పెట్టుబడికి సరైన ప్రాంతం  త్రిబుల్‌ ఆర్‌!  | Rght area to invest in the trick! | Sakshi
Sakshi News home page

పెట్టుబడికి సరైన ప్రాంతం  త్రిబుల్‌ ఆర్‌! 

Published Sat, Nov 24 2018 12:36 AM | Last Updated on Sat, Nov 24 2018 12:36 AM

Rght area to invest in the trick! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ చుట్టూ 158 కి.మీ.లు ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ఉంది. దీని చుట్టూ సుమారు 330 కి.మీ. మేర రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌– త్రిబుల్‌ ఆర్‌) ఉంటుంది. ఓఆర్‌ఆర్‌కు, త్రిబుల్‌ ఆర్‌కు మధ్య 20–30 కి.మీ. దూరం ఉంటుంది. భువనగిరి, చౌటుప్పల్, యాచారం, కందుకూరు, షాద్‌నగర్, కంది, సంగారెడ్డి, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జగ్‌దేవ్‌పూర్‌ మీదుగా  త్రిబుల్‌ ఆర్‌ నిర్మాణం ఉంటుంది. ఓఆర్‌ఆర్‌తో పాటూ నగరంలోని 10 ప్రధాన రహదారులు త్రిబుల్‌ ఆర్‌తో అనుసంధానమై ఉంటాయి. 

త్రిబుల్‌ ఆర్‌ ఎలా ఉండాలంటే? 
రీజినల్‌ రింగ్‌ రోడ్డులో ఇంటిగ్రేటెడ్‌ ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్స్, వేర్‌హౌస్‌లను అభివృద్ధి చేయాలి. దీంతో నివాస గృహాలతో పాటూ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వినోద కేంద్రాలు, రిటైల్, షాపింగ్‌ మాల్స్‌ వస్తాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే కొత్త హైదరాబాద్‌ అభివృద్ధి అంతా త్రిబుల్‌ ఆర్‌ కేంద్రంగానే ఉంటుంది. దీంతో ప్రధాన నగరం మీద ఒత్తిడి తగ్గుతుంది. త్రిబుల్‌ ఆర్‌కు సమీపంలో ఉన్న జిల్లా కేంద్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తే ఆయా జిల్లాల అభివృద్ధితో పాటూ హైదరాబాద్‌కు వలసలు తగ్గుతాయి. దీంతో నగరంలో కాలు ష్యం, మౌలిక వసతుల వినియోగం తగ్గుతుంది. 

► ఇప్పటికే త్రిబుల్‌ ఆర్‌ ప్రాంతాల్లో మానవ నిర్మిత అడవుల (మ్యాన్‌ మేడ్‌ ఫారెస్ట్‌) ప్రాజెక్ట్‌ కల్చర్‌ ప్రారంభమైందని ఓ డెవలపర్‌ తెలిపారు. ఇదేంటంటే.. సెలబ్రిటీలు, వ్యాపారస్తులు వాళ్ల పిల్లలకు పుట్టిన రోజు లేదా ఇతరత్రా ప్రత్యేక సంద ర్భాల్లో శివారు ప్రాం తాల్లో మ్యాన్‌ మేడ్‌ ఫారెస్ట్‌లను బహు మతిగా ఇస్తుంటారు. అహ్మదాబాద్, బెంగళూరు నగరాల్లో ఈ ట్రెండ్‌ ప్రారంభమైందని.. ఒక్కో ఫారెస్ట్‌ సుమారు వెయ్యి చ.అ.ల్లో ఉంటుం దని ఆయన తెలిపారు. 

అభివృద్ధి ఎక్కడ ఉంటుందంటే... 
త్రిబుల్‌ ఆర్‌తో రియల్‌ అభివృద్ధి మూడు మార్గాల్లో కేంద్రీకృతమై ఉంటుంది. 
► ఓఆర్‌ఆర్, త్రిబుల్‌ ఆర్‌ మధ్య ఉండే 20–30 కి.మీ. మార్గం 
►  త్రిబుల్‌ ఆర్‌ ఉన్న రాష్ట్ర, జాతీయ రహదారులకు రెండు వైపులా 5 కి.మీ. వరకు 
►  త్రిబుల్‌ ఆర్‌కు సమీపంలో ఉన్న జిల్లా కేంద్రంలో అభివృద్ధి ఉంటుంది. 

ఎకరం రూ.20 లక్షలు.. 
ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రతిపాదన సమయంలో స్థలాలు కొనలేదని నిరాశ చెందిన పెట్టుబ డిదారులకు ఇప్పుడు రీజినల్‌ రింగ్‌ రోడ్డు రూపంలో మరొక అవకాశం వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. త్రిబుల్‌ ఆర్‌ పరిధిలో ఎకరం ప్రారంభ ధర రూ.20 లక్షలుంది. వరంగల్, బెంగళూరు జాతీయ రహదారిలో ఇప్పటికే త్రిబుల్‌ ఆర్‌ వరకూ రియల్‌ వెంచర్లు, గృహాలతో అభివృద్ధి కనిపిస్తుంది. దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్రిబుల్‌ ఆర్‌లో స్థలాలను కొనుగోలు చేయాలని, మంచి ఆదాయ వనరుగా మారుతుందని గిరిధారి కన్‌స్ట్రక్షన్స్‌ సీఎండీ ఇంద్రసేనా రెడ్డి అభిప్రాయపడ్డారు. క్లియర్‌ టైటిల్, నీటి వనరులు, రహదారి కనెక్టివిటీ ఉండాలే చూసుకోవాలని సూచించారు. 

300 ఎకరాల్లో గోల్ఫ్‌ కోర్స్‌ 
త్రిబుల్‌ ఆర్‌ రహదారికి చేరువలో తూఫ్రాన్‌లో నగరానికి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ గోల్ఫ్‌ కోర్స్‌ను నిర్మించేందుకు ప్రణాళిక చేస్తోంది. 300 ఎకరాల్లో రానున్న ఈ ప్రాజెక్ట్‌ను ఏడాదిలో ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధి ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. జాయింట్‌ వెంచర్‌గా చేయనున్న ఈ ప్రాజెక్ట్‌కు ఆస్ట్రేలియా కన్సల్టెన్సీ డిజైన్స్‌ను అభివృద్ధి చేస్తోంది.

శ్రీ సిటీలా అభివృద్ధి చేయాలి
త్రిబుల్‌ ఆర్‌   ప్రాంతా ల్లోని స్థలాలను ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్, ఎడ్యుకేషనల్, కమర్షియల్, రిక్రియేషనల్‌.. ఇలా బహుళ వినియోగ జోన్లుగా ప్రకటించాలి. అప్పుడే ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో రాష్ట్రమంతా సమాంతర పట్టణీకరణ అభివృద్ధి జరుగుతుంది. ఉదాహరణకు.. ప్రత్యేక జోన్ల కేటాయింపుతో శ్రీ సిటీలోకి విదేశీ కంపెనీలు వచ్చాయి. పైగా శ్రీ సిటీ నిర్వహణ బాధ్యత కూడా ఇండస్ట్రియల్‌ ఏరియా లోకల్‌ అథారిటీది. మౌలిక వసతుల అభివృద్ధి మాత్రమే కాకుండా నాణ్యమైన పనివాళ్ల సమీకరణ కూడా దీనిదే. 6 రాష్ట్రాలను కలుపుతూ నిర్మించిన ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కూడా అంతే! వీటిని ఆదర్శంగా తీసుకొని ఓఆర్‌ఆర్, త్రిబుల్‌ ఆర్, జిల్లా కేంద్రాలను వినియోగించుకోవాలి.
– సి. శేఖర్‌రెడ్డి, క్రెడాయ్‌ మాజీ జాతీయ అధ్యక్షుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement