ముంబై: ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి సలహాలపట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని దిగ్గజ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్‌ఎస్‌ఈ తాజాగా పేర్కొంది. ఏంజెల్‌వన్ ఆల్గో సంస్థ పేరుతో శ్రేయా మిశ్రా అనే వ్యక్తి సెక్యూరిటీల మార్కెట్ సలహాలు(టిప్స్) ఇస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలియజేసింది.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై లాభాల హామీతో 8347070395 మొబైల్ నంబరుతో ట్రేడింగ్‌కు సలహాలు ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ సంస్థతో తమకెలాంటి సంబంధంలేదని ఎక్సే్ఛంజీలో ట్రేడింగ్ సభ్యులుగా రిజిస్టరైన ఏంజెల్ వన్ లిమిటెడ్ తాజాగా ఎన్‌ఎస్‌ఈకి స్పష్టం చేసినట్లు తెలియజేసింది.
చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ టిప్స్ ఇస్తున్న ఇలాంటి సంస్థలు లేదా వ్యక్తులపట్ల ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాల్సిందిగా ఒక ప్రకటనలో సూచించింది. ఎన్‌ఎస్‌ఈ వెబ్‌సైట్ నుంచి ''https:// www.nseindia.com/ invest/ find& a& stock& broker'' లింక్ ద్వారా మీ స్టాక్ బ్రోకర్ గురించి తెలుసుకునేందుకు వీలు కల్పించినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment