inter national womensday.
-
‘రియల్టీ’కే మగువల ఓటు
మహిళలు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 69 శాతం మంది ఎంపిక రియల్ ఎస్టేట్ కాగా, అందులోనూ నివాస గృహాలకు వారు మక్కువ చూపిస్తున్నారు. నోబ్రోకర్ సంస్థ 9,000 మంది మహిళలపై ఒక సర్వే నిర్వహించి, వివరాలు విడుదల చేసింది. ► 94 శాతం మంది ఇంటిపై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటే, 6 శాతం మంది వాణిజ్య ఆస్తులపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్టు చెప్పారు. ► 80 శాతం మంది వినియోగం కోసమే ఇంటిని కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ► 73 శాతం మహిళలు రూ.40–75 లక్షల బడ్జెట్లోని ఇంటిని కొనాలనుకుంటున్నారు. ► 20 శాతం మంది రూ.75లక్షల నుంచి రూ.కోటి బడ్జెట్లోని ఇళ్ల పట్ల సుముఖంగా ఉన్నారు. మిగిలిన 7 శాతం మహిళలు రూ.కోటికి పైన ఉన్న ఇళ్ల కోసం చూస్తున్నారు. ► 63 శాతం మంది వినియోగానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు కోరుకుంటున్నారు. ► హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ–ఎన్సీఆర్, చెన్నై, ముంబై, పుణె నగరాలకు చెందిన మహిళలు ఈ సర్వేలో అభిప్రాయాలు వెల్లడించారు. ► గోద్రేజ్ హౌసింగ్ ఫైనాన్స్ నిర్వహించిన సర్వే సైతం.. ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు గడిచిన ఏడాది కాలంలో ఆస్తుల నిర్మాణం, పెట్టుబడుల దృష్ట్యా ప్రాపర్టీ కొనుగోలుకు ప్రాధాన్యం ఇచ్చి నట్టు తెలిపింది. 34 శాతం మహిళలు కొత్త ఇల్లు కొనుగోలు మంచి పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారని, 52 శాతం మంది కొత్త ఇంటికి అన్వేషణ మొదలు పెట్టినట్టు వెల్లడించింది. ► పెట్టుబడులకు సంబంధించి స్క్రిప్బాక్స్ కూడా ఒక సర్వే నిర్వహించింది. డబ్బు అంశాలను మహిళలు స్వయంగా చూస్తున్నారని, ఆర్థిక నిర్ణయాల్లో 70 శాతం మహిళలు పాలుపంచుకుంటున్నారని తెలిపింది. కరోనా విపత్తులోనూ ప్రతి ఐదుగురిలో ఒక మహిళ మొదటి సారి పెట్టుబడులను ఆరంభించినట్టు పేర్కొంది. -
ఆకాశంలో సగం.. అవకాశాల్లో ఎక్కడ?
ప్రస్తుతం కంపెనీలు.. పురుషులకు దీటుగా మహిళలకు కూడా అవకాశాలు కల్పించడంపై దృష్టి పెడుతున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. లీడర్షిప్ హోదాల్లోని మహిళలకు వేతనాలపరంగా సరిగ్గా న్యాయం జరగడం లేదు. కన్సల్టెన్సీ సంస్థ మెర్సర్ 2021 టోటల్ రెమ్యూనరేషన్ సర్వే (టీఆర్ఎస్)లో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం ఎంట్రీ స్థాయి ఉద్యోగాల్లో పురుషుల వేతనాలతో పోలిస్తే మహిళా ఉద్యోగుల జీతభత్యాలు 95–99 శాతం స్థాయిలో ఉంటున్నాయి. కానీ మధ్య, సీనియర్ స్థాయుల్లోకి వచ్చేటప్పటికీ ఈ వ్యత్యాసం గణనీయంగా పెరుగుతోంది. వారి వేతనాలు .. పురుష ఉద్యోగులతో పోలిస్తే 87–95 శాతం స్థాయికే పరిమితం అవుతున్నాయి. కంపెనీ లాభాల్లో కీలక పాత్ర పోషించే హోదాల్లో మహిళల ప్రాతినిధ్యం అంతంత మాత్రంగా ఉండటం, ఎదిగే అవకాశాలు .. ప్రమోషన్ల ప్రక్రియ నెమ్మదిగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. 900 పైగా కంపెనీలు, 5,700 పైచిలుకు హోదాలు, మొత్తం మీద 14 లక్షల ఉద్యోగుల డేటా ఆధారంగా ఈ సర్వేను నిర్వహించారు. ఎంట్రీ లెవెల్లో ప్రాతినిధ్యం ఓకే.. సాంకేతిక రంగంలో ఎంట్రీ స్థాయిలో మహిళల ప్రాతినిధ్యం 43 శాతంగా ఉంది. కానీ అదే మేనేజర్ స్థాయికి వచ్చే సరికి 12–17 శాతానికి పడిపోగా.. ఇక ఎగ్జిక్యూటివ్ స్థాయికి వచ్చేసరికి మరింత తగ్గిపోయి 4–8 శాతానికే పరిమితమైంది. ఐటీ, కస్టమర్ సర్వీస్, ఇంజినీరింగ్.. సైన్స్, మానవ వనరులు, డేటా అనలిటిక్స్ .. బిజినెస్ ఇంటెలిజెన్స్ మొదలైన విభాగాల్లో మహిళల ప్రాతినిధ్యం మెరుగ్గా ఉంటోంది. మరోవైపు, లీగల్, ఆడిట్.. సేల్స్, మార్కెటింగ్.. ప్రోడక్ట్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో చాలా తక్కువగా ఉంటోంది. ఉద్యోగుల విషయంలో కంపెనీలు వైవిధ్యానికి కట్టుబడి ఉన్నామని చెబుతున్నప్పటికీ .. జవాబుదారీతనం లేకపోవడం వల్ల అంతర్గతంగా దీనికి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని మెర్సర్ సీనియర్ ప్రిన్సిపల్ మాన్సీ సింఘాల్ తెలిపారు. పని ప్రదేశాల్లో మహిళల ఉద్యోగావకాశాలు, భద్రత, జీతభత్యాలను మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన కొత్త కార్మిక చట్ట నిబంధనలు స్వాగతించతగ్గవే అయినప్పటికీ కంపెనీలు ఈ దిశగా చురుగ్గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంస్థలకు విలువను జోడించే కీలక హోదాల్లో మహిళల పాత్ర పెరిగే కొద్దీ లింగ సమానత్వాన్ని సాధించడం సాధ్యమేనని తెలిపారు. -
టెక్నాలజీ వ్యాపారవేత్తలుగా మహిళలు
న్యూఢిల్లీ: మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర నగరాల్లోని మహిళలు ఎక్కువగా టెక్నాలజీ వ్యాపారవేత్తలుగా మారడంపై ఆసక్తిగా ఉన్నారు. అయితే, సాంకేతిక వనరులు, మౌలిక సదుపాయాల కొరత, దిశానిర్దేశం చేసే మెంటార్లు దొరక్కపోవడం వారికి ప్రధాన అవరోధంగా ఉంటోంది. టెక్నాలజీ అనలిటిక్స్ సంస్థ టెక్ఆర్క్, మహిళల ప్లాట్ఫామ్ షీట్వర్క్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయాయి. దీని ప్రకారం నాన్–మెట్రో నగరాల్లోని మహిళల్లో దాదాపు 48 శాతం మంది .. తమ కెరియర్ ఆప్షన్గా టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిప్ను ఎంచుకోవడంపై ఆసక్తిగా ఉన్నారు. మెట్రో నగరాల్లో తమ సొంత వెంచర్లను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారి సంఖ్య 23 శాతం మాత్రమే ఉంది. మెట్రో నగరాల్లోని మహిళలు.. సౌకర్యవంతమైన కెరియర్ కోసం ఎక్కువగా కార్పొరేట్ ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు. ‘భారత్లో మహిళా టెక్ ఎంట్రప్రెన్యూర్షిప్ స్థితిగతులు‘ అనే అంశంపై దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో 2,000 మంది పైచిలుకు పాల్గొన్నారు. వీరిలో ప్రొఫెషనల్స్, విద్యార్థులు, స్టార్టప్ల వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఐఐటీల్లో పెరిగిన విద్యార్థినులు.. ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో విద్యార్థినుల సంఖ్య గడిచిన నాలుగేళ్లలో గణనీయంగా పెరిగింది. అప్పట్లో ఇది కేవలం 5 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 16 శాతానికి చేరింది. కానీ వీరంతా సొంతంగా టెక్ కంపెనీలను ప్రారంభించే దిశగా వెళ్లడం లేదు. ‘మెట్రోయేతర నగరాల్లోని 73 శాతం మంది మహిళలు .. అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే .. తాము ఎంట్రప్రెన్యూర్షిప్ను ఎంచుకోలేకపోతున్నామని తెలిపారు. మెట్రోల్లో 22 శాతం మంది మహిళలు భౌతిక ఇన్ఫ్రా కొరత తమకు సమస్యగా ఉంటోందని పేర్కొన్నారు‘ అని నివేదిక వెల్లడించింది. ఇక పురుషులతో పోలిస్తే నిధులు సమీకరించడం, పెట్టుబడులను సమకూర్చుకోవడం కష్టతరంగా ఉంటోందని సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది చెప్పారు. ‘విద్యావంతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సంబంధిత వ్యాపార, సాంకేతిక వనరులు పరిమిత స్థాయిలోనే ఉండటమనేది వారి వెంచర్లను విస్తరించడంలో అవరోధంగా ఉంటోంది. టెక్నాలజీ కొరత ప్రధాన సవాలుగా ఉంటోందని మెట్రోయేతర నగరాల్లోని 74 శాతం మంది తెలిపారు. మహిళా వ్యాపారవేత్తలు తమ వెంచర్లలో విజయం సాధించాలంటే టెక్నాలజీ అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని మెట్రో నగరాల్లో 24 శాతం మంది చెప్పారు‘ అని నివేదిక పేర్కొంది. -
నటి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
మహిళలపై వేధింపులకు నిరసనగా సంతకాల సేకరణ: వరలక్ష్మీ చెన్నై: మహిళా దినోత్సవం పురస్కరించుకుని శ్రీశక్తి నినాదంతో నటి వరలక్ష్మి శరత్ కుమార్ బుధవారం ఉదయం చెన్నైలో సంతకాల ఉద్యమం ప్రారంభించారు. చెన్నైలోని వల్లువర్ జొట్టం వద్ద ప్రారంభించిన ఈ సంతకాల సేకరణ సాయంత్రం ఐదు వరకు కొనసాగుతుందని ఆమె తెలిపారు. ఇటీవల సినిమా తారలపై లైంగిక వేధింపుల ఘటనల సందర్బంగా వారికి మద్దతుగా గొంతెత్తిన ఆమె తాను కూడా వేధింపులకు గురైనట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో వేధింపులకు గురవురున్న మహిళలకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో శ్తీశక్తి పేరుతో ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మహిళా దినోత్సవం సందర్బంగా తన మద్దతుదారులతో సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టింది. ఈ సంతకాల సేకరణ ఉద్యమం స్త్పూర్తితో శ్రీశక్తిని భవిష్యత్తులో మహిళలకు అండగా నిలిచే సంస్థగా తీర్చిదిద్దుతామని వరలక్షీ తెలిపారు.