భారత క్రీడాకారులు పతకాల బోణీ కొట్టడంతో దేశీయంగా క్రీడాభిమానులందరికీ ఒలింపిక్స్‌పై ఆసక్తి మరింత పెరిగింది. వివిధ దేశాల క్రీడాకారులు వేర్వేరు అంశాల్లో పోటీపడుతుండటం చూడటానికి ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు క్రీడాకారులు ఎన్నో ఏళ్లుగా ఎలాగైతే సిద్ధమవుతారో, ఇన్వెస్టర్లు కూడా తమ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి ఏళ్ల తరబడి ప్లానింగ్ చేసుకోవాలి. పొదుపు చేయాలి. వివేకవంతంగా ఇన్వెస్ట్ చేయాలి. మ్యుచువల్ ఫండ్స్‌లో.. అందునా లార్జ్‌క్యాప్స్‌లో దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించి ఒలింపిక్స్ మనకేం నేరి్పస్తాయో ఓసారి చూద్దాం. ఒలింపిక్స్, లార్జ్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్ వేర్వేరు ప్రపంచాలుగా అనిపించినా తరచి చూస్తే వాటి మధ్య చాలా సారూప్యతలు కనిపిస్తాయి.
సునాయాసమనేది ఓ అపోహ..
లార్జ్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్ ప్రధానంగా దిగ్గజ సంస్థలపైనా, సుదీర్ఘకాలంగా అన్ని రకాల ఆటుపోట్లను తట్టుకుని నిలబడిన కంపెనీలపైనా దృష్టి పెడతాయి. ఈ కంపెనీలన్నీ అగ్రస్థానానికి చేరుకునే క్రమంలో మార్కెట్లను, ప్రోడక్టులను అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం వెచ్చించినవై, ఎంతో శ్రమించినవై ఉంటాయి. అనుభవజు్ఞలైన ఒలింపిక్ టీమ్ సభ్యుల్లాగే లార్జ్ క్యాప్ కంపెనీలు నేడు సునాయాసంగా ఉన్నట్లుగా కనిపించడం వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. వాటి ఆదాయాలు స్థిరంగా వృద్ధి చెందుతుంటాయి. పటిష్టమైన బ్రాండ్ గుర్తింపు ఉంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు పుష్కలంగా వనరులు ఉంటాయి. అనేక విజయాలు సాధించి అపార అనుభవం ఆర్జించిన ఒలింపిక్స్ టీమ్ ఎలాగైతే అసాధారణ పరిస్థితుల్లోనూ పట్టు తప్పకుండా నిలదొక్కుకోగలదో ఈ కంపెనీలు కూడా కఠిన పరిస్థితుల్లోనూ తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కావు.
దృఢసంకల్పంతో విజయానికి బాటలు..
మారథాన్ రేసులో తలెత్తే అలసట, అనూహ్య పరిస్థితులను శారీరకంగా, మానసికంగా ఎలా ఎదుర్కొనాలనేది బాగా తెలిసి, తగు వ్యూహాలను రూపొందించుకున్న మారథానర్ గురించి ఒక్కసారి ఊహించుకోండి. సాధారణంగా అమెచ్యూర్ మారథానర్ ప్రారంభంలో కొన్ని మైళ్లు అలవోకగా పరుగెత్తవచ్చు. కానీ ఆ తర్వాత కూడా అలాగే కొనసాగిస్తే కాళ్లు సహకరించవు. ఊపిరి ఆడదు. సరైన యాటిట్యూడ్, మానసిక శిక్షణ లేకపోతే ఆ దశలో ఆగిపోవాల్సి వస్తుంది. కానీ అనుభవజూ్ఞలైన ఒలింపిక్ క్రీడాకారులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కఠిన శిక్షణ పొందినందున ముందుకు సాగిపోతారు. లార్జ్ క్యాప్ కంపెనీలు కూడా అచ్చంగా అలాంటివే. అవి గతంలో మార్కెట్లో హెచ్చుతగ్గులు ఎన్నింటినో చూసి ఉంటాయి. మారిపోతున్న వినియోగదారుల డిమాండ్‌లకు అనుగుణంగా తమను తాము మలుచుకున్నవై ఉంటాయి. తాత్కాలిక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనగలిగే ఆర్థిక సామర్థ్యాలు కలిగి ఉన్నవై ఉంటాయి. తుపానులు ఎదురైతే ఎలా బైటపడాలన్నది ఈ కంపెనీలకు బాగా తెలిసి ఉంటుంది.
డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు
ప్రపంచం నలుమూలల నుంచి అథ్లెట్లు.. ఒలింపిక్స్‌లో వివిధ విభాగాల్లో పోటీపడతారు. 2024 ఒలింపిక్స్‌లో 39 స్పోర్ట్స్‌వ్యాప్తంగా 329 ఈవెంట్లు ఉన్నాయి. తొలిసారిగా బ్రేక్‌డ్యాన్సింగ్‌కు కూడా చోటు కల్పించారు. లార్జ్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్‌లోను ఇలాంటి వైవిధ్యం ఉంటుంది. వివిధ ఈవెంట్లలో పాల్గొనడం వల్ల పతకాలు గెల్చుకునే అవకాశాలు ఎలాగైతే మెరుగుపడతాయో వివిధ రంగాలవ్యాప్తంగా పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లార్జ్ క్యాప్ ఫండ్స్ రిసు్కలను తగ్గించుకుని మెరుగైన రాబడులు అందించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి.
సురేశ్ సోని - సీఈవో, బరోడా బీఎన్‌పీ పారిబా అసెట్ మేనేజ్‌మెంట్ ఇండియా
ఒలింపిక్స్ నేర్పించే పెట్టుబడి పాఠాలు
Published Mon, Aug 5 2024 6:34 AM | Last Updated on Fri, Aug 9 2024 8:39 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment