మహిళలు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 69 శాతం మంది ఎంపిక రియల్ ఎస్టేట్ కాగా, అందులోనూ నివాస గృహాలకు వారు మక్కువ చూపిస్తున్నారు. నోబ్రోకర్ సంస్థ 9,000 మంది మహిళలపై ఒక సర్వే నిర్వహించి, వివరాలు విడుదల చేసింది.
► 94 శాతం మంది ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటే, 6 శాతం మంది వాణిజ్య ఆస్తులపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్టు చెప్పారు.
► 80 శాతం మంది వినియోగం కోసమే ఇంటిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు.
► 73 శాతం మహిళలు రూ.40–75 లక్షల బడ్జెట్‌లోని ఇంటిని కొనాలనుకుంటున్నారు.
► 20 శాతం మంది రూ.75లక్షల నుంచి రూ.కోటి బడ్జెట్‌లోని ఇళ్ల పట్ల సుముఖంగా ఉన్నారు. మిగిలిన 7 శాతం మహిళలు రూ.కోటికి పైన ఉన్న ఇళ్ల కోసం చూస్తున్నారు.
► 63 శాతం మంది వినియోగానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు కోరుకుంటున్నారు.
► హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ–ఎన్‌సీఆర్, చెన్నై, ముంబై, పుణె నగరాలకు చెందిన మహిళలు ఈ సర్వేలో అభిప్రాయాలు వెల్లడించారు.
► గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ నిర్వహించిన సర్వే సైతం.. ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు గడిచిన ఏడాది కాలంలో ఆస్తుల నిర్మాణం, పెట్టుబడుల దృష్ట్యా ప్రాపర్టీ కొనుగోలుకు ప్రాధాన్యం ఇచ్చి నట్టు తెలిపింది. 34 శాతం మహిళలు కొత్త ఇల్లు కొనుగోలు మంచి పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారని, 52 శాతం మంది కొత్త ఇంటికి అన్వేషణ మొదలు పెట్టినట్టు వెల్లడించింది.
► పెట్టుబడులకు సంబంధించి స్క్రిప్‌బాక్స్ కూడా ఒక సర్వే నిర్వహించింది. డబ్బు అంశాలను మహిళలు స్వయంగా చూస్తున్నారని, ఆర్థిక నిర్ణయాల్లో 70 శాతం మహిళలు పాలుపంచుకుంటున్నారని తెలిపింది. కరోనా విపత్తులోనూ ప్రతి ఐదుగురిలో ఒక మహిళ మొదటి సారి పెట్టుబడులను ఆరంభించినట్టు పేర్కొంది.
‘రియల్టీ’కే మగువల ఓటు
Published Tue, Mar 8 2022 5:46 AM | Last Updated on Tue, Mar 8 2022 5:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment