ఆకట్టుకోలేని ఆ చానల్ మంగళవారం రాత్రితో యూఎస్ లో తన ప్రసారాలు నిలిపివేస్తోంది. ఇవాళ ఆరుగంటలకు(స్థానిక కాలెండర్ ప్రకారం) మొదలయ్యే ఫేర్ వెల్ పార్టీ లైవ్ ప్రొగ్రామ్ అనంతరం ఈ ఛానల్ ప్రసారాలు మూతపడనున్నాయి. ఆ చానల్ లో విజయవంతమైన కార్యక్రమాలను చివరిసారి చూపనున్నారు. కాగా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకోలేకపోవడంతో, మార్కెట్లో ఛానల్ ను నిర్వహించడానికి కష్టంగా మారిన క్రమంలో దీనిని మూసివేయనున్నామని జనవరిలోనే ఆల్-జజీరా ప్రకటించింది. 'మేము అమెరికా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వార్తల కవరేజ్ విషయంలో మేము చాలా గర్వంగా ఫీలవుతున్నాం. ఇంతటి సహకారం అందించినందుకు థ్యాంక్స్' అని ఆల్-జజీరా అమెరికన్ ప్రెసిడెంట్ కేట్ ఓ బ్రెయిన్ తెలిపారు. ఖతర్ కు చెందిన ఈ ఛానల్ 2013 లో అమెరికాలో తన ప్రసారాలు మొదలుపెట్టింది. ఉన్నతమైన ఆశయాలతో అమెరికాలో న్యూస్ నెట్ వర్క్ లో ప్రవేశించిన ఆల్-జజీరా, ఎన్నో ఆలోచించపరిచే వార్తలను అందించింది. మెరుగైన పనితనం వల్ల అవార్డులను కూడా దక్కించుకుంది. బీబీసీతో కలిసి నాలుగు భాగాల డాక్యుమెంటరీని కూడా ఆల్-జజీరా నిర్మించి ప్రసారం చేసింది. అయితే ప్రేక్షకుల నాడిని పట్టుకోవటంలో విఫలం కావటంతో ఆ చానల్ తన ప్రసారాలను నిలిపివేస్తోంది. దీంతో మార్కెట్లో ఈ ఛానల్ ను భర్తీ చేయగలది ఏముందో స్థానిక కేబుల్, శాటిలైట్ ఆపరేటర్స్ నిర్ణయిస్తున్నారు. -
అల్ జజీరా చానల్‌ను బహిష్కరించిన ఈజిప్టు కోర్టు
ఈజిప్టులో అల్ జజీరా చానల్‌ను బహిష్కరిస్తూ అక్కడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ చానల్ ప్రసారాలను దేశంలో అనుమతించకూడదని ఆదేశించింది. దాంతో పాటు ముస్లిం బ్రదర్‌హుడ్‌కు చెందిన అహ్రార్ 25, జోర్డాన్‌కు చెందిన అల్-యర్ముక్, పాలస్తీనాకు చెదిన అల్- కుద్స్ చానళ్లనూ బహిష్కరించింది. ఈ మేరకు ఈజిప్టు అధికార వార్తా సంస్థ మెనాను ఉటంకిస్తూ సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఇస్లామిస్టు అల్-హఫజ్ చానల్‌ను కూడా ఇంతకుముందు ఇదే కోర్టు తన ఆదేశాలతో బహిష్కరించింది. ఆ చానల్ మతవిద్వేషాలను రేపుతోందన్న ఆరోపణల కారణంగానే బహిష్కారం విధించింది. మరికొన్ని ఇస్లామిస్టు నెట్వర్కులను తాత్కాలికంగా ఆపేశారు. ఇస్లామిస్టు అధ్యక్షుడు మహ్మద్ మోర్సీని పదవీచ్యుతుడిని చేశాక ఇదంతా జరిగింది.