
న్యూఢిల్లీ: అగ్రిటెక్ స్టార్టప్ దేహాత్ రూ.486 కోట్ల నిధులను సమీకరించింది. సోఫినా వెంచర్స్, టెమసెక్‌తోపాటు ఇప్పటికే కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఆర్‌టీపీ గ్లోబల్ పార్ట్‌నర్స్, ప్రోసస్ వెంచర్స్, లైట్‌రాక్ ఇండియా ఈ మొత్తాన్ని సమకూర్చాయి.
కంపెనీ నిధులు సమీకరించడం గడిచిన రెండేళ్లలో ఇది మూడోసారి. 2012లో దేహాత్ ఏర్పాటైంది. 10,000లకు పైచిలుకు దేహాత్ సెంటర్స్ ద్వారా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 15 లక్షల మంది రైతులను డిజిటల్ వేదికగా కొనుగోలుదార్లతో అనుసంధానించింది.
Comments
Please login to add a commentAdd a comment