భారత్‌లో క్రికెట్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇది మరింత పెరిగిందనే చెప్పాలి. అందుకే ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఈ రిచ్ లీగ్‌ను ప్రసార హక్కులు కోసం ఎగబడుతుంటాయి. ఈ ఏడాది ఐపీఎల్2023 స్ట్రీమింగ్ రైట్స్‌ను జియో సినిమా సొంత చేసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించడం, దాంతో పాటు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ల కారణంగా జియో సినిమా రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్ ( వీక్షకులు) సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా డిస్నీ+ హాట్‌స్టార్ తమ మొబైల్ వినియోగదారులు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
బంఫర్ ఆఫర్
ఈ పోటీ ప్రపంచంలో కార్పొరేట్ సంస్థలు హిట్ ఫార్ములాను అనుసరిస్తూ పోతుంటాయి. ఇటీవల ఐపీఎల్-2023 సీజన్‌ను రిలయన్స్ జియో ఆధీనంలోని ఓటీటీ ప్లాట్‌ఫామ్.. జియో సినిమాలో ఉచితంగా ప్రసారం చేయడం ద్వారా లక్షల మంది వీక్షకులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే బాటలో డిస్నీ హాట్‌స్టార్ కూడా నడవనుంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లను మొబైల్ ఫోన్‌లలో ఉచితంగా స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా తమ యూజర్ల సంఖ్యను మరింత పెంచుకోవాలని భావిస్తోంది.
ఇటీవల హాట్‌స్టార్ నుంచి ఐపీఎల్ ఇంటర్నెట్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న జియో..కేవలం యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు, రుసుము చెల్లించకుండా ప్రపంచ కప్ మ్యాచ్‌లను వీక్షించవచ్చని ప్రకటించింది. దీంతో ఐపీఎల్ టోర్నీ జరిగిన ఐదు వారాల్లో రికార్డు స్థాయిలో జియో సినిమా రికార్డు స్థాయిలో డిజిటల్ వీక్షకులను సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment