consultant
-
ఆర్థిక శాఖలో ఆరుగురు కన్సల్టెంట్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలన అంటేనే కన్సల్టెంట్లు.. విదేశీ సంస్థలకు వందల కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టడమనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా కన్సల్టెంట్ల రాజ్యానికి చంద్రబాబు సర్కారు గేట్లు తెరిచింది. ఆర్థికశాఖలో ఆరుగురు కన్సల్టెంట్లను నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు విధానంలో ఏడాదిపాటు ఆర్థిక శాఖ కార్యదర్శులకు సహాయకులుగా ఈ కన్సల్టెంట్లు పని చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.వారికి నెలకు రూ.55 వేల నుంచి రూ.2.75 లక్షల వరకు వేతనాలు ఇవ్వనున్నట్లు తెపారు. డేటా విశ్లేషణ, విధాన పరిశోధన, పీపీపీ ప్రాజెక్టులు, చట్టపరమైన విషయాల్లో ఈ కన్సల్టెంట్లు సహాయకులుగా పనిచేయనున్నారు. కాగా, ఇప్పటికే ఏపీ సీఆర్డీఏలో 68 మంది కన్సల్టెంట్ల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కన్సల్టెంట్లకు రెండు, మూడేళ్లలో రూ.70.64 కోట్లు చెల్లించనున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. -
సీఆర్డీఏలో మళ్లీ కన్సల్టెంట్ల రాజ్యం
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలన అంటేనే కన్సల్టెంట్లు, విదేశీ సంస్థలకు వందల కోట్లు దోచిపెట్టడమనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు గత పాలనంతా కన్సల్టెంట్ల మయం. ఇప్పుడూ అదే జరుగుతోంది. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)లోనూ కన్సల్టెంట్ల రాజ్యానికి గేట్లు తెరుచుకున్నాయి. అభివృద్ధి పనుల కోసం ప్రోగ్రామ్ మేనేజ్మెంట్కు, అమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ఇలా రెండు రకాల కన్సల్టెంట్ల కోసం సీఆర్డీఏ వేర్వేరుగా రెండు ప్రతిపాదనలను ఆహ్వానించింది. ఈ కన్సల్టెంట్లకు రూ.70.64 కోట్లు చెల్లించనున్నట్లు వెల్లడించింది.ఇందులో అభివృద్ధి పనుల ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కింద 63 మందికి రెండేళ్లలో రూ.62.36 కోట్లు చెల్లిస్తారు. అమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగం భాగసామ్యాన్ని ప్రోత్సహించేందుకు నియమితులయ్యే ఐదుగురు కన్సల్టెంట్లకు మూడేళ్లలో రూ.8.28 కోట్లు చెల్లించనున్నట్లు సీఆర్డీఏ పేర్కొంది. ఒక్కో కన్సల్టెంట్‌కు నెలకు రూ. 2 అక్షల నుంచి రూ. 5 లక్షల వరకు చెల్లించనున్నట్లు ప్రతిపాదనల ఆహ్వాన పత్రంలో సీఆర్డీఏ తెలిపింది. పనుల్లో నాణ్యత, సాంకేతికతకు ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్లు సహకారం అందిస్తారు.పనుల కాల వ్యవధిని ఏకీకృతం చేయడం, సమయానికి పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించడం, గడువులోగా బడ్జెట్ విడుదల ప్రణాళికను వీరు రూపొందిస్తారు. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధులతో అమలు చేసే కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, పురోగతి నివేదికలను సమర్పించాలి. పనులకు అవసరమైన మెటీరియల్ సేకరణ కోసం ఐటీ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయాలి. పర్యావరణ, సామాజిక పర్యవేక్షణ, ఆస్తి నిర్వహణ కార్యకలాపాలను నిర్వహించడం వీరి విధులని సీఆర్డీఏ తెలిపింది.ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం కోసంఅమరావతి ఆర్థికాభివృద్ధిలో ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేయడం, ప్రపంచంలో అగ్రశ్రేణి పెట్టుబడి గమ్యస్థానంగా రాజధానిని బ్రాండింగ్, ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మార్కెటింగ్, ఔట్రీచ్ వ్యూహం అమలు వీరి విధి. ప్రభుత్వ, ప్రైవేటు ఆర్థిక వనరుల వినియోగంతోపాటు, ప్రైవేటు రంగాన్ని ప్రభావితం చేయడానికి పీపీపీ విధానంలో వినూత్న ఆర్థిక విధానాలతో పెట్టుబడులను తేవాలి. పారిశ్రామిక రంగంలో పోటీతత్వ పెట్టుబడి వాతావరణాన్ని సృష్టించాలి. ఆర్థిక అభివృద్ధి వ్యూహం ఆధారంగా రోడ్ మ్యాప్‌ను రూపొందించాలి. ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాల కోసం అవసరమైన నిధులు, పద్ధతులను గుర్తించి, వీటి అమలుకు వ్యూహాన్ని అభివృద్ధి చేయాలని సీఆర్డీఏ ఆ పత్రంలో పేర్కొంది. -
శ్రీలంక కన్సల్టెంట్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్
శ్రీలంక కన్సల్టెంట్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ నీల్ మెక్కెంజీ నియమితుడయ్యాడు. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నిమిత్తం శ్రీలంక క్రికెట్ బోర్డు మెక్కెంజీని అపాయింట్ చేసింది. మెక్కెంజీ నవంబర్ 13-21 మధ్యలో శ్రీలంక జట్టుతో జాయిన్ అవుతాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ నవంబర్ 27న డర్బన్ వేదికగా మొదలవుతుంది. రెండో మ్యాచ్ డిసెంబర్ 5-9 వరకు గెబెర్హా వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే శ్రీలంకకు ఈ సిరీస్ చాలా కీలకం. అందుకే ఆ జట్టు స్థానికుడైన మెక్కెంజీ కన్సల్టెంట్ కోచ్‌గా నియమించుకుంది. మెక్కెంజీ దక్షిణాఫ్రికాలోని పిచ్‌ల పరిస్థితులపై లంక ఆటగాళ్లకు అవగాహణ కల్పిస్తాడు. సౌతాఫ్రికాలో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే విషయంలో మెక్కెంజీ లంక ప్లేయర్లకు శిక్షణ ఇస్తాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా మెక్కెంజీ అనుభవం లంక ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈఓ ఆష్లే డిసిల్వ తెలిపారు.48 ఏళ్ల మెక్కెంజీ గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌కు సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా పని చేశాడు. మెక్కెంజీ ఈ ఏడాది ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు. మెక్కెంజీ 2000-2009 మధ్యలో సౌతాఫ్రికా తరఫున 124 మ్యాచ్‌లు ఆడి (మూడు ఫార్మాట్లలో) దాదాపు 5000 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మెక్కెంజీకి ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. దేశవాలీ క్రికెట్లో మెక్కెంజీ దాదాపు 20000 పరుగులు చేశాడు.దక్షిణాఫ్రికాతో ప్రీ సిరీస్ క్యాంప్‌కు శ్రీలంక జట్టు..ధనంజయ డి సిల్వా, దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమల్, లహిరు కుమార, ప్రభాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, మిలన్ రత్నాయకే, కసున్ రజిత, లసిత్ ఎంబుల్దెనియా. -
ఖమ్మం మహిళకు అమెరికాలో కీలక బాధ్యతలు
ఖమ్మం అర్బన్: ఖమ్మం నగరానికి చెందిన రామసహాయం బుచ్చిరెడ్డి, నిర్మల దంపతుల కుమార్తె రామసహాయం రాధిక అమెరికాలోని కొలంబస్లో ఉంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. కాగా, రాధికను అమెరికాలో ఒహాయో రాష్ట్ర మైనార్టీ డెవలప్మెంట్ ఫైనాన్స్ అడ్వయిజరీ బోర్డు సలహాదారుగా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ శనివారం ఉత్తర్వులు ఇచ్చారని ఆమె తండ్రి బుచ్చిరెడ్డి తెలిపారు.రాధికకు మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన రఘురాంరెడ్డితో 2006లో వివాహం జరగగా, ఆయనతోపాటు అమెరికా వెళ్లారు. అక్కడ ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా చేరి అంచెలంచలుగా కంపెనీలో డైరెక్టర్ స్థాయికి చేరుకున్నారు. 2009 నుంచి వివిధ కంపెనీల్లో ఉన్నత హోదాల్లో పనిచేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో రాధికకు ఈ అవకాశం వచ్చిందని బుచ్చిరెడ్డి తెలిపారు. 2026 వరకు అమె ఈ పదవిలో కొనసాగుతారని చెప్పారు. -
చంద్రబాబు సర్కార్.. మళ్లీ కన్సల్టెంట్ల రాజ్యం
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలన అంటే కన్సల్టెంట్లు, విదేశీ సంస్ధలకు రూ.వందల కోట్లు దోచిపెట్టడం అనేది అందరికీ తెలిసిందే. తాజాగా కన్సల్టెంట్ల రాజ్యం తిరిగి ప్రారంభమైంది. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు 11మంది కన్సల్టెంట్లతో ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్‌ను రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (ఏపీఎస్డీపీఎస్)లో ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్‌కు కేపీఎంజీని ఏజెన్సీగా ఎంపిక చేశారు. ఇందులో ఒక టీం లీడర్‌తోపాటు 10 మంది కన్సల్టెంట్లను తీసుకోనున్నారు. ఇందుకోసం 8 నెలలకు రూ.3.28 కోట్లు చెల్లించనున్నారు. అవసరాన్ని బట్టి కన్సల్టెంట్ల కాల వ్యవధిని మరింత పెంచనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక ప్రణాళిక, స్థూల ఆర్థిక వ్యవస్థ ద్వారా రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికకు ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ అవసరమైన సహాయం అందిస్తుంది.వనరుల సమీకరణతోపాటు కేటాయింపులు, సంస్థాగతంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడంపై పర్యవేక్షణ, డేటా విశ్లేషణ, పరిశోధన వంటి పనులను కన్సల్టెంట్లు నిర్వహిస్తారు. అలాగే ఆదాయం పెంపుదల, వ్యయ నిర్వహణకు కన్సల్టెంట్లు అవసరమైన సహకారం అందిస్తారు. వ్యూహాత్మక పెట్టుబడులు, స్థూల ఆర్థిక పరిశోధన, ఆర్థిక విశ్లేషణకు చెందిన డేటాను రూపొందించనున్నారు. ఆదాయ మార్గాలను పెంచడంతోపాటు ఆర్థిక నిర్వహణను మెరుగుపరచడం, ఆర్థిక క్రమశిక్షణకు అవసరమైన విధానాలను ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ రూపొందించనుంది. -
Vestian: హౌసింగ్‌లో భారీగా సంస్థాగత పెట్టుబడులు
న్యూఢిల్లీ: నివాస రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల (ఇనిస్టిట్యూషనల్) పెట్టుబడులు సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో భారీగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన పెట్టుబడులు 174 మిలియన్ డాలర్లు (రూ.1,444 కోట్లు)తో పోల్చి చూస్తే, 71 శాతం వృద్ధితో 298 మిలియన్ డాలర్లు (రూ.2,473కోట్లు)గా నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. భారత రియల్ ఎస్టేట్ పరిశ్రమ మొత్తం మీద సెపె్టంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 679.9 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించినట్టు ఈ నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచి్చన 374 మిలియన్ డాలర్లతో పోల్చి చూసినప్పుడు 82 శాతం వృద్ధి నమోదైంది. అగ్రగామి సంస్థలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయాలని కోరుతున్నాయని వెస్టియన్ సీఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఇది ఆఫీస్ వసతులకు డిమాండ్‌ను పెంచుతుందన్నారు. ఫలితంగా రానున్న త్రైమాసికాల్లో పెట్టుబడులు పెరగొచ్చని అంచనా వేశారు. సెపె్టంబర్ త్రైమాసికంలో వచ్చిన సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో 71 శాతం దేశీ ఇన్వెస్టర్లు సమకూర్చినవి. విదేశీ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 27 శాతం పెట్టుబడులు వచ్చాయి. సెపె్టంబర్ క్వార్టర్లో అత్యధికంగా ఇనిస్టిట్యూషనల్ పెట్టుబడులను నివాస ప్రాజెక్టులే దక్కించుకున్నాయి. వీటి వాటా 44 శాతంగా ఉంది. వాణిజ్య రియల్ ఎస్టేట్ ఆస్తుల్లోకి 24 శాతం పెట్టుబడులు వెళ్లాయి. ఆఫీస్ ఆస్తులు 164 మిలియన్ డాలర్లు, ఇండ్రస్టియల్ వేర్‌హౌసింగ్ ఆస్తులు 190 మిలియన్ డాలర్ల చొప్పున సంస్థాగత పెట్టుబడులను ఆకర్షించాయి. -
జనసేన బి ఫారం చెల్లదట..!
-
త్రిపుర క్రికెట్లో ప్రొటీస్ మాజీ ఆల్‌రౌండర్‌కు కీలక పదవి
దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ లాన్స్ క్లూసెనర్ త్రిపుర క్రికెట్లో కీలక బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ శనివారం(జూన్ 3న) త్రిపుర క్రికెట్ కన్సల్టెంట్ పదవిని స్వీకరించనున్నాడు. ఇప్పటికే అగర్తల చేరుకున్న క్లూసెనర్ రానున్న దేశవాలీ క్రికెట్ సీజన్లో భాగంగా త్రిపుర క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా ఉండనున్నాడు. త్రిపుర జట్టు కన్సల్టెంట్‌గా లాన్స్ క్లూసెనర్ తొలుత 100 రోజుల సీజన్‌కు అందుబాటులో ఉంటాడని.. 20 రోజులు అగర్తల క్యాంప్‌లో ఉండి జట్టును పర్యవేక్షిస్తాడని త్రిపుర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ తిమిర్ చందా పేర్కొన్నాడు. కాగా కన్సల్టెంట్ పోస్టుకు మా వెబ్సైట్లో ఒక ప్రకటన చేశాం. ఈ పదవి చేపట్టేందుకు డేవ్ వాట్మోర్ సహా లాన్స్ క్లూసెనర్లు ఆసక్తి చూపించారు. అయితే వ్యక్తిగత కారణాల రిత్యా డేవ్ వాట్మోర్ రేసు నుంచి తప్పుకోవడంతో లాన్స్ క్లూసెనర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం అంటూ చెప్పకొచ్చాడు. కాగా కొన్నేళ్ల క్రితం తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఒక ఫ్రాంచైజీకి క్లూసెనర్ ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. ఇక అంతర్జాతీయంగా 1996 నుంచి 2004 వరకు దక్షిణాఫ్రికా తరపున ఆడిన క్లూసెనర్ 49 టెస్టుల్లో 1906 పరుగులతో పాటు 80 వికెట్లు, 171 వన్డేల్లో 3576 పరుగులతో పాటు 192 వికెట్లు పడగొట్టాడు. తన కెరీర్లో ఎక్కువగా లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ వచ్చిన క్లూసెనర్ మెరుపు ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. దీనికి తోడు తన బౌలింగ్‌తోనూ ప్రొటిస్‌కు చాలా మ్యాచ్‌ల్లో విజయాలు అందించి మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. ఇక 1999 వన్డే వరల్డ్‌కప్‌లో సెమీ ఫైనల్ చేరిన సౌతాఫ్రికా జట్టులో క్లూసెనర్ సభ్యుడిగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో మ్యాచ్ టై కావడం.. నెట్ రన్‌రేట్ ఆసీస్ కంటే తక్కువగా ఉన్న కారణంగా ప్రొటీస్ పోరాటం సెమీస్‌తోనే ముగిసింది. ఇక 2004లో రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం క్లూసెనర్ అఫ్గానిస్తాన్, జింబాబ్వే జట్లకు కోచ్‌గా వ్యవహరించాడు. చదవండి: ఒక్క ఆటోగ్రాఫ్ కోసం బతిమాలించుకున్నాడు! -
రాజకీయం.. సరికొత్త సమరం
ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధించినా ఆ పార్టీకి సలహాదారులుగా పనిచేసినవారికి మీడియాలో కాస్త ఎక్కువ ప్రచారం ఈమధ్య లభిస్తోంది. ఫలితాలు వెలువడిన రెండు మూడు రోజులకు ఆయా పార్టీల వ్యూహకర్తల గురించి పత్రికలు, న్యూస్ వెబ్సైట్లలో, న్యూస్ టెలివిజన్ చానల్స్‌లో కథనాలు వస్తున్నాయి. ఇలాంటి విషయాలు మీడియాలో వచ్చే ధోరణి భారతదేశంలో 2014 నుంచీ ఎక్కువైంది. నాటి ప్రధాని, కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన 1984 డిసెంబర్ నెలాఖరు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ‘రీడిఫ్యూజన్’ అనే అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ సేవలను కాంగ్రెస్ పార్టీ తొలిసారి వాడుకుంది. ఇంగ్లిష్ సహా వివిధ భాషల్లో వెలువడే దినపత్రికల్లో కాంగ్రెస్ తరఫున పూర్తి పేజీ ప్రచార ప్రకటనలను ఈ ఏజెన్సీ రూపొందించింది. ఈ ఎలెక్షన్ యాడ్స్ పై కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ కమ్యూనికేషన్ల రంగంలో వృత్తి నైపుణ్యం గల ప్రైవేటు సంస్థలకు ఎన్నికల ప్రచారంలో కొంత బాధ్యతను రాజకీయ పక్షాలు అప్పగించడం 1980ల మధ్యలో దేశంలో ఓ మోస్తరుగా ఆరంభమైంది. 1985 ఏప్రిల్ మాసంలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో కూడా నాటి జనతాపార్టీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఒక కార్పొరేట్ యాడ్ ఏజెన్సీ ద్వారా పత్రికల్లో వేసిన ఎన్నికల ప్రచార ప్రకటనలు రూపొందింపజేశారు. తాజాగా కర్ణాటక అసెంబ్లీ 16వ ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండో రోజు నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించడానికి వెనుక ఉన్న వృత్తి నిపుణులు, మాజీ ఐఏఎస్ అధికారుల గురించి మీడియాలో వివరాలు వెల్లడిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది లేదా ఆరు నెలల ముందు నుంచి ఈ వ్యూహకర్తలు అధికార పార్టీపై ఎలాంటి నినాదాలు రూపొందించారు? ఎలాంటి జన సమీకరణ కార్యక్రమాలు అమలు చేశారు? వంటి వివరాలను ఈ మీడియా సంస్థలు పలు వ్యాసాల్లో చెబుతున్నాయి. మొదట ఫలానా పార్టీ ఈ కారణాల వల్ల ఓడిపోయిందని, ఫలానా ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఏఏ కారణాల వల్ల విజయం సాధించిందనే అంశాలను మీడియాలో పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. వివిధ రాజకీయపక్షాల గెలుపోటములకు ఇలా కారణాలు వివరించాక, విజయాల వెనుక ఉన్న వ్యక్తులు, వృత్తి నిపుణుల గురించి రాయడం గత పదేళ్ల నుంచి దేశంలో ఆనవాయితీగా మారింది. పాశ్చాత్య దేశాల్లో కన్సల్టెంట్ల నియామకం వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఓటర్లతో నేరుగా సంపర్కం సాధ్యం కాని అమెరికా, కెనడా, ఇంకా ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి ఐరోపా దేశాల్లో ఎన్నికల కన్సల్టెంట్లు లేదా వ్యూహకర్తల వినియోగం లేదా వారి సేవలు వాడుకోవడం 50 ఏళ్ల క్రితమే మొదలైంది. రాజకీయ పార్టీలకు సలహాదారులు, వ్యూహకర్తలగానే గాక, విడివిడిగా ఆయా పార్టీ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారంలో ఈ వృత్తి నిపుణులు సేవలందిస్తున్నారు. (Photo Courtesy:BBC) 2008 నవంబర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బరాక్ ఒబామా తనను గెలిపిస్తే దేశంలో గొప్ప మంచి మార్పు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అందుకోసం ‘ఛేంజ్ వీ కెన్ బిలీవ్ ఇన్’ అనే నినాదం రూపొందించి విస్తృత ప్రచారంలో పెట్టి అమెరికన్ ఓటర్ల మనసులు ఆకట్టుకున్నారు. సాధారణ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే ఇలాంటి నినాదాల రూపకల్పనలో ఈ కన్సల్టెంట్లు లేదా వ్యూహకర్తలు తోడ్పడతారు. ఇంతకు ముందు పాశ్చాత్య దేశాల్లో, ఇండియాలో ఆయా రాజకీయ పార్టీల నాయకుల్లో కొందరు ఇలాంటి జనాకర్షక నినాదాలు రూపొందించడంలో, తెలివైన ప్రచార వ్యూహాల రచనలో కీలక పాత్ర పోషించేవారు. ఎన్నికల్లో ప్రజలను కలుసుకోవడం, ఎన్నికల హామీలు, వాగ్దానాలు రూపొందించడం, ఇంకా ఇతర కార్యక్రమాల అమలుకే రాజకీయ పార్టీల నాయకుల సమయం సరిపోతోంది. రోజురోజుకు ప్రజలు లేదా ఓటర్ల ఆశలు, అవసరాలు పెరుగుతున్న కారణంగా ఎన్నికల రాజకీయాలు సంక్లిష్టమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజకీయవేత్తలకు ఎన్నికల వ్యూహకర్తలు, సలహాదారుల అవసరం ఏర్పడుతోంది. రాజకీయపక్షాల సభ్యత్వం లేకుండానే ఈ ఎన్నికల నిపుణులు పనిచేయడం అమెరికా వంటి దేశాల్లో మొదలైంది. ఎన్నికల ప్రచారంలో ఒక తరహా శ్రమ విభజనకు ఈ ఎలక్షన్ కన్సల్టెంట్లు, వ్యూహకర్తల నియామకం అవకాశమిస్తోంది. -విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సిపి, రాజ్యసభ సభ్యులు -
కన్సల్టెన్సీలకు అనుమతులు ఉన్నాయా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విదేశాలకు పంపుతామంటూ కరీంనగర్లో ఇష్టానుసారంగా కన్సల్టెన్సీలు వెలుస్తున్నాయి. తాజాగా కంబోడియాలో ఐదుగురు యువకులను సైబర్ స్కాం ముఠా చేతిలో బందీలుగా చిక్కడంతో ఈ కన్సెల్టెన్సీల విశ్వసనీయతపై ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. విదేశాల్లో చదువుకోవడం, కొలువులు చేయడం కొన్నేళ్లుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా విద్యార్థులు, నిరుద్యోగులకు సాధారణ విషయం. ఇలాంటి వ్యవహారాల్లో విద్యార్థులకు పెద్దగా ఇబ్బందులేమీ ఉండవు. అడ్మిషన్ ఖరారయ్యాక నేరుగా వర్సిటీకి వెళ్లి చదువుకుంటారు. కానీ.. ఉపాధి చూపిస్తామని వెలిసే కన్సల్టెన్సీలకు అన్ని అనుమతులు ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నాయా? అంటే ఈ విషయానికి సమాధానం నిర్వాహకులే చెప్పాలి. మరోవైపు ఐదుగురు యువకుల క్షేమంపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి వారిని కాంబోడియాకు పంపామని, మరోసారి రూ.3 లక్షలు చెల్లించే స్థోమత లేదని వాపోతున్నారు. వీలైనంత త్వరగా వారిని క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని వేడుకుంటున్నారు. ● నగరంలో ఇష్టానుసారంగా వెలుస్తున్న కన్సల్టెన్సీలు ● నిరుద్యోగులకు ఉపాధి ఆశచూపి విమానమెక్కిస్తున్న ఏజెంట్లు ● వెళ్లినవారిలో షాబాజ్‌ఖాన్‌ది దయనీయ గాధ ● పెళ్లైన వారానికే కంబోడియాకు ప్రయాణం ● తమవారి క్షేమంపై కుటుంబసభ్యుల ఆందోళన భారతీయ నిరుద్యోగులను విదేశాలకు పంపి ఉపాధి చూపించే కన్సెల్టెన్సీలు విధిగా పాటించాల్సిన నిబంధనలను కేంద్ర విదేశాంగశాఖ తన వెబ్సైట్లో స్పష్టంగా పేర్కొంది. 1. ఇమిగ్రేషన్ యాక్ట్ 1983 (సెక్షన్ 10) ప్రకారం.. ఎవరైతే భారతీయులకు విదేశాల్లో ఉపాధి కల్పన చేయాలనుకునే రిక్రూటింగ్ ఏజెన్సీలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసు కోవాలి. 2. ఐదు సంవత్సరాల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోసం రూల్.నెం.7 ప్రకారం.. రూ.25 వేలు చెల్లించాలి. 3. ఈ దరఖాస్తు ఫారాలు emigrate.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. 4. ఈ క్రమంలో ప్రతీ రిక్రూట్మెంట్ ఏజెన్సీ గ్యారెంటీ కింద రూ.50 లక్షలు బ్యాంకులో జమచేయాలి. 5. రిక్రూటింగ్ ఏజెన్సీ నిర్వాహకుడి వ్యక్తిగత ప్రవర్తన, ఇతర విషయాల్లో పోలీసులు విచారణ జరిపి ఉండాలి. 6. అయితే.. చేతిలో రూ.నాలుగైదు లక్షలు ఉన్న ప్రతీవారు కన్సెల్టెన్సీలు, రిక్రూట్మెంట్ ఏజెన్సీ పెళ్లైన వారానికే విమానమెక్కిన కంబోడియాలో చిక్కుకున్న ఆరుగురిలో షాబాజ్‌ఖాన్‌ది అత్యంత దయనీయ పరిస్థితి. షాబాజ్‌కు ఇటీవలే వివాహం అయింది. తన మేనమామకు ఆరోగ్యం బాగాలేదని అతను ఉండగానే వివాహం చేసుకోవాలని.. పెద్దలు హడావిడిగా పెళ్లి చేశారు. ఆగస్టు 25 తేదీన రిసెప్షన్ జరిగింది. ఓ వైపు రిసెప్షన్ జరుగుతుండగానే.. షాబాజ్ మేనమామ మరణించారు. వారంతా ఈ బాధలో మునిగిపోయారు. వీసా వచ్చిందన్న సమాచారంతో వెంటనే నూతన వధువైన తన భార్య, కుటుంబ సభ్యులను వదిలి ఆగస్టు 31వ తేదీన కంబోడియా విమానమెక్కాల్సి వచ్చింది. తాను అక్కడ చైనా వారు చెప్పే సైబర్ నేరాలు చేయలేకపోతున్నానని.. వెంటనే ఇంటికి తీసుకువచ్చే ఏర్పాటు చేయాలని కుటుంబీకులకు ఫోన్లో విలపిస్తూ వేడుకుంటున్నాడు. మా సోదరుడిని కాపాడండి మా సోదరుడు షాబాజ్ ఖాన్‌కు వీసా ఇప్పిస్తానని మేనాజ్ అలీ నమ్మబలికాడు. కెసీనోలో మంచి జీతం (800 డాలర్లు) వస్తుందని, ప్రతిరోజూ టిప్పులు కూడా దొరుకుతాయని ఆశపెట్టాడు. అందుకే.. మేము రూ.2 లక్షలు ఖర్చు అయినా పంపేందుకు వెనకాడలేదు. షాబాజ్‌కు ఆగస్టులో నెలలో వివాహమైంది. వీసా రావడంతో రిసెప్షన్ అయిన నాలుగైదురోజుల అనంతరం విదేశాలకు పంపాం. తీరా అక్కడికెళ్లాక మావాడిని బందించారు. రూ.3 లక్షలు లేదా 3,000 డాలర్లు ఇవ్వాలంటున్నారు. – అఫ్జల్, షాబాజ్ సోదరుడు, మానకొండూరు మా తమ్ముడిని అమ్ముకున్నరు కంబోడియా వీసా సిద్ధంగా ఉందని ఏజెంట్లు మేనాజ్ అలీ, అబ్దుల్ రహీం మా తమ్ముడు నవీద్ అబ్దుల్‌కు చెప్పారు. అందరికీ చెప్పినట్లుగా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని, రూ.2 లక్షలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎలాంటి సమస్య రాదని, అన్ని బాధ్యతలు తీసుకుంటామన్నారు. తీరా ఇప్పుడు మా తమ్ముడికి ఇబ్బందులు వస్తున్నాయంటే.. తనకేం సంబంధం లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. రూ.3 లక్షలు చెల్లిస్తే తాను విడిపిస్తానని చెబుతున్నాడు. – అబ్దుల్ ముహీద్, నవీద్ సోదరుడు, సిరిసిల్ల ముందే అంతా వివరించా కంబోడియాకు వెళ్లిన ఆరుగురి యువకుల విషయంలో నా తప్పిదమేమీ లేదు. నేను వారికి ఉద్యోగం ఎలా ఉంటుంది? అన్న విషయం స్పష్టంగా వివరించాను. కెసెనీలో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ అని చెప్పాను. వారూ అంగీకరించే వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక.. వారు ఇలా ఎందుకు చెబుతున్నారో అర్థం కావడం లేదు. – మేనాజ్ అలీ, కన్సల్టెన్సీ నిర్వాహకుడు -
అఫ్గాన్ జట్టు కన్సల్టెంట్‌గా ఆండీ ఫ్లవర్
కాబూల్: టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే అఫ్గానిస్తాన్ జట్టుకు జింబాబ్వే మాజీ కెన్, ఇంగ్లండ్ మాజీ కోచ్ ఆండీ ఫ్లవర్ కన్సల్టెంట్‌గా వ్యవహరించనున్నాడు. 53 ఏళ్ల ఫ్లవర్ 63 టెస్టులు, 213 వన్డేలు ఆడాడు. అఫ్గాన్ టీమ్‌కు లాన్స్ క్లూస్నర్ హెడ్ కోచ్‌గా, షాన్ టెయిట్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. చదవండి: KS Bharat: కప్ కొట్టి కోహ్లి చేతిలో పెట్టడమే లక్ష్యం -
CDFD Recruitment 2021: సీడీఎఫ్‌డీ, హైదరాబాద్‌లో ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్(సీడీఎఫ్‌డీ).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 05 ► కన్సల్టెంట్(రీసెర్చ్ మేనేజ్మెంట్): అర్హత: పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం: 3ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.50,000 నుంచి రూ.75,000 వరకు చెల్లిస్తారు. వయసు: 50 ఏళ్లు మించకూడదు. ► కన్సల్టెంట్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్): అర్హత: గ్రాడ్యుయేషన్(కామర్స్) ఉత్తీర్ణులవ్వాలి. 5ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.30,000 నుంచి 40,000 వరకు చెల్లిస్తారు. వయసు: 64 ఏళ్లు మించకూడదు. ► సైకాలజిస్ట్: అర్హత: ఎంఫిల్/పీహెచ్డీ ఉత్తీర్ణులవ్వాలి. 4ఏళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వేతనం నెలకు రూ.25,000 వరకు చెల్లిస్తారు. వయసు: 50ఏళ్లు మించకూడదు. ► హిందీ ట్రాన్స్‌లేటర్: అర్హత: హిందీ సబ్జెక్టుగా గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. డిప్లొమా(ట్రాన్స్లేషన్) ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.15,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తారు. వయసు: 62 ఏళ్లు మించకూడదు. ► కన్సల్టెంట్ లైబ్రేరియన్: అర్హత: డిగ్రీ(లైబ్రరీ సైన్సెస్) ఉత్తీర్ణులవ్వాలి. వేతనం నెలకు రూ.10,000 నుంచి 20,000 వరకు చెల్లిస్తారు. వయసు: 62 ఏళ్లు మించకూడదు. ► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021 ► వెబ్సైట్: http://www.cdfd.org.in మరిన్ని నోటిఫికేషన్లు EFLU Recruitment: ఇఫ్లూలో టీచింగ్ పోస్టులు పవర్‌గ్రిడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఎన్జీఆర్ఐ, హైదరాబాద్‌లో 38 టెక్నికల్ ఉద్యోగాలు -
ఎలక్ర్టిక్ బస్సులకు ఢిల్లీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్
సాక్షి, న్యూఢిల్లీ : కాలుష్య కోరల్లో కూరుకుపోయిన ఢిల్లీకి ఉపశమనం కలిగించే రీతిలో రాజధాని రహదారులపై వేయి ఎలక్ర్టిక్ బస్సులను నడిపేందుకు కన్సల్టెంట్ నియామకానికి ఢిల్లీ సర్కార్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కన్సల్టెంట్ నియామకంపై నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో వేయి ఎలక్ర్టిక్ బస్సులను నడిపేందుకు కన్సల్టెంట్‌ను నియమించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. రాజధానిలో కాలుష్యాన్ని నియంత్రించడంతో పాటు ఢిల్లీ రవాణా వ్యవస్థ ఆధునీకరణ దిశగా ఇది మెరుగైన చర్యగా ఆయన అభివర్ణించారు.ఈ బస్‌లను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనపై కూడా కేబినెట్లో విస్తృత చర్చ జరిగినా కొన్ని సాంకేతిక అంశాలతో దీనిపై నిర్ణయాన్ని రవాణా శాఖకు విడిచిపెట్టారు. కాగా, ఈ బస్‌లతో పోలిస్తే ఖర్చు తక్కువ అయ్యే హైడ్రోజన్ ఇంధన బ్యాటరీ ఆధారిత బస్‌లను ఉపయోగించే అవకాశాలను పరిశీలించాలని సుప్రీం కోర్టు ఇటీవల ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
‘కన్సల్టేషన్’ కనికట్టు!
కార్పొరేట్ వైద్యం ఖరీదని అందరికీ తెలుసు. వైద్య చికిత్సలే కాదు మినిమమ్ కన్సల్టెన్సీ కూడా ఇప్పుడు బహు ఖరీదుగా మారింది. సాధారణంగా ఏదైనా జబ్బు చేసినా...అలాంటి లక్షణాలు కన్పించినా ముందు రోగమేంటో తెలుసుకునేందుకు వైద్యుడిని సంప్రదించక తప్పదు. ఇలా సంప్రదించడంతోనే కార్పొరేట్ దోపిడీ ప్రారంభమవుతోంది. జబ్బేంటో తెలియక ముందే రూ.500 నుంచి రూ.1000 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తే రూ.100 లేదా రూ.150 చెల్లించే వారు. అదే ఫీజుపై మరో రెండుసార్లు చెక్ చేయించుకొనే సదుపాయం ఉండేది. ఇప్పుడు సీన్ మారింది. కన్సల్టేషన్ ఫీజులు అమాంతం పెంచేయడమే కాకుండా...దాన్ని ఒక్కసారి చెకింగ్‌కే పరిమితం చేస్తున్నారు. మరోసారి వైద్యుడ్ని సంప్రదించాలంటే మరో వెయ్యి సమర్పించాల్సిందే. జనరల్ ఫిజీషియన్ కాకుండా కేన్సర్, కాలేయం, మూత్రపిండాలు, న్యూరాలజీ, గుండె తదితర స్పెషలిస్టుల వద్దకు వెళ్తే భారీగా కన్సల్టేషన్ ఫీజు ఇవాల్సి వస్తోంది. ఇటీవల బేగంపేటలోని ఓ ఆస్పత్రిలో డెంగీతో బాధపడుతున్న ఓ చిన్నారికి చికిత్స అందించినందుకు స్పెషలిస్టు ఒక విజిట్ కన్సల్టేషన్ చార్జీ రూ.7 వేలు వేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక బస్తీల్లో ఉన్న చిన్నచిన్న క్లినిక్‌ల్లో సైతం డాక్టర్ కన్సల్టేషన్ చార్జీలు అమాంతం పెంచేశారు. దీంతో సామాన్య ప్రజలు డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో సాక్షి, సిటీబ్యూరో: కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యుల కన్సల్టేషన్, రిజిస్ట్రేషన్ చార్జీలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. సాధారణ వైద్యుడు నాడీ పడితే చాలు రూ.500 చెల్లించుకోవాల్సిందే. జనరల్ ఫిజిషియన్ కాకుండా కేన్సర్, కాలేయం, మూత్రపిండాలు, న్యూరాలజీ, గుండె తదితర స్పెషలిస్టుల వద్దకు వెళ్తే రూ.800 నుంచి రూ.1000 వరకు ఇవాల్సిందే. పదేళ్ల క్రితం పరిస్థితికి ప్రస్తుతానికి భారీ తేడా కనిపిస్తోంది. ఒకప్పుడు వైద్యుడి కన్సల్టేషన్ రూ.100 నుంచి రూ.150 ఉంటే అదే ఎక్కువ. అప్పట్లో ఫ్యామిలీ డాక్టర్లు ఉండేవారు. కుటుంబంలో ఎవరికే సమస్య వచ్చినా క్లినికల్ ఎగ్జామ్‌తోనే పరిష్కారం లభించేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. జ్వరం, తలనొప్పి, జలుబు వంటి సాధారణ జబ్బులకు కూడా వైద్య పరీక్షలు తప్పనిసరిగా మారాయి. హస్తవాసి బాగున్నట్లు కొంచెం పేరు ఉంటే చాలు అంతకు ఎక్కువే చెల్లించుకోవాల్సివస్తోంది. బస్తీల్లో ఉన్న చిన్నచిన్న క్లినిక్‌ల్లో సైతం డాక్టర్ కన్సల్టేషన్ చార్జీలు అమాంతం పెంచేశాయి. ఎన్నిసార్లు విజిట్ చేస్తే.. ఔట్పేషెంట్ల పరిస్థితి ఇలా ఉంటే ఇన్‌పేషెంట్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చికిత్స కోసం అడ్మిటైన రోగి నుంచి సర్జరీ, ఐసీయూ, నర్సింగ్, ఫుడ్, బెడ్చార్జి, కన్సల్టేషన్ ఇలా దేనికవి వేర్వేరుగా వసూలు చేస్తున్నారు. నిజానికి ఒకసారి వైద్యుడి వద్దకు వచ్చిన రోగికి ఆ వ్యాధి తగ్గే వరకు కన్సల్టేషన్ ఫీజు తీసుకోకూడదు. కానీ వైద్యసేవల్లో భాగంగా డాక్టర్ ఎన్నిసార్లు వచ్చి చూస్తే అన్ని సార్లు కన్సల్టేషన్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఇలా ఒక రోగి పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యేనాటికి (సర్జరీ కాకుండా) కేవలం డాక్టర్ కన్సల్టేషన్ చార్జీలే రూ.10వేలకుపైగా ఉంటుందంటే ఆశ్చర్యపోనసరం లేదు. ఇటీవల బేగంపేటలోని ఓ ఆస్పత్రికి డెంగీతో బాధపడుతున్న ఓ చిన్నారికి చికిత్సలు అందించినందుకు స్పెషలిస్టు ఒక విజిట్ కన్సల్టేషన్ చార్జీ రూ.7 వేలు వేసిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిమ్స్‌లో ఓపీ చార్జీలు ఇలా.. ప్రతిష్టాత్మక నిమ్స్‌లో మార్నింగ్ ఓపీ చార్జి రూ.50 ఉండగా, ఇటీవల రూ.100కు పెంచారు. ఈవినింగ్ ఓపీ రూ.300 నుంచి రూ.500కు క్రాస్ కన్సల్టేషన్ చార్జి రూ. 800కు పెంచారు. రెండో చెకప్‌నకు 14 రోజుల వ్యవధి ఉంటుంది. రోగి చెప్పింది కూడా సరిగా విన్పించుకోరు.. నిజానికి ఓపీలో వచ్చిన రోగికి ఒకసారి ఫీజు చెల్లిస్తే రెండువారాల వరకు ఎలాంటి ఫీజులు తీసు కోకూడదు. కానీ ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోగి డాక్టర్ వద్దకు ఎన్నిసార్లు వెళ్లితే..అన్ని సార్లు కన్సల్టేషన్ ఫీజు చెల్లించాల్సి వస్తోంది. ఇంత భారీ మొత్తంలో ఫీజు తీసుకుంటున్న వైద్యులు రోగులతో సరిగా మాట్లాడతారా.. అంటే అదీ లేదు. ముందు తమ వద్ద పని చేస్తున్న అసిస్టెంట్ డాక్టర్ వద్దకు పంపిస్తున్నారు. ఆ తర్వాత సీనియర్ డాక్టర్ వద్దకు తీసుకెళ్తున్నారు. రోగి చెప్పింది వినకుండా అసి స్టెంట్స్ చెప్పినదే విని మందులు సూచిస్తున్నారు. వచ్చిన ప్రతి రోగితో మాట్లాడాలంటే.. రోజులో కనీసం 20 మందిని కూడా చూడలేం. అదే అసిస్టెంట్ ఉంటే 80 నుంచి వంద మంది వరకు చూడవచ్చని ఓ స్పెషలిస్ట్ వైద్యుడు స్పష్టం చేశారు. అప్పట్లో ఇన్ని స్పెషలైజేషన్లు లేవు ‘మేం చదువుకునే రోజుల్లో ఇన్ని స్పెషలైజేషన్లు లేవు. ఎండీ సీట్లూ తక్కువే. ప్రైవేటులో డొనేషన్లు కట్టి చదువుకోవడాన్ని నామోషిగా ఫీలయ్యేవాళ్లం. ప్రస్తుతం స్పెషలైజేషన్లు పెరిగాయి. డొనేషన్లు పెరిగాయి. దీంతో చదువుపై పెట్టిన పెట్టుబడిని రాబట్టుకునేందుకు వృత్తిలోకి రాగానే భారీగా కన్సల్టేషన్ ఇతర ఫీజు పెంచుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు కూడా తమ నిర్వహణ ఖర్చులు రాబట్టుకునేందుకు ఫీజు పెంచుతున్నాయి.’ – డాక్టర్ నరేంద్రనాథ్, మాజీ డైరెక్టర్, నిమ్స్ -
కన్సల్టెన్సీల పేరుతో కమీషన్ల రుచి మరిగిన సర్కార్
-
ఆసీస్ జట్టు కన్సల్టెంట్‌గా శ్రీరామ్
మెల్బోర్న్: వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు శ్రీధరన్ శ్రీరామ్, మైక్‌హస్సీలను ఆస్ట్రేలియా జట్టు కన్సల్టెంట్స్గా నియమించుకుంది. టోర్నీ ఆరంభ దశలో శ్రీరామ్.. ఆసీస్ జట్టు సన్నాహాకాలను పర్యవేక్షిస్తాడు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌తోనే శ్రీరామ్ బాధ్యతలు చేపడతాడని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెల్లడించింది. ‘భారత్‌కు వచ్చే ముందు మేం ప్రొటీస్‌తో సిరీస్ ఆడతాం. ఈ సిరీస్‌లో మా ఆటగాళ్ల ప్రదర్శనపై శ్రీరామ్ దృష్టిపెడతాడు. అలాగే భారత్‌లో ఎదురయ్యే పరిస్థితులపై క్రికెటర్లకు శిక్షణ ఇస్తాడు. హస్సీకి టి20లతో పాటు ఐపీఎల్‌లోనూ చాలా అనుభవం ఉంది. కాబట్టి అతని సేవలను కూడా వినియోగించుకుంటాం’ అని సీఏ పేర్కొంది. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డేవిల్స్‌కు సహాయక కోచ్‌గా వ్యవహరించిన శ్రీరామ్... భారత్ తరఫున 2000-04 మధ్య ఎనిమిది వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. -
‘పెద్ద’పులి గూడేనికొచ్చింది!
-
హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైల్వే కారిడార్
పురోగతిలో ప్రాజెక్టు అధ్యయనం సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్-డోర్నకల్-విజయవాడ-చెన్నై (664 కి.మీ.) మార్గంలో హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు అధ్యయనం పురోగతిలో ఉందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ప్రాజెక్టు పరిశీలన నివేదిక, మధ్యంతర నివేదిక 1, 2, ముసాయిదా తుది నివేదికను కన్సల్టెంట్ సమర్పించారని వెల్లడించారు. దేశంలో ప్రవేశపెట్టనున్న హైస్పీడ్, బుల్లెట్, సెమీ హైస్పీడ్ రైళ్ల పురోగతి వివరాలపై లోక్‌సభలో గురువారం ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మురళీమోహన్, మహేంద్రన్, రాహుల్ షేహవాలే, మల్లికార్జున్ ఖర్గే, రాజన్ విచారే, ఒం బిర్లా అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.