నటి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ | sreesakthi Collected signatures | Sakshi
Sakshi News home page

నటి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

Published Wed, Mar 8 2017 11:24 AM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM

sreesakthi Collected signatures

మహిళలపై వేధింపులకు నిరసనగా సంతకాల సేకరణ: వరలక్ష్మీ
చెన్నై: మహిళా దినోత్సవం పురస్కరించుకుని శ్రీశక్తి నినాదంతో నటి వరలక్ష్మి శరత్ కుమార్ బుధవారం ఉదయం చెన్నైలో సంతకాల ఉద్యమం ప్రారంభించారు. చెన్నైలోని వల్లువర్ జొట్టం వద్ద ప్రారంభించిన ఈ సంతకాల సేకరణ సాయంత్రం ఐదు వరకు కొనసాగుతుందని ఆమె తెలిపారు.
 
ఇటీవల సినిమా తారలపై  లైంగిక వేధింపుల ఘటనల సందర్బంగా వారికి మద్దతుగా గొంతెత్తిన ఆమె తాను కూడా వేధింపులకు గురైనట్లు సంచలన ప్రకటన చేశారు. దీంతో వేధింపులకు గురవురున్న మహిళలకు అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో శ్తీశక్తి పేరుతో ఓ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మహిళా దినోత్సవం సందర్బంగా తన మద్దతుదారులతో సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టింది. ఈ సంతకాల సేకరణ ఉద్యమం స్త్పూర్తితో శ్రీశక్తిని భవిష్యత్తులో మహిళలకు అండగా నిలిచే సంస్థగా తీర్చిదిద్దుతామని వరలక్షీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement