నైట్‌ఫ్రాంక్ ఇండియా తాజాగా విడుదల చేసిన డేటాలో హైదరాబాద్‌లో రెసిడెన్షియల్ సేల్స్ వృద్ధి గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. జూన్ 2024లో రూ. 4288 కోట్ల విలువైన గృహాలు అమ్ముడైనట్లు నివేదిక ద్వారా తెలిసింది. అమ్మకాల పరంగా వార్షిక వృద్ధి 48 శాతం కాగా, నెలవారీ వృద్ధి 14 శాతంగా నమోదైంది.
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి ప్రాంతాల్లో ఇళ్ల విక్రయాలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 జనవరి నుంచి హైదరాబాద్‌లో మొత్తం 39220 రెసిడెన్షియల్ ప్రాపర్టీల రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ఇది 2023 మొదటి ఆరు నెలల్లో పోలిస్తే 15 శాతం ఎక్కువ.
జూన్ 2024లో 50 లక్షల రూపాయలకంటే తక్కువ ధర కలిగిన కేటగిరీలో ఎక్కువ రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఈ అమ్మకాలు 2023 కంటే 10 శాతం తక్కువ. రూ. 1 కోటి, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్‌లు జూన్ 2024లో 14 శాతం పెరిగాయి. ఇందులో గృహాల కొనుగోలు కాకుండా.. ఆస్తుల కొనుగోలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జూన్ 2024లో, హైదరాబాద్‌లో నమోదైన ఆస్తులలో ఎక్కువ భాగం 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల కేటగిరి ఉంది. ఈ అమ్మకాలు కూడా 2023 కంటే తక్కువ. అయితే 2000 చదరపు అడుగుల ఆస్తుల విక్రయాలు పెరిగాయి. వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. వీటి రిజిస్ట్రేషన్స్ 2024లో 14 శాతంగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment