ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఓటీటీ యూజర్లకు భారీషాక్ ఇచ్చింది. ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భాగస్వామ్యంతో కొన్ని ఓటీటీ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను అందించింది. అయితే ఇప్పుడు ఆ ప్లాన్‌లను తొలగించినట్లు తెలుస్తోంది.
ప్రీపెయిడ్ ప్లాన్లను అక్టోబర్‌లో తొలగించిన జియో.. తాజాగా రూ.1499, రూ.4199 ప్రీపెయిడ్ ప్లాన్లను సంబంధిత ప్లాట్ ఫామ్ అన్నింటి నుంచి తొలగించింది. ఇప్పటికే ఈ ప్లాన్లు యాక్టీవేట్ యూజర్లు వినియోగించుకోవచ్చు. కానీ కొత్తగా ఆ ప్లాన్లు తీసుకోవాలనుకునే వారికి అందుబాటులో ఉండవని ఓటీటీ నివేదికలు చెబుతున్నాయి.
కాగా, జియో - డిస్నీప్లస్ హాట్ స్టార్ మధ్య కుదరిన ఓటీటీల ఒప్పందం నుంచి జియో ఎందుకు తొలగిందో చెబుతూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇన్నాళ్లు ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకుంటూ వచ్చిన డిస్నీ+హాట్‌స్టార్.. 2023 ఐపీఎల్ ప్రసార హక్కులను కోల్పోయింది. ఈసారి రిలయన్స్ గ్రూప్‌కే చెందిన వయాకామ్ 18 ఆ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే హాట్‌స్టార్ ప్లాన్లను జియో తొలగించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment