శ్రీలంక కన్సల్టెంట్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ నీల్ మెక్‌కెంజీ నియమితుడయ్యాడు. దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నిమిత్తం శ్రీలంక క్రికెట్ బోర్డు మెక్‌కెంజీని అపాయింట్ చేసింది. మెక్‌కెంజీ నవంబర్ 13-21 మధ్యలో శ్రీలంక జట్టుతో జాయిన్ అవుతాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ నవంబర్ 27న డర్బన్ వేదికగా మొదలవుతుంది.
రెండో మ్యాచ్ డిసెంబర్ 5-9 వరకు గెబెర్హా వేదికగా జరుగనుంది. ఈ సిరీస్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే శ్రీలంకకు ఈ సిరీస్ చాలా కీలకం. అందుకే ఆ జట్టు స్థానికుడైన మెక్‌కెంజీ కన్సల్టెంట్ కోచ్‌గా నియమించుకుంది.
మెక్‌కెంజీ దక్షిణాఫ్రికాలోని పిచ్‌ల పరిస్థితులపై లంక ఆటగాళ్లకు అవగాహణ కల్పిస్తాడు. సౌతాఫ్రికాలో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే విషయంలో మెక్‌కెంజీ లంక ప్లేయర్లకు శిక్షణ ఇస్తాడు. దక్షిణాఫ్రికా బ్యాటర్‌గా మెక్‌కెంజీ అనుభవం లంక ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందని శ్రీలంక క్రికెట్ బోర్డు సీఈఓ ఆష్లే డిసిల్వ తెలిపారు.
48 ఏళ్ల మెక్‌కెంజీ గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌కు సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా పని చేశాడు. మెక్‌కెంజీ ఈ ఏడాది ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్‌గా సేవలందించాడు. మెక్‌కెంజీ 2000-2009 మధ్యలో సౌతాఫ్రికా తరఫున 124 మ్యాచ్‌లు ఆడి (మూడు ఫార్మాట్లలో) దాదాపు 5000 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మెక్‌కెంజీకి ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోనూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. దేశవాలీ క్రికెట్‌లో మెక్‌కెంజీ దాదాపు 20000 పరుగులు చేశాడు.
దక్షిణాఫ్రికాతో ప్రీ సిరీస్ క్యాంప్‌కు శ్రీలంక జట్టు..
ధనంజయ డి సిల్వా, దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, దినేష్ చండిమల్, లహిరు కుమార, ప్రభాత్ జయసూర్య, నిషాన్ పీరిస్, మిలన్ రత్నాయకే, కసున్ రజిత, లసిత్ ఎంబుల్దెనియా.
Comments
Please login to add a commentAdd a comment