ఇటీవల కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ 'హిండెన్‌బర్గ్ రీసెర్చ్' చేసిన ఓ ట్వీట్ చాలామందిలో ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటి? దాని వెనుక ఉన్న అంతరార్థం ఏమిటనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో 'సమ్‌థింగ్ బిగ్ సూన్ ఇండియా' అని ట్వీట్ చేసింది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. హిండెన్‌బర్గ్ మరోసారి భారతీయ మార్కెట్లలో బాంబు పేల్చనుందా.. అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఏ కంపెనీ మీద నివేదికల విడుదల చేస్తుందో అని చర్చించుకుంటున్నారు.
హిండెన్‌బర్గ్ 2023 జనవరిలో అదానీ గ్రూప్ తమ కంపెనీ కంపెనీ షేర్స్ కృత్రిమంగా పెంచినట్లు ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో అదానీ గ్రూప్ షేర్స్ ఒక్కసారిగా పడిపోయాయి. ఈ ఆరోపణలు సరైనవి కాదని, అదానీ గ్రూప్ ఖండించింది. ఆ తరువాత ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి అనేక చర్యలు తీసుకుంది. మొత్తానికి అదానీ గ్రూప్ మళ్ళీ యధాస్థితికి వచ్చింది.
ఇప్పుడు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన నాలుగు పదాల ట్వీట్.. మళ్ళీ అదానీ గ్రూపును ఉద్దేశించి చేసిందా అని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ ట్వీట్ అంతరార్ధం మాత్రం అవగతం కావడం లేదు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనేది 2017లో ప్రారంభమైన ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ కంపెనీ. ఈ కంపెనీలో ప్రస్తుతం 10మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.
Something big soon India
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024
Comments
Please login to add a commentAdd a comment