హైదరాబాద్-డోర్నకల్-విజయవాడ-చెన్నై (664 కి.మీ.) మార్గంలో హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు అధ్యయనం పురోగతిలో ఉందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు.
- పురోగతిలో ప్రాజెక్టు అధ్యయనం
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్-డోర్నకల్-విజయవాడ-చెన్నై (664 కి.మీ.) మార్గంలో హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు అధ్యయనం పురోగతిలో ఉందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ప్రాజెక్టు పరిశీలన నివేదిక, మధ్యంతర నివేదిక 1, 2, ముసాయిదా తుది నివేదికను కన్సల్టెంట్ సమర్పించారని వెల్లడించారు. దేశంలో ప్రవేశపెట్టనున్న హైస్పీడ్, బుల్లెట్, సెమీ హైస్పీడ్ రైళ్ల పురోగతి వివరాలపై లోక్‌సభలో గురువారం ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మురళీమోహన్, మహేంద్రన్, రాహుల్ షేహవాలే, మల్లికార్జున్ ఖర్గే, రాజన్ విచారే, ఒం బిర్లా అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు.