Reports Says LIC IPO to Likely to Open on May 4 - Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీ అమ్మకంతో ఆరు లక్షల కోట్లు!

Apr 26 2022 7:01 PM | Updated on Apr 26 2022 7:25 PM

LIC IPO On May 04 - Sakshi

న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ వచ్చే నెల(మే) 4న ప్రారంభమయ్యే అవకాశముంది. ముందుగా వేసిన ప్రణాళికలు సవరిస్తూ తాజాగా దాఖలు చేసిన 3.5 శాతం ప్రభుత్వ వాటా విక్రయ ప్రాస్పెక్టస్‌కు సెబీ ఆమోదముద్ర వేసింది. దీంతో యాంకర్‌ ఇన్వెస్టర్లకు 2న షేర్లను జారీ చేయవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

తొలుత ప్రభుత్వం 5 శాతం వాటాను ఆఫర్‌ చేయాలని భావించిన సంగతి తెలిసిందే. వెరసి 3.5 శాతం వాటాకు సమానమైన 22 కోట్ల షేర్లను విక్రయించనుంది. తద్వారా రూ. 21,000 కోట్లు సమకూర్చుకునే వీలుంది. ప్రభుత్వం ఎల్‌ఐసీకి రూ. 6 లక్షల కోట్ల విలువను ఆశిస్తోంది. ఇష్యూ మే 9న ముగియనున్నట్లు అంచనా. 
 

చదవండి: చైనా నుంచి తెస్తామంటే ఒప్పుకోం ఎలన్‌మస్క్‌ - నితిన్‌ గడ్కారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement