మోసపోయిన సినీ నటుడు, ఆరుగురి అరెస్టు | Actor cheated over prostitution at house, 6 arrested | Sakshi
Sakshi News home page

మోసపోయిన సినీ నటుడు, ఆరుగురి అరెస్టు

Published Tue, Jun 7 2016 7:28 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

మోసపోయిన సినీ నటుడు, ఆరుగురి అరెస్టు - Sakshi

మోసపోయిన సినీ నటుడు, ఆరుగురి అరెస్టు

హైదరాబాద్: సీఐడీ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న హోంగార్డు ఎస్‌ఐ అవతారం ఎత్తాడు. ఓ ఛానెల్‌లో పనిచేస్తున్న డ్రైవర్ కానిస్టేబుల్ అవతారం ఎత్తాడు. ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు మహిళా రిపోర్టర్ అవతారం ఎత్తారు. అంతా కలిసి ఓ సినీ నటుడి ఇంట్లోకి ప్రవేశించి వ్యభిచారం గృహం నిర్వహిస్తున్నావంటూ బెదిరించి డబ్బులు లాక్కున్నారు. అంతేకాకుండా ఇంకా డబ్బు కావాలంటూ కిడ్నాప్‌కు పాల్పడి పోలీసులకు చిక్కారు.

వివరాల్లోకి వెళితే శ్రీకృష్ణానగర్‌లో నివసించే సినీ నటుడు కాలెపు శ్రీనివాసరావు(48) నివాసంలోకి గత నెల 31వ తేదీన ఉదయం 10.30 గంటలకు అయిదుగురు యువకులు, ఇద్దరు యువతులు ప్రవేశించారు. తమను తాము పోలీసులమని, న్యూస్‌ఛానెల్ ప్రతినిధులమంటూ లాఠీతో పాటు డమ్మీ పిస్టల్, ఛానెల్ లోగోతో లోనికి ప్రవేశించి శ్రీనివాసరావును వ్యభిచారగృహం నిర్వహిస్తున్నావంటూ కెమెరా ఆన్‌చేసి బెదిరించారు. ఇంటి బీరువాలో ఉన్న డబ్బు దొంగిలించారు. బలవంతంగా కారులో తీసుకుని వెళ్లి ఏటీఎం కార్డు ద్వారా మరింత డబ్బును డ్రా చేయించారు. రూ. 2 లక్షలు ఇస్తే టీవీ ఛానెల్లో రాకుండా చేస్తామంటూ నగరమంతా తిప్పారు. వారి బారినుంచి తప్పించుకొని బయటపడ్డ శ్రీనివాసరావు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసుల విచారించగా.. సీఐడీ విభాగంలో హోంగార్డుగా పని చేస్తున్న రాజు ఎస్‌ఐగా బిల్డప్ ఇచ్చాడు. ఓ టీవీ ఛానెల్ డ్రై వర్‌గా పని చేస్తున్న మధు కానిస్టేబుల్‌గా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు వ్యభిచారిణులలో ఒకరు ఛానెల్ విలేకరినంటూ అదరగొట్టారు. ఛానెల్ యజమానే మీ జీతాలు మీరే సంపాదించుకోండి నాక్కూడా నెలకు ఒక్కొకరు రూ.25 వేలు తెచ్చివ్వండి అని చెప్పడంతో తామంతా రోడ్డు కెక్కామని నిందితులు తెలిపారు. ఛానెల్ ప్రతినిధులమంటూ చెప్పుకున్న జలీల్, జగదీష్, మధు, సంజయ్‌రెడ్డి, లక్ష్మి, దుర్గ, హోంగార్డు రాజులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఛానెల్ ఎండీని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement