బీఎస్‌ఈ ఐపీవోకి తొలి రోజు 50% సబ్‌స్క్రిప్షన్
దాదాపు రూ. 1,243 కోట్ల సమీకరణ కోసం బీఎస్‌ఈ తలపెట్టిన ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ఆఫర్ తొలి రోజున 50 శాతం సబ్‌స్క్రయిబ్ అయ్యింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) గణాంకాల ప్రకారం 54,30,204 షేర్లకు బిడ్స్ వచ్చాయి. జనవరి 25న ఐపీవో ముగియనుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లలో 86 శాతానికి, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) విభాగానికి 17 శాతం, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగానికి 12 శాతం బిడ్లు దాఖలయ్యాయి. బీఎస్‌ఈ ఐపీవో ధరల శ్రేణి రూ. 805–806గా ఉంది. రూ. 2 ముఖ విలువ గల 1.54 కోట్ల షేర్లను సంస్థ విక్రయిస్తోంది. ఈ షేర్లు ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ కానున్నాయి.