ఆర్థిక శాఖలో ఆరుగురు కన్సల్టెంట్లు | Six consultants in Finance Department: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఆర్థిక శాఖలో ఆరుగురు కన్సల్టెంట్లు

Published Sat, Dec 21 2024 5:06 AM | Last Updated on Sat, Dec 21 2024 5:07 AM

Six consultants in Finance Department: Andhra pradesh

నెలకు రూ.55 వేల నుంచి రూ.2.75 లక్షల వరకు వేతనాలు

సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలన అంటేనే కన్సల్టెంట్లు.. విదేశీ సంస్థలకు వందల కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టడమనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా కన్సల్టెంట్ల రాజ్యానికి చంద్రబాబు సర్కారు గేట్లు తెరిచింది. ఆర్థికశాఖలో ఆరుగురు కన్సల్టెంట్లను నియమించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు విధానంలో ఏడాదిపాటు ఆర్థిక శాఖ కార్యదర్శులకు సహాయకులుగా ఈ కన్సల్టెంట్లు పని చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వారికి నెలకు రూ.55 వేల నుంచి రూ.2.75 లక్షల వరకు వేతనాలు ఇవ్వనున్నట్లు తెపారు. డేటా విశ్లేషణ, విధాన పరిశోధన, పీపీపీ ప్రాజెక్టులు, చట్టపరమైన విషయాల్లో ఈ కన్సల్టెంట్లు సహాయకులుగా పనిచేయనున్నారు. కాగా, ఇప్పటికే ఏపీ సీఆర్‌డీఏలో 68 మంది కన్సల్టెంట్ల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కన్సల్టెంట్లకు రెండు, మూడేళ్లలో రూ.70.64 కోట్లు చెల్లించనున్నట్లు సీఆర్‌డీఏ పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement