Largecap company
-
ఒలింపిక్స్ నేర్పించే పెట్టుబడి పాఠాలు
భారత క్రీడాకారులు పతకాల బోణీ కొట్టడంతో దేశీయంగా క్రీడాభిమానులందరికీ ఒలింపిక్స్‌పై ఆసక్తి మరింత పెరిగింది. వివిధ దేశాల క్రీడాకారులు వేర్వేరు అంశాల్లో పోటీపడుతుండటం చూడటానికి ఎంతో ఉత్సాహకరంగా ఉంటుంది. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు క్రీడాకారులు ఎన్నో ఏళ్లుగా ఎలాగైతే సిద్ధమవుతారో, ఇన్వెస్టర్లు కూడా తమ ఆర్థిక లక్ష్యాలను సాధించుకోవడానికి ఏళ్ల తరబడి ప్లానింగ్ చేసుకోవాలి. పొదుపు చేయాలి. వివేకవంతంగా ఇన్వెస్ట్ చేయాలి. మ్యుచువల్ ఫండ్స్‌లో.. అందునా లార్జ్‌క్యాప్స్‌లో దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేయడానికి సంబంధించి ఒలింపిక్స్ మనకేం నేరి్పస్తాయో ఓసారి చూద్దాం. ఒలింపిక్స్, లార్జ్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్ వేర్వేరు ప్రపంచాలుగా అనిపించినా తరచి చూస్తే వాటి మధ్య చాలా సారూప్యతలు కనిపిస్తాయి. సునాయాసమనేది ఓ అపోహ.. లార్జ్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్ ప్రధానంగా దిగ్గజ సంస్థలపైనా, సుదీర్ఘకాలంగా అన్ని రకాల ఆటుపోట్లను తట్టుకుని నిలబడిన కంపెనీలపైనా దృష్టి పెడతాయి. ఈ కంపెనీలన్నీ అగ్రస్థానానికి చేరుకునే క్రమంలో మార్కెట్లను, ప్రోడక్టులను అర్థం చేసుకోవడానికి ఎంతో సమయం వెచ్చించినవై, ఎంతో శ్రమించినవై ఉంటాయి. అనుభవజు్ఞలైన ఒలింపిక్ టీమ్ సభ్యుల్లాగే లార్జ్ క్యాప్ కంపెనీలు నేడు సునాయాసంగా ఉన్నట్లుగా కనిపించడం వెనుక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. వాటి ఆదాయాలు స్థిరంగా వృద్ధి చెందుతుంటాయి. పటిష్టమైన బ్రాండ్ గుర్తింపు ఉంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారేందుకు పుష్కలంగా వనరులు ఉంటాయి. అనేక విజయాలు సాధించి అపార అనుభవం ఆర్జించిన ఒలింపిక్స్ టీమ్ ఎలాగైతే అసాధారణ పరిస్థితుల్లోనూ పట్టు తప్పకుండా నిలదొక్కుకోగలదో ఈ కంపెనీలు కూడా కఠిన పరిస్థితుల్లోనూ తీవ్ర హెచ్చుతగ్గులకు లోను కావు. దృఢసంకల్పంతో విజయానికి బాటలు.. మారథాన్ రేసులో తలెత్తే అలసట, అనూహ్య పరిస్థితులను శారీరకంగా, మానసికంగా ఎలా ఎదుర్కొనాలనేది బాగా తెలిసి, తగు వ్యూహాలను రూపొందించుకున్న మారథానర్ గురించి ఒక్కసారి ఊహించుకోండి. సాధారణంగా అమెచ్యూర్ మారథానర్ ప్రారంభంలో కొన్ని మైళ్లు అలవోకగా పరుగెత్తవచ్చు. కానీ ఆ తర్వాత కూడా అలాగే కొనసాగిస్తే కాళ్లు సహకరించవు. ఊపిరి ఆడదు. సరైన యాటిట్యూడ్, మానసిక శిక్షణ లేకపోతే ఆ దశలో ఆగిపోవాల్సి వస్తుంది. కానీ అనుభవజూ్ఞలైన ఒలింపిక్ క్రీడాకారులు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కఠిన శిక్షణ పొందినందున ముందుకు సాగిపోతారు. లార్జ్ క్యాప్ కంపెనీలు కూడా అచ్చంగా అలాంటివే. అవి గతంలో మార్కెట్లో హెచ్చుతగ్గులు ఎన్నింటినో చూసి ఉంటాయి. మారిపోతున్న వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా తమను తాము మలుచుకున్నవై ఉంటాయి. తాత్కాలిక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనగలిగే ఆర్థిక సామర్థ్యాలు కలిగి ఉన్నవై ఉంటాయి. తుపానులు ఎదురైతే ఎలా బైటపడాలన్నది ఈ కంపెనీలకు బాగా తెలిసి ఉంటుంది. డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు ప్రపంచం నలుమూలల నుంచి అథ్లెట్లు.. ఒలింపిక్స్‌లో వివిధ విభాగాల్లో పోటీపడతారు. 2024 ఒలింపిక్స్‌లో 39 స్పోర్ట్స్వ్యాప్తంగా 329 ఈవెంట్లు ఉన్నాయి. తొలిసారిగా బ్రేక్డ్యాన్సింగ్కు కూడా చోటు కల్పించారు. లార్జ్ క్యాప్ మ్యుచువల్ ఫండ్స్‌లోను ఇలాంటి వైవిధ్యం ఉంటుంది. వివిధ ఈవెంట్లలో పాల్గొనడం వల్ల పతకాలు గెల్చుకునే అవకాశాలు ఎలాగైతే మెరుగుపడతాయో వివిధ రంగాలవ్యాప్తంగా పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లార్జ్ క్యాప్ ఫండ్స్ రిసు్కలను తగ్గించుకుని మెరుగైన రాబడులు అందించేందుకు ఉపయోగకరంగా ఉంటాయి.సురేశ్ సోని - సీఈవో, బరోడా బీఎన్పీ పారిబా అసెట్ మేనేజ్మెంట్ ఇండియా -
నమ్మకమైన రాబడులకు పెట్టుబడులు పెట్టే స్కీమ్..
లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే పథకం ఇది. గతంలో మిడ్‌క్యాప్ పథకంగా ఉండగా, సెబీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వ్యస్థీకరణ ఆదేశాల నేపథ్యంలో.. లార్జ్, మిడ్‌క్యాప్ పథకంగా మారింది. లార్జ్, మిడ్‌క్యాప్ మధ్య పెట్టుబడులను వర్గీకరిస్తుంది. బీఎస్ఈ లార్జ్ మిడ్‌క్యాప్ టీఆర్ఐ సూచీని ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా భావిస్తున్నారు. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు దీర్ఘకాలం కోసం ఈ పథకాన్ని పెట్టుబడుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. లార్జ్‌క్యాప్ కంపెనీలలో పెట్టుబడులకు రిస్క్ తక్కువగా ఉంటుంది. రాబడుల్లోనూ స్థిరత్వం ఉంటుంది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో అస్థిరతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెడతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడుల విధానం మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రంగాల వారీ, పెట్టుబడుల కేటాయింపుల విధానాలను ఈ పథకం మార్చుకుంటూ ఉంటుంది. 2014, 2017 మార్కెట్ ర్యాలీ సమయాల్లో ఈ పథకం 99 శాతం వరకు పెట్టుబడులను ఈక్విటీల్లోనే కలిగి ఉంది. అలాగే, 2015, 2018, 2020 సంవత్సరాల్లో మార్కెట్లలో అస్థిరతలు పెరిగిన సందర్భాల్లో సురక్షిత రంగాలు, కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకోవడాన్ని గమనించొచ్చు. ఆ సమయంలో ఈక్విటీల్లో గరిష్ట పెట్టుబడులు 94–96 శాతం మధ్యే పరిమితం చేసింది. కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, ఫార్మా రంగాలను అస్థిరతల సమయాల్లో నమ్ముకున్నది. స్టాక్స్‌ను కొనుగోలు చేసి, దీర్ఘకాలం పాటు అందులో కొనసాగడం అనే విధానాన్ని పాటిస్తోంది. రాబడులు ఈ పథకం ఏడాది కాలంలో ఇచ్చిన రాబడులు 25.66 శాతంగా ఉన్నాయి. ఏడాది కాలంలో బీఎస్ఈ లార్జ్‌మిడ్‌క్యాప్ టీఆర్ఐ రాబడులు కూడా ఇంచు మించు ఇదే స్థాయిలో ఉన్నాయి. ఈ పథకం మూడేళ్ల కాలంలో ఏటా 18 శాతం చొప్పున రాబడులను అందించింది. ఐదేళ్లలో 18 శాతం, ఏడేళ్లలో 17.20 శాతం, పదేళ్లలో 21.83 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్ని ఇన్వెస్టర్లకు పంచిపెట్టింది. బీఎస్ఈ లార్జ్ మిడ్‌క్యాప్ టీఆర్ఐతో పోలిస్తే ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకంలోనే అధిక రాబడి ఉంది. పోర్ట్‌ఫోలియో ఈ పథకం 60–70 స్టాక్స్‌తో చక్కని వైవిధ్యాన్ని పాటిస్తోంది. ప్రస్తుతం 67 స్టాక్స్ ఉన్నాయి. ఈ పథకం నిర్వహణలో 18,845 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఈక్విటీలకు 97.37 శాతాన్ని కేటాయించింది. నగదు, నగదు సమానాల్లో 2.63 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 67.58 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 32 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. స్మాల్‌క్యాప్ కేటాయింపులు అరశాతానికే పరిమితమయ్యాయి. వీలైనంత వరకు రిస్క్‌ను తగ్గించి, మెరుగైన, స్థిరమైన రాబడిని అందించే వ్యూహం ఈ పథకం పెట్టుబడుల వెనుక కనిపిస్తోంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 28 శాతం కేటాయింపులను ఈ రంగం కంపెనీలకే కేటాయించింది. ఆటోమొబైల్ రంగ కంపెనీలకు 14 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 11.46 శాతం కేటాయింపులు చేసింది. సేవల రంగ కంపెనీల్లో 8 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 7 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. -
ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటీ? తెలుసుకోండిలా..
స్టాక్‌మార్కెట్‌పై ఇండియన్లలో ఆసక్తి పెరుగుతోంది. ఇటీవల కాలంలో పెరుగుతున్న డిమ్యాట్ ఖాతాలే ఇందుకు నిదర్శనం. షేర్మార్కెట్లో తక్కువ రిస్క్‌తో ఎక్కువ రాబడి పొందడమనేది ఎంతో కీలకం. ఇందుకు అనుగుణంగా ఉండే వాటిలో ఫ్లెక్సీక్యాప్ పథకం ఒకటి. అసలు ఫ్లెక్సీక్యాప్ అంటే ఏంటీ ? ఇటీవల అధికంగా లాభాలు అందిస్తోన్న ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్కి సంబంధించిన వివరాలు... ఫ్లెక్సీక్యాప్ ఫ్లెక్సీక్యాప్ పథకాలు గతంలో మల్టీక్యాప్ ఫండ్స్ పేరుతో ఉండేవి. మల్టీక్యాప్ పథకాలు కచ్చితంగా స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్ పథకాల్లో 25 శాతం చొప్పున కనీస పెట్టుబడులను నిర్వహించాల్సిందేనని.. లేదంటే ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి మారిపోవచ్చంటూ సెబీ గతేడాది నిబంధనలను కఠినతరం చేసింది. దీంతో మల్టీక్యాప్ విభాగం నిబంధనలను కట్టుబడలేని పథకాలు ఫ్లెక్సీక్యాప్గా పేరు మార్చుకున్నాయి. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ గడిచిన కొన్నేళ్లలో ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఇన్వెస్టర్లకు మంచి రాబడులను ఇచ్చాయి. ఫ్లెక్సీ క్యాప్ విభాగంలో మార్కెట్ విలువ పరంగా తమకు అనుకూలం అనిపించిన, భవిష్యత్తులో మంచి వృద్ధికి అవకాశం ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకునే స్వేచ్ఛ ఫండ్ మేనేజర్లకు ఉంటుంది. ఫలానా విభాగంలో (స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్) కచ్చితంగా ఇంత మేర పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనలు ఈ పథకాలకు వర్తించవు. ఈ విభాగంలో కొన్ని పథకాలు గడిచిన ఏడాది కాలంలో గణణీయమైన రాబడులను అందించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం (కనీసం పదేళ్లు అంతకుమించి) ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో ఫ్లెక్సీక్యాప్ పథకాలకు కొంత చోటు కల్పించుకోవచ్చు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ కూడా ఒకటి. రాబడులు గడిచిన ఏడాది కాలంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ ఇన్వెస్టర్లకు 58 శాతం రాబడులను ఇచ్చింది. కానీ ఇదే కాలంలో ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడులు 51 శాతంగానే ఉండడాన్ని గమనించాలి. బీఎస్ఈ 500 సూచీ రాబడులు 53 శాతంతో పోల్చినా ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ పథకం మెరుగైన పనితీరును చూపించినట్టు తెలుస్తోంది. ఇక గత మూడేళ్ల కాలంలో ఈ పథకం ఏటా 14 శాతానికి పైనే సగటు వార్షిక రాబడులను ఇచ్చింది. అంతేకాదు ఐదేళ్లలోనూ, ఏడేళ్లలోనూ, పదేళ్లలో కూడా వార్షిక సగటు రాబడులు 15 శాతం స్థాయిలోనే ఉన్నాయి. నిలకడైన పనితీరును ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. లక్ష ఇన్వెస్టే చేస్తే కోటి రూపాయలు ఆదిత్య బిర్లా ఫెక్సీక్యాప్ పథకంలో 22 ఏళ్ల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి అలాగే కొనసాగించి ఉంటే ప్రస్తుతం రూ.1.04 కోట్లు సమకూరేది. అంటే 104 రెట్లు వృద్ధి చెందేది. వార్షికంగా 22.57 శాతం చొప్పున కాంపౌండింగ్ రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఫ్లెక్సీక్యాప్ పథకాల్లో రిస్క్ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో ఈ రిస్క్‌ను మించి రాబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. బ్యాంకింగ్, ఫైనాన్స్‌పై దృష్టి ప్రస్తుతం ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లెక్సీక్యాప్ పథకం నిర్వహణలో రూ.14,571 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. 96.2 శాతం ఈక్విటీల్లో, డెట్ సాధనాల్లో 3.5 శాతం చొప్పున పెట్టుబడులున్నాయి. పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతానికి 65 స్టాక్స్‌ను నిర్వహిస్తోంది. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 68 శాతం, మిడ్‌క్యాప్‌లో 25 శాతం, స్మాల్‌క్యాప్‌లో 7 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 26 శాతం పెట్టుబడులు ఈ విభాగంలోనే ఉన్నాయి. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీల్లో 14 శాతం, హెల్త్‌కేర్ కంపెనీల్లో 13 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. ఆయా రంగాల్లో దిగ్గజ కంపెనీలు, బలమైన యాజమాన్యాలు, కార్పొరేట్ పాలనలో పారదర్శకత, బలమైన బ్యాలన్స్ షీట్ ఇటువంటి అంశాల ఆధారంగా కంపెనీలను ఫండ్ మేనేజర్లు ఎంపిక చేసుకుంటారు. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంకు 8.77 ఇన్ఫోసిస్ 8.46 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 7.05 డాక్టర్ రెడ్డీస్ 6.19 భారతీ ఎయిర్టెల్ 4.35 హెచ్‌సీఎల్ టెక్ 3.66 సన్‌ఫార్మా 2.75 బజాజ్ ఫైనాన్స్ 2.45 కోటక్ బ్యాంకు 2.24 ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ 2.22 -
రాబడుల్లో మేటి పనితీరు
ఈక్విటీ ఇన్వెస్టర్లకు గడిచిన ఏడాది, రెండేళ్లు పరీక్షా కాలం వంటిది. ఎన్నో అనిశ్చితులు, ఆందోళనలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. సూచీల్లో పెరుగుదల ఉన్నా కానీ, రిటైల్ ఇన్వెస్టర్లు రాబడులు పొందిందీ లేదు. కొందరు నష్టాలు కూడా చవిచూశారు. మార్కెట్ అంతటా పెరుగుదల లేకపోవడమే దీనికి కారణం. కేవలం కొన్ని కంపెనీలే మార్కెట్ పెరుగుదలకు దోహదపడ్డాయి. అందుకే అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్ లీడర్లుగా ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం తెలివైన వ్యూహం అవుతుంది. కనుక భిన్న మార్కెట్ పరిస్థితుల్లో అద్భుత పనితీరు చూపించిన లార్జ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలనేది మా సూచన. యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విధానం యాక్సిస్ బ్లూచిప్ అన్నది లార్జ్‌క్యాప్ ఫండ్. మంచి వ్యాపార నాణ్యత కలిగిన లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. పోర్ట్‌ఫోలియో పరంగా వైవిధ్యాన్ని కూడా గమనించొచ్చు. 2016 నవంబర్ నుంచి ఈ పథకాన్ని శ్రేయాష్ దేవల్కర్ నిర్వహిస్తున్నారు. బోటమ్ అప్ విధానంలో స్టాక్స్‌ను, ఫండమెంటల్స్(వ్యాపార మూలాలు), వృద్ధి అవకాశాలు, ఆయా కంపెనీలకు పోటీ పరంగా ఉన్న అనుకూలతలు వంటి అంశాల ఆధారంగా ఈ పథకం పెట్టుబడుల కోసం ఎంపిక చేసుకుంటుంది. పథకం నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 80–100% వరకు అధిక నాణ్యత కలిగిన పెద్ద కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. లార్జ్‌క్యాప్ కంపెనీలు ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని స్తాయి. వ్యాపార కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉండడం, నిధుల వ్యయాలు తక్కువగా ఉండడం వల్ల ఆర్థిక మందగమన ప్రభావం వీటిపై తక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం ఫైనాన్షియల్, టెక్నాలజీ స్టాక్స్‌లో ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈ రెండు రంగాల స్టాక్స్‌లో వరుసగా 45%, 14% చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. రాబడుల పనితీరు ఈ పథకం నిర్వహణలో సెప్టెంబర్ నాటికి రూ.8,050 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రాబడులకు సంబంధించి మంచి చరిత్ర ఉంది. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షికంగా 15.95 శాతం రాబడులిచ్చింది. ఐదేళ్లలో.. వార్షిక పనితీరు 12.30%. కానీ, ఇదే కాలంలో పోటీ పథకాలు ఇచ్చిన రాబడులు మూడేళ్లలో 10.57%, ఐదేళ్లలో 9.26%గానే ఉన్నాయి. ఈ పథకం ప్రారంభం నాటి నుంచి ప్రతీ నెలా రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే 2019 సెప్టెంబర్30 నాటికి రూ.11.9 లక్షల సంపద సమకూరేది. ఇందులో అసలు పెట్టుబడి రూ.5.8 లక్షలు. ఈ పథకంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనీసం రూ.5,000 నుంచి..; సిప్ రూపంలో అయితే ప్రతీ నెలా కనీసం రూ.500 మొత్తంతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ రూపంలో కనీసం ఆరు నెలల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం, దీర్ఘకాలంలో సంపద సమకూర్చుకోవాలనుకునే వారు కనీసం ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి?
మిడ్‌క్యాప్ ఫండ్స్ అంటే ఏమిటి? ఈ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో అన్నీ మిడ్‌క్యాప్ కంపెనీలే ఉంటాయా? లేకుంటే లార్జ్‌క్యాప్ కంపెనీల షేర్లు కూడా ఉంటాయా? ఒక ఇన్వెస్టర్ ఈ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఎంత మేరకు ఇన్వెస్ట్ చేయవచ్చు? ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని మంచి మిడ్‌క్యాప్ ఫండ్స్‌ను సూచించండి. – చక్రవర్తి, విజయవాడ మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను సాధారణంగా మిడ్ క్యాప్ ఫండ్స్‌గా వ్యవహరిస్తారు. అయితే అన్ని ఫండ్స్ అలాగే ఉండాలని రూలేమీ లేదు. ఉదాహరణకు హెచ్డీఎఫ్సీ మిడ్–క్యాప్ ఆపర్చునిటీ ఫండ్‌ను తీసుకుంటే, ఈ ఫండ్ తన పోర్ట్‌ఫోలియోలో 30 శాతం వరకూ లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్ పతనసమయాల్లో మిడ్‌క్యాప్ షేర్లు కూడా బాగా పతనమవుతాయి. మార్కెట్ క్షీణిస్తున్నప్పుడు వీటిని విక్రయించుకొని బయటపడడం కొంచెం కష్టమైన పనే. అందుకని మిడ్‌క్యాప్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలో లార్జ్‌క్యాప్ కంపెనీలు ఉంటే, ఆ ఫండ్‌కు తగిన లిక్విడిటీ ఉంటుంది. తమ పోర్ట్‌ఫోలియోలో 70 శాతానికి పైగా మిడ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ను మిడ్‌క్యాప్ ఫండ్స్‌గా పరిగణించవచ్చు. మిడ్‌క్యాప్ కంపెనీలు లార్జ్‌క్యాప్ కంపెనీల కంటే వేగంగా వృద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉంటాయి. మరోవైపు భారీగా నష్టపోయే అవకాశాలూ ఉంటాయి. ఒక ఫండ్ మేనేజర్...తన అనుభవంతో... భవిష్యత్తులో వృద్ధిచెందే అవకాశాలున్న మిడ్‌క్యాప్ కంపెనీలను గుర్తించగలుగుతారు. అందుకని ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో తప్పనిసరిగా మిడ్‌క్యాప్ ఫండ్స్ ఉండాలి.. ఒక ఇన్వెస్టర్ తన పోర్ట్‌ఫోలియోలో 20–30 శాతం నిధులను మిడ్‌క్యాప్ ఫండ్స్‌కు కేటాయించవచ్చు. మీకు రిస్క్‌ను భరించే సామర్థ్యం అధికంగా ఉంటే 30–40 శాతం నిధులను మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక మీరు ఇన్వెస్ట్ చేయడానికి... మిరా అసెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మిడ్–క్యాప్ అపర్చునిటీస్ ఫండ్, కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ ఫండ్, బీఎన్పీ పారిబా మిడ్‌క్యాప్ ఫండ్స్‌ను పరిశీలించవచ్చు. రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఎన్సీడీలను పరిగణించవచ్చా? –ప్రదీప్, విశాఖపట్టణం రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం నాన్–కన్వర్టబుల్ డిబెంచర్లు(ఎన్సీడీ)లను పరిశీలించవచ్చు. ఇవి స్థిర ఆదాయాన్నిస్తాయి. అయితే వీటికి రిస్క్ వుంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన ఎన్సీడీలను జారీ చేసిన కంపెనీ పనితీరుని బట్టే మీ రాబడులు ఉంటాయి. అందుకని చాలా మంది ఫిక్స్డ్ ఇన్కమ్ ఫండ్స్‌కు ప్రాధాన్యత ఇస్తారు. ఒకటి లేదా రెండు కంపెనీల్లో చెప్పుకోదగిన మొత్తంలో ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. మొత్తం, వడ్డీ చెల్లింపుల్లో సదరు కంపెనీ విఫలమైన సందర్భంలో మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఇలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకని రిటైర్మెంట్ నిధి కోసం ప్లాన్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మొత్తం నిధుల్లో కనీసం మూడో వంతు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీరు మంచి రాబడులు పొందవచ్చు. నా పోర్ట్‌ఫోలియోను నేను రీబ్యాలన్స్ చేసుకోగలను. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరముందా? – నాగరాజ్, హైదరాబాద్ ప్రతి ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో బ్యాలన్స్డ్ ఫండ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. మీ పోర్ట్‌ఫోలియోను మీరు రీ బ్యాలన్స్ చేసుకోగలిగినా సరే బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాల్సిందే. సాధారణంగా రెండు ప్రయోజనాల కోసం బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. మొదటిది బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో రీబ్యాలన్స్ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. ఇలాంటి రీబ్యాలన్సింగ్ వల్ల పన్ను భారం ఏమీ ఉండదు. ఫండ్ మేనేజర్లు చేసినంత సమర్థంగా ఒక సాధారణ ఇన్వెస్టర్ (స్టాక్‌మార్కెట్ పట్ల తగిన అవగాహన ఉన్నప్పటికీ) పోర్ట్‌ఫోలియోను రీబ్యాలన్స్ చేయలేరు. ఇక రెండో ప్రయోజనం.. పన్ను ప్రయోజనాలు. ఒక బ్యాలన్స్డ్ ఫండ్ తన నిధుల్లో 35% వరకూ స్థిర ఆదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ, బ్యాలన్స్డ్ ఫండ్స్‌ను ట్యాక్స్ పరంగా ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. అంటే ఈక్విటీ ఫండ్స్‌కు ఎలాంటి పన్ను నియమ నిబంధనలు వర్తిస్తాయో, బ్యాలన్స్డ్ ఫండ్స్‌కు కూడా అలాంటి నిబంధనలే వర్తిస్తాయి. పన్ను అంశాల పరంగా ఫండ్స్ అన్నింటిలోనూ ఈక్విటీ ఫండ్స్ ఉత్తమమైనవన్న విషయం తెలిసిందే. ఒక బ్యాలన్స్డ్ ఫండ్ తన నిధుల్లో 35 శాతం వరకూ స్థిర ఆదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది....కాబట్టి స్టాక్ మార్కెట్ పతనమైతే, ఈక్విటీ ఫండ్స్‌లా ఎక్కువగా నష్టపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకని ప్రతి ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోలో బ్యాలన్స్డ్ ఫండ్ తప్పనిసరిగా ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వస్తా యని చెబుతుంటారు కదా ! కానీ చాలా ఫండ్స్ గత ఐదేళ్ల కాలం కంటే గత మూడేళ్ల కాలంలోనే అధిక రాబడులను ఇచ్చాయి. ఎందుకిలా? – జాహ్నవి, బెంగళూరు మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు వచ్చే మాట వాస్తవమే. అయితే మూడేళ్ల క్రితం స్టాక్‌మార్కెట్ కనిష్ట స్థాయిలో ఉంది. అదే ఐదేళ్ల కాలాన్ని తీసుకుంటే స్టాక్ మార్కెట్ ఒకింత మెరుగైన స్థాయిలో ఉంది. అందుకని చాలా ఫండ్స్ గత ఐదేళ్ల కాలం కంటే గత మూడేళ్ల కాలంలోనే అధిక రాబడులను ఇచ్చాయి. చాలా ఫండ్స్ గత మూడేళ్ల కాలంలో 25% వరకూ రాబడులనిస్తే, ఇవే ఫండ్స్ గత ఐదేళ్ల కాలంలో ఈ స్థాయిలో రాబడులను ఇవ్వలేదు. మ్యూచువల్ ఫండ్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే రాబడులు కాలాన్ని బట్టి మారుతుంటాయి. పదేళ్లు అంతకు మించిన కాలాన్ని(ఈ కాలం ఒక పూర్తి మార్కెట్ సైకిల్‌ను ప్రతిబింబిస్తుంది) మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, వాటిపై రాబడులు నిలకడగా, అధికంగా ఉంటాయి.