న్యూఢిల్లీ: ఎల్‌ఐసీ ఐపీవోకి వస్తున్న స్పందనను చూసి శని, ఆదివారాలు సైతం రిటైలర్లు దరఖాస్తు చేసుకునేందుకు ఎక్సేంజీలు, ఆర్‌బీఐ అనుమతించాయి. ఐపీవో దరఖాస్తుకు వీలుగా బ్యాంకుల అస్బా (ఏఎస్‌బీఏ) బ్రాంచీలు పనిచేయనున్నాయి. ఐపీవో ధరలో ఎల్‌ఐసీ పాలసీదారులకు రూ. 60, ఉద్యోగులు, రిటైలర్లకు రూ. 45 చొప్పున రాయితీని ప్రకటించిన విషయం విదితమే. ఇష్యూ ద్వారా 3.5 శాతం వాటాను విక్రయిస్తున్న ప్రభుత్వం రూ. 20,600 కోట్లవరకూ సమీకరించే యోచనలో ఉంది.
1:4 నిష్పత్తిలో
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ మూడో రోజు శుక్రవారాని(6)కల్లా పూర్తిగా సబ్‌స్క్రయిబ్ అయ్యింది. కంపెనీ దాదాపు 16.21 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా.. 22.37 కోట్ల షేర్లవరకూ బిడ్స్ దాఖలయ్యాయి. వెరసి 1.4 రెట్లు అధిక స్పందన లభించింది. షేరుకి రూ. 902–949 ధరలో చేపట్టిన ఇష్యూ సోమవారం(9న) ముగియనుంది. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 1.23 రెట్లు అధికంగా స్పందన నమోదైంది. అంటే 6.9 కోట్ల షేర్లకుగాను 8.53 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. ఇక పాలసీదారుల నుంచి 4 రెట్లు, ఉద్యోగుల నుంచి 3 రెట్లు అధికంగా స్పందన లభించింది. అయితే క్విబ్ విభాగంలో 76 శాతం, నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో 56% చొప్పున మాత్రమే బిడ్స్ దాఖలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment