నాణ్యమైన భోజనం అందించాలి
కోటగిరి : మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి షఫీఉల్లా అన్నారు. బుధవారం సాయంత్రం కోటగిరి మండలకేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల భవనంలో చేపట్టిన మరమ్మత్తు పనులను త్వరలో పూర్తిచేయాలని అధ్యాపకులకు సూచించారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న మూత్రశాలలు, పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలలో మౌళిక వసతులు కల్పించాలని నిర్వాహకులకు ఆదేశించారు. ఏ క్షణంలోనైనా వస్తానని, లోటుపాట్లు కనిపిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట పలువురు నాయకులు,ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.