ఆరు, ఏడు తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం | Admission for residential schools | Sakshi
Sakshi News home page

ఆరు, ఏడు తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Published Tue, Jul 19 2016 11:23 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

Admission for residential schools

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలోని కాల్వబుగ్గ, పత్తికొండ, కర్నూలు మైనార్టీ బాలురు, బనవాసి కర్నూలు మైనార్టీ బాలికల పాఠశాలల్లో ఆరు,ఏడు తరగతుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్‌ ప్రిన్సిపాల్‌ ఉబేదుల్లా మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. దరఖాస్తులను సమీపంలోని గురుకుల పాఠశాలలో పొందవచ్చని, పూరించిన దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాలను జతపరచి ఈ నెల 30వ తేదీలోపు కర్నూలులోని ఏపీ ఉర్దూ గురుకుల పాఠశాలలో అందజేయాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆగస్టు 10వ తేదీఉదయం పది గంటలకు ఏపీ ఉర్దూ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.
ఖాళీల వివరాలు : 
6వ తరగతి బాలురు–ఓసీ–6, బీసీఏ–3, బీసీబీ–2, బీసీడీ–4, బీసీఈ–1, ఎస్సీ–7,ఎస్టీ–4. సైనికోద్యోగుల పిల్లలు–2, అనాథలు–2
6వ తరగతి బాలికలు : ఓసీ–2, ఎస్సీ–8
7వ తరగతి బాలురు : ఓసీ–2, బీసీబీ–1, ఎస్సీ–2
7వ తరగతి బాలికలు : ఓసీ–1, ఎస్సీ–3
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement