న్యూఢిల్లీ: స్టాక్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయిన దగ్గర్నుంచి ఇష్యూ ధర కన్నా దిగువనే ట్రేడ్ అవుతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) పనితీరును మార్చడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పూర్తి సామర్థ్యం మేరకు పనిచేసి అధిక లాభాలు ఆర్జించడంపైనా, ఇన్వెస్టర్లకు మరింత రాబడులు అందించడంపైనా దృష్టి సారించాలని ఒత్తిడి పెంచుతోంది. (Jay Y Lee శాంసంగ్‌కు కొత్త వారసుడు, కొత్త సవాళ్లు)
ఇందులో భాగంగా కొత్త తరాన్ని కూడా ఆకర్షించేలా పథకాల వ్యూహాలను మార్చుకోవాలని, లాభ దాయకతను పెంచేలా మరిన్ని టర్మ్ ప్లాన్లను ప్రవేశపెట్టడాన్ని పరిశీలించాలని ఆర్థిక శాఖ సమీక్షలో సూచించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ చేయడం ద్వారా 65 ఏళ్ల సంస్థను ఆధునీకరించే ప్రక్రియ ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. (Elon Musk ట్విటర్ డీల్ డన్: మస్క్ తొలి రియాక్షన్)
అలాగే పథకాలను కూడా ఆధునీకరించేలా మేనేజ్‌మెంట్‌తో కలిసి పని చేస్తు న్నట్లు అధికారి వివరించారు. రూ. 902-949 ధర శ్రేణితో ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. దీని ద్వా రా ప్రభుత్వ ఖజానాకు రూ. 21,000 కోట్లు వచ్చాయి. (Hero MotoCorp ఫిలిప్పైన్స్‌లో హీరో మోటోకార్ప్ ఎంట్రీ, కీలక డీల్ )
అయితే, మే 17న లిస్టింగ్ తొలి రోజే ఇష్యూ ధర కన్నా తక్కువగా రూ. 872 వద్ద లిస్టయిన ఎల్ ఐసీ షేరు అప్పటి నుంచి కోలుకోలేదు. ప్రస్తు తం రూ. 595 దగ్గర ట్రేడవుతోంది. కానీ వచ్చే ఏడా ది వ్యవధిలో ఎల్‌ఐసీ షేరు బాగా రాణిస్తుందని కొన్ని బ్రోకరేజీలు బులిష్‌గా ఉన్నాయి. రేటు రూ. 1,000 స్థాయికి చేరవచ్చని సిటీ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment